దీన్ని చూస్తే మీరూ "చల్ మేరీ లూనా" అని చెప్పాల్సిందే! పాత జ్ఞాపకాలను తట్టిలేపిన ఇ-లూనా..
ఇండియాలో TVS XL బైక్ అంటే తెలియని వారు ఉండరు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది కచ్చితంగా కనిపిస్తుంది. ఎంత బరువు ఉన్నప్పటికీ కూడా బురద రోడ్లపై కూడా రయ్ మంటూ దూసుకుపోతుంది. భారతీయ మార్కెట్లో ఈ బైక్ అత్యంత ప్రసిద్ధి చెందిన మోడల్. అయితే దీని కంటే ముందు ఇండియాలో ఇదే తరహ డిజైన్‌తో ఉన్న ఒక మోడల్ దేశంలో భారీ డిమాండ్ ఉన్న టూవీలర్‌గా ఉండేది. దాని పేరే 'కైనెటిక్ లూనా'. టీవీఎస్ మోటార్ నుంచి వచ్చిన XL బైక్ కంటే ముందుగా ఈ లూనానే చాలా మంది వాడేవారు.
ప్రస్తుత తరానికి దీని గురించి అంతగా తెలియనప్పటికీ 1970, 80ల కాలంలో కైనెటిక్ లూనా అంటే ఎంతో డిమాండ్ ఉన్న మోడల్ XL, లూనా రెండు కూడా చూడటానికి ఒకేలా కనిపిస్తాయి. అప్పటి కాలం వారు లూనాను ఎక్కువగా వాడేవారు. అప్పటి సినిమాల్లో కైనెటిక్ లూనాను అధికంగా చూపించేవారు. హీరో, లేదా కాలేజ్ విద్యార్ధులకు, గ్రామీణ ప్రాంతాల సన్నివేశాలకు సంబంధించి లూనా కచ్చితంగా ఉండాల్సిందే.

50cc పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చిన ఇది అప్పటి కాలం వారికి అనేక జ్ఞాపకాలను మిగిల్చింది. అంత డిమాండ్ ఉన్న బైక్ తరువాతి కాలంలో తక్కువగా కనిపించడం మొదలైంది. దాని స్థానంలోకి ఇతర మోడళ్లు వచ్చాయి. ఇప్పుడు అయితే సరికొత్త డిజైన్లతో విడుదల అవుతున్నాయి. సోషల్ మీడియా, మొబైల్ ఫోన్లు రాకముందు రోజుల్లో కైనెటిక్ లూనాను ప్రమోట్ చేయడానికి "చల్ మేరీ లూనా" అనే ప్రకటన వీడియో పెద్ద సంచలనం సృష్టించింది.
కైనెటిక్ లూనాను యూరప్‌లో అమ్ముడైన పియాజియో సియావో మినీబైక్ ఆధారంగా తయారు చేశారు. పాత మోడల్‌ను ప్రక్కన పెట్టి కైనెటిక్ గత సంవత్సరం ఎలక్ట్రిక్ విభాగంలోకి ఎంటర్ అయి బైక్‌ను 'eLuna' పేరుతో ఈవీలో తీసుకొచ్చింది. దీన్ని రూ. 69,990 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో ఎలక్ట్రిక్ వేరియంట్‌లో విడుదల చేశారు. ఇటీవల వచ్చిన ఈ కొత్త బైక్ డిజైన్ మరోసారి దాని పాత లూనా మోడల్‌ను గుర్తు చేసేలా ఉంది.

'కైనెటిక్ గ్రీన్'గా మారి ఈవీ సెగ్మెంట్‌లో కంపెనీ తన సత్తాను చాటడానికి సిద్ధమైంది. ఇప్పుడు బైక్ అమ్మకాలను పెంచుకోవడానికి కొత్త టెలివిజన్ ప్రచారాన్ని ప్రారంభించింది. కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ ఇ-లూనా మార్కెటింగ్ కోసం మరోసారి చల్ మేరీ లూనా అనే ట్యాగ్‌లైన్‌ని ఉపయోగించి కొత్త ప్రకటనను విడుదల చేశారు. ప్రస్తుతం కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కొత్త ప్రచారం వైరల్ అవుతుంది.
చల్ మేరీ లూనా ప్రచారం వీడియో ఇప్పుడు బాగా షేర్ అవుతుంది. ఈ వీడియోలో eLuna డిజైన్ అద్బుతంగా ఉంది. నగర రోడ్లపై కూడా ఇది సాఫీగా ప్రయాణిస్తుందని వీడియోలో తెలుస్తుంది. సీటింగ్ కూడా చాలా కంఫర్ట్‌గా ఉంది. సరుకులను తీసుకెళ్లడానికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. ప్రమోషనల్ వీడియోలో eLuna తొలగించగల బ్యాటరీని కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. ఇది అదిరిపోయే కొత్త ఫీచర్స్‌ను కలిగి ఉంది.

ఈ-లూనా (eLuna) పనితీరు విషయానికి వస్తే, 2kWh బ్యాటరీ ప్యాక్‌తో రన్ అవుతుంది. కైనెటిక్ ఇ-లూనా 2.2kW పవర్, 22 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది హబ్-మౌంటెడ్ మోటారుతో పవర్‌ను పొందుతుంది. దీన్ని పూర్తిగా ఛార్జింగ్ చేసినట్లయితే 110 కి.మీ వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంటుంది. ఇది చిన్న బ్యాటరీ ప్యాక్‌తో లభిస్తుంది. పూర్తి ఛార్జ్ చేయడానికి కేవలం 4 గంటలు పడుతుంది.


Click it and Unblock the Notifications








