ఈ బైక్ కొంటే పెట్రోల్ బంక్‌లో క్యూ కట్టాల్సిన అవసరం లేదు.. మీ బడ్జెట్ ధరకే వస్తోంది!

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగం వేంగా విస్తరిస్తుంది. గతంలో స్కూటర్లే ప్రధానంగా కనిపించినా, ఇప్పుడు బైకులకు గణనీయమైన గిరాకీ పెరుగుతోంది. ఈ కొత్త పోటీ వాతావరణంలోకి కోమాకి (Komaki) ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ క్రూయిజర్ రేంజర్ ప్రో (Ranger Pro), ప్రో ప్లస్ (Pro Plus) బైక్‌‌లతో అడుగుపెట్టింది. ఈ బైక్స్ లుక్ పరంగా అత్యంత ఫ్యాన్సీగా కనిపిస్తూ, పనితీరు విషయంలో నిజంగా రేంజర్ అనిపించేలా ఉన్నాయి. వీటి డిజైన్‌లో కొత్తదనం కనిపిస్తుంది. క్లాసిక్ క్రూయిజర్ స్టైల్‌ను ఆధునిక ఎర్గోనామిక్స్‌తో సమన్వయం చేస్తూ, దూర ప్రయాణాలకు అనువైనవిగా రూపొందించబడ్డాయి. ప్రయాణం పై ఫోకస్ పెట్టే రైడర్ల కోసం ఈ మోడళ్లు బెస్ట్ ఛాయిస్‌గా చెప్పవచ్చు.

కోమాకి తన రేంజర్ ప్రో, రేంజర్ ప్రో ప్లస్ రెండు కొత్త ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైకులతో మార్కెట్‌లో ఇతర పోటీదారులకు బలమైన సంకేతం ఇచ్చినట్లయింది. వీటి ధరల గురించి ఒకసారి చూసినట్లయితే కోమాకి రేంజర్ ప్రో ధర రూ. 1,29,999 కాగా, ప్రో ప్లస్ మోడల్ ధర రూ. 1,39,999గా ఉంది (ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు). ధర పరంగా కూడా ఇవి ప్రీమియం బైక్‌ల్లా కాకుండా, బెస్ట్ ఎంపికలుగా నిలుస్తున్నాయి.

Ranger Pro And Pro Plus Launched

ఈ బైక్‌లు ఎలక్ట్రిక్ మార్కెట్లో క్రూయిజర్ విభాగానికి ఊపు తీసుకొచ్చేలా కనిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లోకి విలాసవంతమైన క్రూయిజర్ లుక్స్‌ కోరుకునే వినియోగదారులకు ఇవి సరైన ఎంపికగా నిలుస్తున్నాయి. ఈ రెండు మోడళ్లకూ శక్తివంతమైన 4.2 kW LiFePO4 (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) బ్యాటరీలు అమర్చబడ్డాయి. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, రేంజర్ ప్రో 160 నుండి 220 కిలోమీటర్ల వరకూ ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంది.

అదే సమయంలో, ప్రో ప్లస్ మోడల్ మరింత శక్తివంతంగా ఉండి, 180 నుండి 240 కిలోమీటర్ల వరకూ రేంజ్‌ను అందిస్తుంది , ఇది లాంగ్ రైడింగ్ ఇష్టం ఉన్నవారికి బాగా ఉసయోగపడుతుంది. ఇది మాత్రమే కాదు, రెండు బైక్‌లలోనూ 5 kW హై-టార్క్ మోటార్ ఉంటుంది. ఈ మోటార్, కేవలం ఐదు సెకన్ల వ్యవధిలో 0 నుండి గరిష్ట వేగాన్ని చేరుకోగలదు, దీంతో రైడింగ్ అనుభవం మరింత ఆసక్తికరంగా మారుతుంది.

Ranger Pro And Pro Plus Launched Price Battery

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రెండు మోడళ్లలో కొనుగోలుదారులకు రూ.12,500 విలువైన ఉపకరణాలు ఉచితంగా లభిస్తాయి. ఇవి బైక్‌తో మరింత విలువను జోడించడంతో పాటు, వినియోగదారులకు మెరుగైన అనుభూతిని కలిగిస్తాయి. ఇది కేవలం పరిమిత రేంజ్ లేదా నెమ్మదిగా నడిచే బైక్ అనుకోవద్దు! కోమాకి తన కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను హైవే, నగర ప్రయాణాలకు అనువుగా రూపొందించింది.

ఈ బైక్‌లలో అందించిన డిజిటల్ ఫీచర్లు వాటిని ఆధునికతకు మరో మెట్టుకు తీసుకెళ్లాయి. మొత్తం కలర్స్‌లో ప్రత్యక్షంగా కనిపించే డాష్‌బోర్డ్, రైడింగ్‌ను మరింత సౌకర్యవంతంగా మార్చే క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్, బ్లూటూత్ ఆడియో సిస్టమ్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ వంటి అనేక సదుపాయాలు ఇందులో ప్రామాణికంగా లభిస్తున్నాయి. ఇదే కాదు, దీన్నే డేలీ కమ్ టూరింగ్ బైక్‌గా మార్చే కొన్ని అదనపు ఫీచర్లూ ఉన్నాయి.

Ranger Pro And Plus

ఉదాహరణకు, 50 లీటర్ల స్టోరేజ్ స్పేస్ బ్యాగ్ పెట్టుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. పార్క్ అసిస్ట్‌తో పక్కకి సాఫీగా నిలిపేయొచ్చు. ఆటో రిపేర్ స్విచ్ అనే ప్రత్యేకత, చిన్న సమస్యలను తక్షణమే గుర్తించి పరిష్కరించేలా సహాయపడుతుంది. టర్బో మోడ్‌లో మరింత పవర్‌ను కలిగిస్తుంది, అంతేకాక వెనుక రక్షణ గార్డ్‌తో భద్రతకు కూడా ఉంటుంది. వీటికి లిస్కోపిక్ సస్పెన్షన్, డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు, టెయిల్ లాంప్ గార్డ్‌ను అందించారు.

More from DriveSpark

Article Published On: Thursday, July 17, 2025, 18:38 [IST]
English summary
Komaki new electric bikes ranger pro and pro plus launched price battery range details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+