మాట తప్పి సైలెంటుగా షాకిచ్చిన కేటీఎం.. అడ్వెంచర్ బైక్స్ కొనాలంటే ఇక మీదట అప్పు చేయాల్సిందే

భారతీయ టూ వీలర్ మార్కెట్ ఈ ఏడాది మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఇటీవల 350 సీసీ కంటే తక్కువ బైక్‌లకు జీఎస్‌టీ తగ్గింపు లభించడంతో వాటి ధరలు భారీగా తగ్గాయి. అయితే 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న మోటార్‌సైకిళ్లపై కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీని పెంచింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి బ్రాండ్లు ధరలను పెంచినప్పటికీ కేటీఎం, ట్రయంఫ్ వంటి పెద్ద బ్రాండ్లు పాత ధరలకే మోడళ్లను విక్రయిస్తామని ప్రకటించి కస్టమర్లను సంతోషపెట్టాయి. కానీ ఆ మాట నిలబడలేదు.

భారత మార్కెట్‌లో 350 సీసీ పైబడిన బైక్‌లకు జీఎస్‌టీ పెంచినప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంటి కంపెనీలు వెంటనే ధరలు పెంచాయి. కానీ, KTM ట్రయంఫ్ వంటి పెద్ద బ్రాండ్లు మాత్రం పాత ధరలకే అమ్ముతామని అడ్వెంచర్ ప్రియులను సంతోషపెట్టాయి. అయితే ఆ మాట కేవలం పండగ సీజన్ వరకేనని ఇప్పుడు తేలిపోయింది. దీపావళి హడావుడి ముగిసిన వెంటనే KTM తన మోడల్స్ ధరలను పెంచేసి, అడ్వెంచర్ బైక్ లవర్స్‌కు పెద్ద షాక్ ఇచ్చింది.

KTM 390 Adventure X Variants Now More Expensive Check the Revised Ex-Showroom Prices

KTM కంపెనీ తన పాపులర్ మోడల్స్ అయిన 390 అడ్వెంచర్, 390 అడ్వెంచర్ X వేరియంట్ల ధరలను సైలెంటుగా పెంచేసింది. KTM 390 అడ్వెంచర్ X బైక్ ధర రూ. 22,410 పెరిగి, ఇప్పుడు కొత్త ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.26 లక్షలకు చేరుకుంది. KTM 390 అడ్వెంచర్ (స్టాండర్డ్) మోడల్ ధర ఏకంగా రూ. 27,000 పెరిగి, కొత్త ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.95 లక్షలకు చేరింది. ఈ ధరల పెరుగుదలతో స్టాండర్డ్ 390 అడ్వెంచర్ బైక్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ.5 లక్షలకు చేరిందంటే, బైక్ ఎంత ఖరీదైందో అర్థం చేసుకోవచ్చు.

350 సీసీ పైన ఉన్న మోటార్‌సైకిళ్లపై ప్రభుత్వం జీఎస్‌టీని 40 శాతానికి పెంచిన తర్వాత కూడా, KTM ఆ భారాన్ని వినియోగదారులపై మోపకుండా వార్తల్లో నిలిచింది. కానీ, దీపావళి అమ్మకాలు పూర్తయిన వెంటనే ధరలు పెంచడం వెనుక, పండుగ సందర్భంగా రికార్డు అమ్మకాలు సాధించాలనే వ్యూహం ఉందని తెలుస్తోంది.

KTM 390 Adventure X Variants Now More Expensive Check the Revised Ex-Showroom Prices

ఏదేమైనా ఇప్పుడు KTM 390 అడ్వెంచర్ సిరీస్ కొనాలనుకునే వారికి ఇది పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే, కొత్త ధరల కారణంగా వారు అదనంగా డౌన్ పేమెంట్ కట్టాల్సి రావచ్చు లేదా ఈఎంఐ మొత్తం పెరిగే అవకాశం ఉంది.

కొత్త ధరల ప్రకారం చూస్తే, KTM 390 అడ్వెంచర్ X వేరియంట్ ధర, రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్తగా తీసుకొచ్చిన హిమాలయన్ 450 అడ్వెంచర్ బైక్ ధరతో దాదాపు సమానంగా ఉంది. అంతేకాకుండా టీవీఎస్ నుంచి రాబోతున్న అపాచే RTX 300 లాంటి కొత్త, ఫీచర్-రిచ్ మోడల్స్ మార్కెట్‌లోకి వస్తున్న నేపథ్యంలో KTM ధరల పెరుగుదల కంపెనీకి పెద్ద సవాలుగా మారవచ్చు. ఈ నిర్ణయం వల్ల చాలా మంది కొత్తగా వస్తున్న టీవీఎస్ మోడల్‌ వైపు మొగ్గు చూపే అవకాశం కూడా ఉంది.

390 అడ్వెంచర్ ఫీచర్స్ వివరాల్లోకి వస్తే.. KTM 390 అడ్వెంచర్ X వేరియంట్ స్టాండర్డ్ మోడల్ కంటే తక్కువ ధరతో ఎక్కువ వాల్యూ ఫర్ మనీ ఇస్తుంది. ఇందులో కార్నరింగ్ ABS, క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. దీనికి స్ట్రీట్, రైన్, ఆఫ్-రోడ్ అనే మూడు రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి.

KTM 390 అడ్వెంచర్ (స్టాండర్డ్) ధర ఎక్కువైనా, అడ్వెంచర్ ప్రియులకు ఇది మెరుగైన ఆప్షన్. ఇందులో పూర్తిగా అడ్జస్ట్ చేయదగిన సస్పెన్షన్, 21/17-అంగుళాల ట్యూబ్‌లెస్ స్పోక్-వీల్ సెటప్ వంటి ఫీచర్లు ఉన్నాయి, ఇవి ఆఫ్-రోడ్ రైడింగ్‌కు చాలా సహాయపడతాయి. ఈ రెండు మోడల్స్‌లోనూ సరికొత్త 399 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 46 బీహెచ్‌పి పవర్, 39 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, November 18, 2025, 7:10 [IST]
English summary
Ktm 390 adventure x variants now more expensive check the revised ex showroom prices
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+