రూ.53 వేలకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ప్రత్యేక ఆఫర్‌లో రెండు స్కూటర్స్ రూ.99,999కే

ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది. ఈవీ తయారీదారులు వరుసగా కొత్త మోడళ్లను విడుదల చేస్తూ తమ వ్యాపారాన్ని క్రమంగా పెంచుకుంటున్నారు. కస్టమర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా కంపెనీలు ఎలక్ట్రిక్ టూవీలర్స్‌ను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ కోమాకి (Komaki) కూడా దేశీయ వినియోగదారుల కోసం కొత్త స్కూటర్లను విడుదల చేస్తూ తన మార్కెట్ వాటాను విస్తరిస్తుంది. కంపెనీ తాజాగా X3 సిరీస్‌ను విడుదల చేసింది. అయితే వీటిని పట్టణ ప్రాంతాల్లోని మహిళలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందించింది. వీటిని నడపడం చాలా ఈజీ. దేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ టూవీలర్స్‌‌లో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించడానికి చాలా కాలంగా అధునాతన మోడళ్లను తీసుకొస్తున్న కోమాకి ఇప్పుడు ఎక్స్‌3 సిరీస్‌ను కూడా లేటెస్ట్ ఫీచర్స్‌తో మార్కెట్లోకి తీసుకువచ్చింది.

కోమాకి X3 (Komaki X3) సిరీస్‌‌లో శక్తివంతమైన అధిక కెపాసిటీ కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీని అమర్చారు. వీటి ప్రారంభ ధర రూ. 52,999. మరో కీలక విషయం ఏిమటంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోమాకి తన రెండు స్కూటర్లను ప్రత్యేకంగా రూ.99,999కే ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా అందిస్తుంది. మహిళా వినియోగదారులు ఇది సంతోషించే విషయం. తక్కువ ధరలో రెండింటిని సొంతం చేసుకోవచ్చు.

Komak X3 Series Offers

కోమాకి X3 సిరీస్ స్కూటర్లను కొనుగోలు చేయాలనే ఆసక్తిగల కస్టమర్లు మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోని కంపెనీ డీలర్‌షిప్‌లలో సంప్రదించవచ్చు. అలాగే వీటిని వివిధ ఈ కామర్స్ సైట్‌లలో కూడా కొనుగోలు చేయవచ్చు. కస్టమర్లు సులభంగా తమ స్కూటర్లను సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో కంపెనీ ఈ కామర్స్ సైట్‌లలో కూడా వీటిని కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తుంది. మహిళల రోజువారీ ప్రయాణాన్ని ఇది మరింత సులభతరం చేస్తుందని కంపెనీ పేర్కొంది.

కోమాకి ఎలక్ట్రిక్ స్కూటర్‌లో బ్యాటరీ పనితీరు అద్బుతంగా ఉంటుందని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా తెలిపారు. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే 75-100 కి.మీ.ల వరకు రేంజ్‌ను అందిస్తుందని కోమాకి పేర్కొంటుంది. దీనిలో 3000W హబ్-మౌంటెడ్ మోటార్‌‌ను అమర్చారు. దీంతో ఇది గంటకు 55 కి.మీ.ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. రోజు ఆఫీస్ లేదా కాలేజ్‌లు, ఇతర అవసరాలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. పెట్రోల్ ఖర్చు లేకుండా చాలా డబ్బులు ఆదా అవుతాయి.

Komaki New X3 Series

ఇవి కస్టమర్లను ఆకట్టుకునే విధంగా సొగసైన డిజైన్‌తో పాటు ఏరోడైనమిక్ బాడీ, మరింత ప్రీమియం లుకింగ్‌ను కలగజేసే అల్లాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ముందు భాగంలో LED లైటింగ్ చీకట్లో ప్రకాశవంతమైన వెలుతురును అందిస్తుంది. హ్యాండిల్ భాగంలో డిజిటల్ డాష్‌బోర్డ్‌లో రైడర్లు తమకు అవసరమైన సమాచారాన్ని చూడవచ్చు. అలాగే ఇది మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్‌లను కూడా కలిగి ఉంది.

ప్రధానంగా దీన్ని మహిళల కోసం తీసుకొచ్చారు కాబట్టి వారికి అనువుగా ఉండేలా అధునాతన ఫీచర్స్‌‌ను దీనిలో అందించారు. సీటు ఎత్తు కూడా వారికి సరిపోయేలా ఉంటుంది. భారతీయ మార్కెట్లో కోమాకి కంపెనీ ఈ కొత్త మోడల్ లాంచ్‌తో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలో తన వాటాను మరింత పెంచుకుంటుంది.

Komaki New X3 Series Electric Scooter

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, March 4, 2025, 7:15 [IST]
English summary
Komaki new x3 series electric scooter launched in india starting price at rs 52999
Read more on: #electric scooter #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+