రూ.68 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌లో 130 కిమీ ప్రయాణించవచ్చు!
దేశంలో ఈవీల హవా కొనసాగుతోంది. చాలా మంది వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. టూ- వీలర్ రంగంలోనూ ఈవీల వాడకం జోరుగా కొనసాగుతోంది. అనేక స్టార్టప్ సంస్థల నుంచి దిగ్గజ సంస్థల వరకు ఈవీలతో మార్కెట్లో పోటీ పెంచుతున్నాయి. ఓలా, ఏథర్, బజాజ్, టీవీఎస్ వంటి సంస్థలు ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంచి గుర్తింపు సంపాదించాయి. అయితే వీటి కంటే ముందు నుంచే ఎలక్ట్రిక్- టూవీలర్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సంస్థ కొమాకి. అనేక ప్రాంతాల్లో దీని డీలర్‌షిప్ నెట్వర్క్ ఉండడంతో.. దీని పేరు కూడా చాలా మంది ఇదివరకే విని ఉంటారు. ఇటీవల ఈ సంస్థ కొన్ని కొత్త మోడళ్లను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఆ స్కూటర్లు, వాటి విశేషాలేంటో చూసేద్దాం.
రూ.లక్షలోపు మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునేవారికి కొమాకి సంస్థ నుంచి వచ్చిన మోడల్స్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. అందుబాటు ధరలో, మంచి రేంజ్ అందించేవిగా ఈ బ్రాండ్ గుర్తింపు పొందింది. ఈ కొత్త ఏడాదిలో తమ SE సిరీస్‌లో భాగంగా కొన్ని కొత్త ఈవీలను లాంఛ్ చేసిందీ సంస్థ.

SE Pro, SE Ultra and SE Max పేరుతో మూడు ఎలక్ట్రిక్ వాహనాలను ఈ సంస్థ తీసుకువచ్చింది. ఈ స్కూటర్లన్నీ అందుబాటు ధరలో ఉండడం.. వీటికి ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. వీటి ధర వరుసగా రూ.67,999, రూ. 76,999, రూ.1,10,000 గా(ఎక్స్- షోరూమ్) ఉంది.
ఈ మూడు మోడల్స్.. కొమాకి ఎంజీ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధారంగా తయారు చేసినవి. LiPo4 హై- కెపాసిటీ లిథియం- ఐయాన్ బ్యాటరీ ప్యాక్ ను కొమాకి ఎస్ఈ అల్ట్రా, కొమాకి ఎస్ఈ మ్యాక్స్ స్కూటర్లలో వినియోగించారు. ఈ సాంకేతికత ద్వారా ఈ స్కూటర్లకు మంచి రేంజ్ లభిస్తుందని కొమాకి సంస్థ చెబుతోంది.

SE Ultra ఈవీ 2.7 kWh లిథియం పాస్ఫేట్ 4 బ్యాటరీతో ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్‌తో 130 నుంచి 140 కి.మీ రేంజ్ అందించగలదని తెలుస్తోంది. ఇక SE Max.. 4.2 kWh 4.2 kWh లిథియం పాస్ఫేట్ 4 బ్యాటరీ ప్యాక్‌తో ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కి.మీ.ల దూరం వరకు ప్రయాణిస్తుంది. ఈ SE Max స్కూటర్.. 80 kmph వేగంతో ప్రయాణించగలదు
ధర తక్కువగా ఉన్నప్పటికీ.. ఈ SE స్కూటర్లలో ఫీచర్లకేం కొదవ లేదు. డ్యూయల్ ఛార్జర్స్, TFT స్క్రీన్స్, డ్యూయల్ డిస్క్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి. దీంట్లో సింగిల్ డిస్క్, డిజిటల్ స్పీడోమీటర్ వంటివి కూడా ఉంటాయి. దీని టాప్ స్పీడ్ 70 kmphగా ఉంది.
ఇక కొమాకి సంస్థ నుంచి MG Pro EV గతేడాది లాంఛ్ అయింది. ఇది కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో అప్పట్లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇది MG Pro LI, MG Pro V, MG Pro Plus అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. దీంట్లో లో- స్పీడ్ LI వేరియంట్ 1.75 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్‌తో 75 కి.మీ.ల దూరం ప్రయాణించగలదు.
దీంట్లో V వేరియంట్ 2.2 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉంటుంది. ఇది 100 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది. అదే సమయంలో Pro Plus వెర్షన్ 2.7 kWh బ్యాటరీ ప్యాక్‌తో 150 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది. ఈ సిరీస్‌లోని స్కూటర్లు ఛార్జింగ్ కావడానికి 4 నుంచి 5 గంటల సమయం తీసుకుంటాయి.


Click it and Unblock the Notifications








