మార్కెట్లోకి 40 ఏళ్ల సంచలన స్కూటర్! కేవలం రూ.1000 చాలు.. నాడు తాతయ్య వాడింది.. నేడు EVగా లాంచ్

ఎన్నో గుర్తుల్ని, జ్ఞాపకాల్ని మళ్లీ తెచ్చేలా... కైనెటిక్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (KEL)తన ప్రతిష్టాత్మక స్కూటర్ డీఎక్స్(DX) ను ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనంగా మార్చి విడుదల చేసింది. కాలంతో పాటు మారుతున్న ట్రెండ్‌లకు అనుగుణంగా, భారత్‌లో ఈ సరికొత్త DX ఎలక్ట్రిక్ స్కూటర్ (DX Electric Scooter) లాంచ్ అయింది. 1980లలో మనకు సుపరిచితమైన కైనెటిక్ హోండా DXను పూర్తిగా కొత్త రూపంలో, ఎలక్ట్రిక్ అవతారంలో మన ముందుకు తీసుకురావడంలో కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటో చెప్పకనే చెబుతుంది. ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి తన పాత జ్ఞాపకాల్ని ఇప్పటి తరానికి పరిచయం చేయడానికి కైనటిక్ DX ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎంతో అట్టహాసంగా ఈ రోజు విడుదల చేసింది.

ధరల విషయానికొస్తే, వినియోగదారుల బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని రెండు వేరియంట్లను అందుబాటులోకి తెచ్చారు. DX వేరియంట్ ధర రూ.1.11 లక్షలు (ఎక్స్-షోరూమ్), DX+ వేరియంట్ ధర రూ.1.17 లక్షలు (ఎక్స్-షోరూమ్). దేశంలోని అన్ని వర్గాల ప్రజలు కొనుగోలు చేయగలిగే విధంగా అందుబాటు ధరలో లాంచ్ అయింది. ఇది దాని మునుపటి ప్రత్యేకతను నిలుపుకుంటూనే, ఇప్పుడు మరింత స్టైలిష్‌గా, మరింత ఫంక్షనల్‌గా రూపుదిద్దుకుంది. దీంతో కంపెనీకి తిరిగి మంచి రోజులు రాబోతున్నాయి.

Kinetic Dx Electric Scooter

ఈ స్కూటర్ రూపకల్పనలో ఇటలీకి చెందిన ప్రముఖ డిజైనర్లను భాగస్వాములుగా చేసుకోవడం ద్వారా, క్లాసిక్ స్టైల్‌కు ఆధునికతను మేళవించారు. ఇది కేవలం బైక్ కాదు, కుటుంబం అంతా నమ్మకంగా వాడగలిగే ఫ్యామిలీ వాహనంగా రూపుదిద్దుకుంది. ఒకప్పుడు వీధుల్లోకి వచ్చిన సౌండ్‌ను గుర్తుచేస్తూ... ఇప్పుడు ఇది సైలెంట్ స్టైల్‌తో ఎలక్ట్రిక్ గా మన ముందుకొచ్చింది. ఈ ధరలో, స్టైల్‌, సామర్థ్యం, నమ్మకాన్ని కలిపిన ఓ లెజెండరీ బ్రాండ్ తిరిగి రావడం సంతోషం.

కైనెటిక్ DX EV బలమైన నిర్మాణంతో పాటు, వెడల్పైన ఫ్లోర్‌బోర్డ్‌తో ఇది అన్ని వయసుల ప్రయాణికులకు అనువుగా ఉంటుంది. అయితే ఇందులో ఉన్న అసలైన ఆకర్షణ, దాని భారీ 37 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్. ఇది అత్యధిక నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉండే స్థలంగా గుర్తింపు పొందుతోంది. ఒక పూర్తి హెల్మెట్, ఒక హాఫ్ హెల్మెట్ తో పాటు రోజువారీ అవసరాల కోసం కొన్ని వస్తువులు కూడా ఇందులో వేసుకోవచ్చు.

Kinetic Dx Electric Scooter Design

ఈ స్కూటర్‌లో ఉన్న ముఖ్యమైన హైలైట్.. దీని LFP బ్యాటరీ. ఇది Range-X తయారుచేసిన 2.6 kWh సామర్థ్యం గల బ్యాటరీ, సాధారణంగా మార్కెట్‌లో ఉన్న NMC బ్యాటరీలతో పోలిస్తే 4 రెట్లు ఎక్కువ లైఫ్‌టైం కలిగి ఉంటుంది. దాదాపు 2500 నుంచి 3500+ ఛార్జింగ్ సైకిళ్లు వరకు వస్తుంది. K-Coast రెజెనరేటివ్ టెక్నాలజీతో కూడిన ఈ బ్యాటరీ, 60V సిస్టమ్ ద్వారా అధిక సామర్థ్యాన్ని అందిస్తుంది.

DX+ వేరియంట్‌ 116 కిలోమీటర్ల వరకు IDC రేంజ్‌‌ను అందిస్తుంది. ఇది రోజువారీ అవసరాలకు సరిపడే రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ స్కూటర్‌లో ఉన్న శక్తివంతమైన మోటార్ గరిష్టంగా 90 కి.మీ/గం వేగాన్ని అందించగలదు. రైడర్ అవసరానికి అనుగుణంగా మూడురకాల మోడ్‌లు.. Range, Power, Turbo లలో ఎంచుకునే అవకాశం ఉంది.

Kinetic Dx Electric Scooter Battery

కైనెటిక్ DX ఈవీ స్కూటర్‌కు ప్రత్యేకంగా మొబైల్ యాప్ అందుబాటులో ఉంది, దీని ద్వారా వినియోగదారులు తమ వాహనాన్ని రియల్‌టైమ్‌లో ట్రాక్ చేయవచ్చు. ఇందులో ప్రత్యేకంగా ఉన్న DX+ వేరియంట్ మరింత అధునాతన ఫీచర్లతో రైడర్ అనుభవాన్ని ఇంకాస్త మెరుగుపరుస్తుంది. ఇందులో టెలికైనెటిక్ టెక్నాలజీ ద్వారా రియల్‌టైమ్ రైడ్ స్టాట్స్ & వెహికల్ డేటా, జియో-ఫెన్సింగ్, అలర్ట్ Find My Kinetic, Track My Kinetic వంటివి ఉంటాయి.

ఇది భద్రత, పనితీరు పై వాయిస్‌ అలర్ట్స్ ఇస్తుంది. అంతేకాక, వినియోగదారుడి పుట్టినరోజున శుభాకాంక్షలు కూడా తెలుపుతుంది! ఇక రెండు వేరియంట్లలోనూ ప్రత్యేకంగా Kinetic Assist Switch ఉంటుంది, దీని ద్వారా బ్లూటూత్ ద్వారా కస్టమర్ కేర్ కనెక్ట్ పొందవచ్చు. అలాగే, స్కూటర్‌లో బిల్ట్-ఇన్ స్పీకర్ ద్వారా మ్యూజిక్ ప్లేబ్యాక్, వాయిస్ నావిగేషన్ వంటి బ్లూటూత్ ఫీచర్లు కూడా లభిస్తాయి.

Kinetic Dx Price

కంపెనీ ఈ స్కూటర్ బుకింగ్‌లను కేవలం 35,000 యూనిట్లకు పరిమితం చేసింది. డెలివరీలు సెప్టెంబర్ 2025 నుంచి ప్రారంభం కానున్నాయి. వినియోగదారులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి కేవలం రూ.1000 తో ముందస్తుగా బుకింగ్ చేసుకోవచ్చు. కలర్స్ విషయానికి వస్తే, DX+ మోడల్ రెడ్, బ్లూ, వైట్, సిల్వర్, బ్లాక్, DX మోడల్ సిల్వర్, బ్లాక్‌లలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, July 28, 2025, 14:28 [IST]
English summary
Kinetic dx electric scooter launched in india price booking and features details
Read more on: #kinetic #new launches #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+