రూ.1.2 లక్షల్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది? హోండా యాక్టివా-ఇ vs కైనటిక్ డీఎక్స్.. ఇద్దరికి టఫ్ ఫైట్!
పెట్రోల్ ధరలు ఎప్పుడు ఎంత పెరుగుతాయో ఎవరికి తెలియదు. నగరాల్లో ట్రాఫిక్ పెరుగుతోందంటే, స్కూటర్ అనేది ఇక కంఫర్ట్ మాత్రమే కాదు, అవసరం కూడా. ఈ నేపథ్యంలో బ్యాటరీ స్కూటర్ల పట్ల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఒకప్పుడు సైలెంట్‌గా నిలబడిన ఈ సెగ్మెంట్ ఇప్పుడు మరింత బాగా పుంజుకుంటుంది. దేశీయంగా ప్రజలు గతంలో ఈవీలను కొనుగోలు చేయాలంటే చాలా ఆలోచించే వారు. కానీ ఇప్పుడు ఆరోజులు పోయాయ్. ప్రభుత్వ ప్రోత్సాహం, బ్యాటరీల పనితీరు మెరుగవడం వంటి అంశాల కారణంగా జనాలు ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లను విరివిగా కొంటున్నారు. కంపెనీలు కూడా తక్కువ ధరల్లో, వాడటానికి సులువుగా ఉండే మోడళ్లను తీసుకొస్తుండటంతో ఈ రంగం మరింత వేగంగా మారుతోంది. ఈ క్రమంలో మార్కెట్లో వాటాను కైవసం చేసుకోవడానికి అన్ని వాహనాల తయారీదారులు ఈ విభాగంపై ఎక్కువ ఫోకస్ పెట్టారు.
అందులో భాగంగా దేశీయ అతిపెద్ద టూవీలర్ హోండా సంస్థ కూడా తన ప్రసిద్ధ యాక్టివా స్కూటర్‌ను అప్‌డేట్ చేసి ఎలక్ట్రిక్‌లో తీసుకొచ్చింది. యాక్టివా ఇ (Honda Activa-e) పేరుతో ఇది మార్కెట్లో అమ్మకానికి ఉంది. ఇదే సమయంలో వేరే కంపెనీల మోడళ్లు కూడా వస్తున్నాయి. తాజాగా కైనటిక్ కంపెనీ కూడా డీఎక్స్ (Dx) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చింది. కస్టమర్ల కోసం ఈ రెండింటి గురించి కింది కథనంలో ఇవ్వడం జరిగింది.

kinetic DX Electric Scooter: కైనటిక్ డీఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది 1980లలో బాగా ఫేమస్ అయినటువంటి హోండా DXకు పూర్తిగా కొత్త రూపంలో, ఎలక్ట్రిక్ అప్‌డేట్ వెర్షన్. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఒకటి DX , మరొకటి DX+. ధర విషయానికి వస్తే DX వేరియంట్ ధర రూ.1.11 లక్షలు కాగా, టాప్ ఎండ్ DX+ మోడల్ ధర రూ.1.17 లక్షలు(ఎక్స్-షోరూమ్).
రెండింట్లోనూ అదే 2.6 kWh సామర్థ్యం గల LFP బ్యాటరీని వాడారు. ఇవి ఇప్పటి వరకు ఎక్కువగా వినిపిస్తున్న NMC బ్యాటరీలతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ లైఫ్ కలిగి ఉంటాయి. DX+ ఒకసారి ఛార్జ్ చేస్తే 116 కిలోమీటర్ల వరకు IDC రేంజ్‌ను అందిస్తుంది. అదే స్కూటర్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, 4.8 kW పవర్ ఉన్న హబ్ మౌంటెడ్ మోటార్ గరిష్టంగా 90 కి.మీ. వేగాన్ని అందించగలదు.

ఈ-స్కూటర్‌లో 37 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. ఈ రెండు వేరియంట్లు కూడా బ్లూటూత్ కనెక్టివిటీకి సపోర్ట్ ఇస్తాయ్. ఇంకా యాంటీ-థెఫ్ట్ అలర్ట్, జియోఫెన్సింగ్ వంటివి కూడా ఉన్నాయి. ఛార్జింగ్ విషయానికి వస్తే, 2 గంటల్లో 0 నుండి 50 శాతం, 3 గంటల్లో 0 నుండి 80 శాతం, 4 గంటల్లో అయితే బ్యాటరీ ప్యాక్ పూర్తి ఛార్జ్ చేయబడుతుందని కంపెనీ తెలిపింది.
Honda Activa e: హోండా కంపెనీకి చెందిన యాక్టివా ఐసీఈ స్కూటర్‌ను కంపెనీ ఎలక్ట్రిక్ వేరియంట్‌లో యాక్టివా ఇ పేరుతో తీసుకొచ్చారు. దీని ధర రూ.1.17 లక్షల నుంచి రూ.1.52 లక్షల(ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇందులో రెండు 1.5 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 102 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. ఇది బాస్ పథకం ద్వారా కూడా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

దీనిలో బ్యాటరీ ఫిక్స్‌డ్‌గా ఉండదు. బయటకు తీసి ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం పెట్రోల్ బంక్‌కి వెళ్లినట్టు, ఇప్పుడు బ్యాటరీ స్టేషన్ల దగ్గరకి వెళ్లి కొంత సేపు ఆగకుండా బ్యాటరీ మార్చేసుకొని వెళ్లిపోవచ్చు అన్న మాట. యాక్టివా-ఇ లో ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, LED లైటింగ్, రివర్స్ మోడ్,26-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్, స్మార్ట్ కీకి బదులుగా సాధారణ అనలాగ్ యూనిట్, కీలెస్ స్టార్ట్, కనెక్టివిటీ ఫీచర్లు వంటివి ఉన్నాయి.
| Kinetic DX / DX+ | Honda Activa e | |
| ధర (ఎక్స్-షోరూమ్) | రూ.1.11 లక్షలు (DX) - రూ.1.17 లక్షలు (DX+) | రూ.1.17 లక్షలు నుంచి స్టార్ట్ |
| బ్యాటరీ & రేంజ్ | 2.6 kWh LFP బ్యాటరీ, 116 కిమీ (DX+) IDC రేంజ్ | 2 x 1.5 kWh స్వాపబుల్ బ్యాటరీలు, 102 కిమీ రేంజ్ |
| ఫీచర్లు | 37 లీటర్ స్టోరేజ్, బ్లూటూత్, జియోఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్ | 26 లీటర్ స్టోరేజ్, డిజిటల్ క్లస్టర్, |


Click it and Unblock the Notifications








