గుడ్‌న్యూస్ అబ్బాయిలూ.. ఏనుగు లాంటి కొత్త కీవే ఆర్‌ఆర్300 బైక్ వచ్చేసింది, ధర చాలా తక్కువ
హంగేరీకి చెందిన కీవే చిన్న, మధ్య తరహా ద్విచక్ర వాహనాల తయారీకి పేరుగాంచింది. భారత మార్కెట్‌లో ఈరోజు ఆర్‌ఆర్300 పేరుతో సరికొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఇది అత్యాధునిక డిజైన్, ఫీచర్లను కలిగి ఉంది. అంతేకాకుండా, సరసమైన ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ కొత్త బైక్ ధర మరియు ప్రత్యేకతల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కొత్త కీవే ఆర్‌ఆర్300 మోటార్‌సైకిల్ తక్కువ ధరలోనే మార్కెట్‌లోకి వచ్చింది. దీని ధర రూ.1.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). యువ కస్టమర్‌లు దీనిని సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది, జులై చివరి నాటికి డెలివరీలు మొదలవుతాయి.

కొత్త కీవే ఆర్‌ఆర్300 బైక్ స్పోర్టీ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది గతంలో దేశీయంగా అమ్ముడైన కీవే కె300ఆర్ మోటార్‌సైకిల్ రీ-బ్రాండెడ్ మోడల్ కూడా. ఇది అద్భుతమైన హెడ్‌లైట్, బూమరాంగ్ ఆకారంలో ఉండే ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌ను కలిగి ఉంది. తెలుపు, నలుపు, ఎరుపు రంగులలో కూడా అందుబాటులో ఉంది.
ఈ మోటార్‌సైకిల్ శక్తివంతమైన పవర్‌ట్రైన్‌ను కలిగి ఉంది. ఇది 292 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 8,750 ఆర్‌పీఎం వద్ద 27.5 బీహెచ్‌పి హార్స్ పవర్, 7,000 ఆర్‌పీఎం వద్ద 25 ఎన్‌ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది.

కొత్త కీవే ఆర్‌ఆర్300 బైక్ టీఎఫ్‌టీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఇది 139 కేఎంపీహెచ్ టాప్ స్పీడ్‌ను కలిగి ఉంది. 165 కేజీ బరువుతో, ఇది 12 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయెల్ ట్యాంక్‌ను కలిగి ఉంది. దీని వీల్‌బేస్ 1360 ఎంఎం కొలతను కలిగి ఉంది.
కొత్త కీవే ఆర్‌ఆర్300 మోటార్‌సైకిల్ రైడర్‌ల రక్షణ కోసం ముందు వైపు యూఎస్‌డీ ఫోర్క్స్, వెనుక వైపు ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఆప్షన్‌ను కలిగి ఉంది. డ్యుయల్ ఛానెల్ ఏబీఎస్ (ABS - యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), డిస్క్ బ్రేక్‌లు అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.

కీవే విక్రయించే ఇతర ప్రముఖ బైక్‌లు ఏంటో తెలుసా?
కీవే ఎస్‌ఆర్125 : ఈ మోటార్‌సైకిల్ ధర రూ.1.23 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 125 సీసీ సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది, 50 కి.మీ వరకు మైలేజ్ అందిస్తుంది. ఇది ఫుల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఇది సుమారు 120 కేజీ బరువుతో, 14.5-లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్‌ను కలిగి ఉంది. సిబిఎస్, డిస్క్ బ్రేక్‌లు కూడా ఉన్నాయి.
కీవే ఎస్‌ఆర్250 : దీని ధర రూ.1.52 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 223 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్/ఆయిల్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్, 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. ఇది 40 కి.మీ వరకు మైలేజ్ అందిస్తుంది. ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంది. ఇది 120 కేజీ బరువుతో, 14.5 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయెల్ ట్యాంక్‌ను, డబుల్ డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








