ఒక్కటి కాదు.. మూడు స్కూటర్లు! లెజెండరీ కైనెటిక్ నుంచి దుమ్మురేపే మోడళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ (Kinetic Green), భారత EV మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలపరిచే దిశగా శక్తివంతమైన అడుగులు వేస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-స్కూటర్ విభాగంలో తన గ్లోబల్ ప్రమాణాలకు తగిన శైలి, పనితీరు కలిగిన వాహనాలను అందించేందుకు కంపెనీ సరికొత్త ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా, వచ్చే 18 నెలల కాలంలో మూడు కొత్త ఇ-స్కూటర్లను విడుదల చేయాలని కైనెటిక్ గ్రీన్ భావిస్తోంది. మొదటి మోడల్‌ను ఇప్పటికే ఫైనల్ చేస్తూ, దాన్ని 2025 ద్వితీయార్థంలో పండుగ సీజన్ సందర్భంగా మార్కెట్లోకి తీసుకురావాలని ప్రణాళిక రచిస్తోంది. ఈ విడుదల కేవలం కొత్త వాహనాన్ని పరిచయం చేయడమే కాక, సంస్థ దిశలో కొత్త శకాన్ని సూచించే పరిణామంగా మారనుంది.

ఇది సాధారణ స్కూటర్ కాదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే, కైనెటిక్ గ్రీన్ ఇటలీకి చెందిన ప్రముఖ డిజైన్ సంస్థ టొరినో డిజైన్‌తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యం ద్వారా సృష్టించిన కొత్త స్కూటర్‌ల సిరీస్ అల్ట్రా-ఫ్యూచరిస్టిక్ డిజైన్, స్టైల్, కొత్త శ్రేణికి మార్గదర్శకంగా నిలవనుంది. ఇప్పటివరకు మనం చూసిన కైనెటిక్ వాహనాలకంటే ఈ కొత్త మోడళ్ల డిజైన్ పూర్తిగా విభిన్నంగా ఉండబోతోంది.

E Loona Scooters

రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈవీ అమ్మకాలు 15 శాతం నుంచి 70 శాతం వరకు పెరిగే అవకాశముంది. EV మార్కెట్ రానున్న రోజుల్లో భారీగా పెరిగే అవకాశం ఉందని పరిశ్రమలో అంచనాలు ఉండటంతో దీన్ని అర్థం చేసుకున్న కైనెటిక్, ఈ వేగవంతమైన అభివృద్ధిలో భాగస్వామిగా మారేందుకు గట్టి ప్రణాళికతో ముందుకెళ్తోంది. కైనెటిక్ గ్రీన్ విడుదల చేయబోయే మూడు కొత్త ఈ-స్కూటర్లలో మొదటిది, ఒక ఫ్యామిలీ స్కూటర్‌గా ఉండే అవకాశం ఉంది.

ఇది ఐకానిక్ కైనెటిక్ హోండా DX‌కు ఒక ఆధునిక డిజైన్‌గా భావించబడుతోంది. రెట్రో స్పూర్తితో రూపుదిద్దుకునే ఈ స్కూటర్, వారసత్వాన్ని గుర్తుచేస్తూనే కొత్త ఫీచర్లను అందించనుంది. డిజైన్ పరంగా, ఇది క్లాసిక్ ఆకృతి, సాఫ్ట్ కర్వ్స్, ఫ్యామిలీ-ఫ్రెండ్లీ లుక్స్‌ను కలిగి ఉండేలా ఉండనుంది. అయితే, లోపల పూర్తిగా నూతనమైన టెక్నాలజీ తో నిండివుంటుంది. ఉదాహరణకి, ఇది TFT డిజిటల్ డిస్‌ప్లే, Geo Things, IoT కనెక్టివిటీ వ్యవస్థను కలిగి ఉంటుంది.

Kinetic Green New Electric Scooters

దీంతో స్కూటర్‌కి యాప్ ద్వారా ట్రాకింగ్, నోటిఫికేషన్‌లు, రిమోట్ స్టార్ట్/లాక్ వంటి స్మార్ట్ ఫీచర్లు లభిస్తాయి. ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇది ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు, వినియోగదారుల బడ్జెట్, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, ఈ స్కూటర్ పలు బ్యాటరీ వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంటే, ఒక్కో వేరియంట్‌కి రేంజ్, ఛార్జింగ్ టైం వేరుగా ఉండే అవకాశముంది.

పనితీరు విషయానికి వస్తే, ఇందులో హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ అమర్చబడుతుంది. ఇది దాదాపు 80 కి.మీ.ల గరిష్ట వేగాన్ని అందించగలదు. స్మూత్ రైడింగ్ కోసం టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, డ్యూయల్ రియర్ షాక్ అబ్సార్బర్స్ ఉన్నాయి. బ్రేకింగ్ సిస్టమ్ విషయంలో ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ వంటి సామర్ధ్యం ఉండే అవకాశముంది. పెద్ద అండర్ సీట్ స్టోరేజ్ కూడా ఉంటుంది.

ఇది మాత్రమే కాకుండా మిగతా రెండు కూడా ఇదే విధంగా ఇంకా అధునాతన ఫీచర్స్ ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కుటుంబ వాడకానికి ఎంతో అనుకూలంగా ఉంటాయి. కైనెటిక్ గ్రీన్ ఇప్పటికే భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో తనదైన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇప్పటివరకు సంస్థ 80,000కు పైగా ఎలక్ట్రిక్ టూవీలర్స్ విజయవంతంగా విక్రయించింది, ఇది దేశవ్యాప్తంగా 400కి పైగా ప్రత్యేక డీలర్ల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, July 12, 2025, 15:17 [IST]
English summary
Kinetic green will be launch three new electric scooters in india details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+