మార్కెట్లోకి అదిరిపోయే స్టైలిష్ ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ!

ఇండియాలో ఎలక్ట్రిక్ టూవీలర్స్ వాడకం గతంలో కంటే భారీగా పెరిగింది. తయారీదారులంతా కూడా డిమాండ్‌కు అనుగుణంగా ఈవీలను విడుదల చేస్తున్నారు. పెరుగుతున్న కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కంపెనీలు తమ మునుపటి మోడళ్లను 2025 ఇయర్ అప్‌డేట్‌లో భాగంగా కొత్తగా మార్చి మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కోమాకి ఎలక్ట్రిక్ (komaki electric) తన ప్రసిద్ధ ఈవీ బైక్‌ను మరింత కొత్తగా అప్‌డేట్ చేసి విడుదల చేసింది. భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్‌గా కంపెనీ పేర్కొన్న రేంజర్ ఎలక్ట్రిక్‌ (ranger electric)ను మారుతున్న కస్టమర్ల ఇష్టాలకు అనుగుణంగా పలు కొత్త ఫీచర్స్‌ను జోడించి ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చింది.

ప్రధానంగా కోమాకి రేంజర్ 2025 మోడల్ సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 250 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.85 లక్షలుగా నిర్ణయించారు. రేంజర్ ఎలక్ట్రిక్ క్రూయిజర్‌‌‌లో పాత దానితో పోలిస్తే, అదనంగా మరిన్ని లేటెస్ట్ ఫీచర్స్ అందించారు. పెట్రోల్ ధరలు భారీగా ఉన్న తరుణంలో 250 కిలో మీటర్ల రేంజ్ అందించే ఈ ఎలక్ట్రిక్ బైక్‌ కోసం షోరూమ్‌కు క్యూకట్టే అవకాశం ఉంది.

Komaki Electric 2025 Updated Ranger Cruiser Bike

రోజువారి ప్రయాణాలు చేసే వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రేంజ్ పెరగడం కోసం కంపెనీ రేంజర్‌‌లో LiFePO బ్యాటరీ ప్యాక్‌ను అందించింది. ఈ బ్యాటరీని 0 నుంచి 90 శాతం వరకు ఛార్జ్ చేయడానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతుందని కంపెనీ తెలిపింది. ఇతర ప్రధాన అప్‌డేట్‌లలో పెద్ద వీల్స్‌, క్రోయ్ యాస్‌లను కలిగిన పెయింట్ స్కీమ్‌లు ఉంటాయి.

బ్యాటరీ గురించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి దీన్ని స్మార్ట్ బ్యాటరీ యాప్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, పార్క్ అసిస్ట్, సైడ్ స్టాండ్ సెన్సార్, ఎగ్జాస్ట్‌ల మాదిరిగా కనిపించే డ్యూయల్ సౌండ్ పైపులు, ఎగ్జాస్ట్ టిప్స్‌పై లైటింగ్‌ వంటి వాటిని కలిగి ఉంది. రోడ్లపై సాఫీగా ప్రయాణించడానికి వెనుక సస్పెన్షన్‌లో ప్రీ-లోడ్ సర్దుబాటును అందించారు. ఫ్రంట్ విండ్‌స్క్రీన్ ద్వారా గాలి ప్రభావం నుంచి బైక్‌ను ఈజీగా రైడ్ చేయవచ్చు.

250km Ranger Cruiser Bike

కనెక్టివిటీ ఫీచర్స్ కోసం 7-అంగుళాల TFT డిస్‌ప్లే, 60 లీటర్ వరకు సరిపడా స్థలం, ఆటో రిపేర్ స్విచ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి వాటిని ఈ బైక్ కలిగి ఉంటుంది. డిస్‌ప్లేను నావిగేషన్ బోర్డుకు అనుకూలంగా తయారుచేశారు. ఇంకా ఇది బ్లూటూత్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. సౌండ్ సిస్టమ్‌‌ను కూడా ప్రత్యేకంగా అమర్చారు. రేంజర్ ఎలక్ట్రిక్ క్రూయిజర్‌ టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 80 కి.మీలుగా ఉంది.

రైడర్లకు బైక్‌పై కంట్రోలింగ్ అందించడానికి ముందు, వెనుక భాగంలో డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఇది ట్యూబ్‌లెస్ టైర్లపై నడుస్తుంది. సింగిల్ ఛార్జ్‌తో 250 కి.మీల రేంజ్ అంటే దూర ప్రాంతాలకు కూడా సరిపోతుంది. రేంజర్ ఎలక్ట్రిక్ బైక్ స్టైలిష్ డిజైన్, లేటెస్ట్ టెక్నాలజీతో ప్రతి రైడ్‌ను స్టయిలిష్‌గా ఉండాలనే వారికి ఇది ఒక మంచి ఎంపికగా నిలుస్తోంది. అదిరిపోయే ఫీచర్స్‌తో ఇది మార్కెట్లో ఇతర ఈవీలకు బలమైన పోటీగా నిలవనుంది.

Komaki Electric Bike

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, April 10, 2025, 7:20 [IST]
English summary
Komaki electric 2025 updated ranger cruiser bike launched with 250km range more details inside
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+