బంపర్ అవకాశం ఇచ్చిన KTM.. బైక్‌పై రూ.20 వేల తగ్గింపు.. కొద్ది రోజుల వరకే ఛాన్స్

లగ్జరీ తరహా బైకులను విడుదల చేసే ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ కేటీఎమ్ (KTM) ఇండియాలో మంచి మార్కెట్ కలిగి ఉంది. కంపెనీ ప్రతి ఏడాది అమ్మకాల పరంగా ఇతర టూవీలర్ తయారీదారుల కంటే వేగంగా దూసుకుపోతుంది. హై పెర్ఫామెన్స్ కోరుకునే చాలా మంది వినియోగదారులు ఎక్కువగా ఈ కంపెనీ బైక్స్‌లను ఎంచుకుంటారు. వీటి స్టైలిష్ డిజైన్‌కు యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు. మార్కెట్లో ఎన్నో ఇతర మోడళ్లు ఉన్నప్పటికి కూడా KTM బైక్స్‌కు మాత్రం సపరెట్ ఫ్యాన్ పేజీ ఉంటుంది. 2024 ఏడాదిలో దేశంలో మెరుగైన సేల్స్ సాధించిన కంపెనీ 2025 ఏడాదిలో కూడా అధునాతన మోడళ్లను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ప్రధానంగా కంపెనీ కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి తన మోడళ్లపై ప్రత్యేక తగ్గింపులు అందిస్తుంటుంది. గత ఏడాదిలో ఇయర్ ఎండ్ ‌సేల్‌ను తీసుకువచ్చింది.

అయితే ఈ ఆఫర్‌ను కంపెనీ జనవరి 31,2025వ తేదీ వరకు పొడిగించింది. KTM డ్యూక్ 250పై కంపెనీ దాదాపు రూ.20,000 వరకు తగ్గింపును ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో సంక్రాంతి పండుగ, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఉన్న నేపథ్యంలో కేటీఎమ్ కొత్త ఏడాది ప్రారంభంలో కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి తగ్గింపు ఆఫర్‌ను పొడిగించింది. వినియోగదారులు రూ.2.25 లక్షల ధరకు బైక్‌ను కొనుగోలు చేయవచ్చు. KTM లవర్స్‌కు ఇది మంచి అవకాశం.

Ktm Has Extended Discount Offer

కొత్త ఏడాదిలో అదిరిపోయే స్టైలిష్ బైక్‌ను కొనుగోలు చేసి తమ ఇంటికి తెచ్చుకోవాలి అనుకునే వారు KTM డ్యూక్ 250ని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ మోడల్ యూత్‌ను బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇది KTM 390 డ్యూక్ మోడల్ నుంచి వచ్చినట్లు ఉంటుంది. డ్యూక్ 250 బూమరాంగ్ షేపులో LED డేటైమ్ రన్నింగ్ లైట్లను కలిగి ఉంది. బైక్ డిజైన్ థీమ్ మరింత అందంగా ఉంటుంది.

KTM డ్యూక్ 250 ఇంజిన్ విషయానికి వస్తే, 248cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 9,250 rpm వద్ద 30 bhp పవర్‌ను, 7,250 rpm వద్ద 25 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ సిస్టం కూడా చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఇంజిన్‌కు ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు. స్లిప్పర్ క్లచ్‌ పనితీరు కూడా మెరుగ్గా అనిపిస్తుంది. దీనిలో అన్ని అధునాతన ఫీచర్స్ ఉన్నాయి.

Ktm Discount Offer On Duke 250 To January 31

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో కొత్త 5.0-అంగుళాల ఫుల్ కలర్ TFT డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, హెడ్‌సెట్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, పెట్రోల్, గేర్‌ పోజిషన్ వంటి పలు ఫీచర్స్ ఈ బైకులో ఉన్నాయి. KTM కనెక్ట్ యాప్ ద్వారా రైడర్లు తమ బైక్‌కు సంబంధించిన వివరాలను నేరుగా తెలుసుకోవచ్చు. దీని సస్పెన్షన్ సెటప్ కూడా చాలా అధునాతనంగా ఉంటుంది. ముందు ఇన్వర్టెడ్ ఫోర్క్స్, వెనుక వైపు మోనోషాక్‌ను సెటప్ ఉంది.

బ్రేకింగ్ సిస్టం పనితీరు మెరుగ్గానే ఉంటుంది. ముందు రేడియల్ మౌంటెడ్ కాలిపర్‌తో డిస్క్‌ బ్రేక్ (320 mm), తరువాత వెనుక 240 mm ఫ్లోటింగ్ కాలిపర్‌ డిస్క్‌ బ్రేకును అందించారు. ముఖ్యంగా ఈ బైకులో డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌‌ను అమర్చడం విశేషం. దీంతో రైడర్లకు మరింత రక్షణ లభిస్తుంది. సూపర్‌మోటో మోడ్ కూడా బైకులో ఉంటుంది. KTM డ్యూక్ 250 బైక్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది.

Ktm Has Extended The Discount Offer On Duke 250

KTM డ్యూక్ 250 అట్లాంటిక్ బ్లూ, సిరామిక్ వైట్, ఎలక్ట్రానిక్ ఆరెంజ్, ఎబోనీ బ్లాక్ అనే వేరు వేరు కలర్ వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. దీని బాడీని స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్‌పై నిర్మించారు. ప్రస్తుతం ఉన్నటువంటి తగ్గింపు ఆఫర్ లిమిటెడ్ కాలం వరకు మాత్రమే ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, January 14, 2025, 14:07 [IST]
English summary
Ktm has extended the date of rs 20000 discount offer on duke 250 to january 31
Read more on: #ktm #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+