40 ఏళ్ల క్రితం పెద్ద సంచనలం సృష్టించిన టూవీలర్.. ఇప్పుడు మళ్లీ తిరిగి వస్తుంది?

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలదే రాజ్యంగా కనిపిస్తుంది. మార్కెట్లో విడుదల అవుతున్న చాలా ఫోర్ వీలర్, టూవీలర్స్‌లో ఈవీలే ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా టూవీలర్ తయారీదారులు మారుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా కొత్త ఎలక్ట్రిక్ బైకులను, స్కూటర్లను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ కంపెనీ 1980లలో మనకు సుపరిచితమైన కైనెటిక్ హోండా DXను ఇప్పుడు పూర్తిగా కొత్త రూపంలో, ఎలక్ట్రిక్ అవతారంలో మన ముందుకు తీసుకురాబోతోంది. kinetic Dx Electric Scooterను కైనెటిక్ గ్రీన్ జూలై 28న తమ కొత్త DX ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అధికారికంగా భారత మార్కెట్లో ఆవిష్కరించనుంది. రాబోయే ఈ కొత్త మోడల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ స్కూటర్‌ను 40 ఏళ్ల క్రితం లాంఛనంగా అందుబాటులోకి వచ్చిన కైనెటిక్ హోండా DX ఆధునిక రూపంగా బ్రాండ్ వర్ణిస్తోంది. అప్పట్లో ఎంతో మంది మోటారు సైకిల్ యజమానులకు అది మొదటి స్కూటర్‌గా అనుభవంగా ఉండేది. ఇప్పుడు అదే లెగసీకి ఆధునిక టచ్ కలిపి, బ్యాటరీ పవర్‌తో కొత్తగా తీసుకొస్తున్నారు. ప్రస్తుతం విడుదలైన మొదటి టీజర్‌లో స్కూటర్ రూపం, స్టాన్స్, డిజైన్ లాంగ్వేజ్ వంటివి హింట్ ఇస్తున్నాయి.

Kinetic Dx Electric Scooter

క్లాసిక్ స్టైల్‌కి మోడర్న్ ఎలిమెంట్స్‌ను కలిపిన డిజైన్ ఉండే అవకాశం ఉంది. కైనెటిక్ గ్రీన్ తన ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఆసక్తిని పెంచేలా తాజాగా ఒక టీజర్ వీడియోను విడుదల చేసింది. ఈ టీజర్‌లో ఫీచర్ల గురించి స్పష్టంగా తెలియజేయకపోయినా, కొన్ని కీలకమైన హింట్లు మాత్రం అందించాయి. ముఖ్యంగా, స్కూటర్ డిజైన్ లో నోస్టాల్జిక్ టచ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇది, గతంలోని కైనెటిక్ హోండా DX మోడల్‌కు ఓ ట్రిబ్యూట్ అనిపిస్తోంది.

ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం, పాత కైనెటిక్ మోడళ్లలో ఉన్న స్విచ్ గేర్‌లను మళ్లీ తీసుకొచ్చారు. ఇవే ఈ స్కూటర్‌కు క్లాసిక్ ఫీలింగ్‌ని తీసుకొస్తున్నాయి. స్కూటర్‌ను గతంలో ముంబై వీధుల్లో టెస్టింగ్ సమయంలో కూడా పలుమార్లు చూశారు. అప్పట్లో కనిపించిన ప్రోటోటైప్‌లో క్లాసిక్ హెడ్‌లైట్ డిజైన్, కైనెటిక్ లోగో ఆకారంలో DRLలు, చిన్న విండ్ స్క్రీన్ వంటి ఫీచర్లు స్పష్టంగా కనిపించాయి. ఇవన్నీ కూడా పాత DX స్కూటర్‌ను గుర్తుచేసేలా ఉంటాయి.

Kinetic Dx 40 Years

పై ఫోటోను https://kineticindia.com/ నుంచి తీసుకున్నాము. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎంట్రీ లెవల్ ప్రీమియం స్కూటర్‌గా మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ స్కూటర్ ధర రూ. 1 లక్ష లోపే ఉండే అవకాశం ఉంది, దీన్ని బట్టే ఇది యువత, అర్బన్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని తయారు చేసిన మోడల్ అనిపిస్తోంది. ఇంకా ఫుల్ స్పెసిఫికేషన్లు వెల్లడించనప్పటికీ, ఇప్పటికే కనిపించిన డిజైన్ వివరాల ఆధారంగా కొన్ని ముఖ్యమైన అంశాలు స్పష్టంగా తెలుస్తున్నాయి.

ఇది హబ్ మౌంటెడ్ మోటార్ ద్వారా ఇది పనిచేస్తుందనేది స్పష్టంగా కనిపిస్తోంది. దీని వలన మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది. 12 అంగుళాల చక్రాలు స్కూటర్‌కు మంచి స్టబిలిటీని ఇవ్వనున్నాయి. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్ ఉండగా, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నట్లు సమాచారం. ఇవి రైడ్ కంఫర్ట్‌ను పెంచేందుకు ఉపయోగపడతాయి.

Kinetic Dx Electric

ఈ స్పెసిఫికేషన్లు చూస్తుంటే, కైనెటిక్ గ్రీన్ ఈ స్కూటర్‌ను స్టైల్, కంఫర్ట్, డేలీ ప్రయాణాల అవసరాల కోసం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలకు వెళ్లేవారు, కాలేజ్ విద్యార్థులు మొదలగు అన్ని వర్గాల వారికి అన్ని వయస్సుల వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని తెలుస్తుంది. ప్రత్యేకంగా పాత కస్టమర్లకు గుర్తొచ్చేలా చేసిన డిజైన్‌తో పాటు, కొత్త తరం వినియోగదారులకు అనుగుణంగా ఫీచర్లు కలిపి ఈ మోడల్‌ను ఇప్పుడు తీసుకురావడం విశేషం.

More from DriveSpark

Article Published On: Tuesday, July 22, 2025, 15:03 [IST]
English summary
Kinetic dx electric version will launch in india on 28th july more details
Read more on: #kinetic #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+