మిమ్మల్ని సరికొత్త అడ్వెంచర్ ప్రపంచంలోకి తీసుకెళ్లే KTM బైక్స్ వచ్చేశాయ్.. యూత్ ఇక బడ్జెట్ రెడీ చేసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా టూవీలర్ విభాగంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ కంపెనీ కేటీఎమ్ (KTM) ప్రీమియం స్పోర్ట్స్ బైక్స్‌ను విడుదల చేస్తూ అంతర్జాతీయంగానే కాకుండా భారత్‌లో కూడా మంచి మార్కెట్ కలిగి ఉంది. ఇండియాలో బజాజ్ ఆటోతో భాగస్వామ్యంతో కలిసి అధునాతన స్పోర్ట్స్ మోడల్ తరహా బైక్స్‌లను విడుదల చేస్తుంది. మార్కెట్లో పోటీ వాతావరణం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తాజాగా 3 కొత్త అడ్వెంచర్ బైక్‌లను KTM లాంచ్ చేసింది. 250 (adventure) అడ్వెంచర్, 390 అడ్వెంచర్ (adventure), 390 అడ్వెంచర్ (adventure) X అనే మోడళ్లను భారతీయ వినియోగదారుల కోసం విడుదల చేసింది. ఇవి స్టైలిష్ డిజైన్‌తో యూత్‌ను ఎక్కువగా అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. ఆస్ట్రియాకు చెందిన KTM ఇండియాలో కూడా తన ఉనికిని కలిగి ఉంది. ఇటీవల కాలంలో ఈ కంపెనీకి పోటీగా ఇతర బైక్స్ లాంచ్ అవుతున్న నేపథ్యంలో తన మార్కెట్‌ను నిలబెట్టుకోడానికి వీటిని తీసుకొచ్చింది.
2025 ఏడాది ప్రారంభంలోనే ఈ మూడు మోడళ్ల ద్వారా ktm తన సేల్స్‌ను పెంచుకోవాలని చూస్తుంది. 250 అడ్వెంచర్ లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్ సెటప్‌తో వచ్చింది. కఠినమైన రోడ్లపై కూడా ఇది సాఫీగా ప్రయాణిస్తుంది. ఇండియాలో ఇది తక్కువ ధరకే కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.2,59,850. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. ఆఫ్-రోడ్ అడ్వెంచర్లకు బాగా అనుకూలంగా ఉంటుంది.

ktm 250 అడ్వెంచర్ సస్పెన్షన్ సెటప్ మొత్తం కూడా లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చింది. కొండలు, ఎత్తు ప్రాంతాల్లో కూడా రయ్ మంటూ దూసుకుపోవడానికి 227mm గ్రౌండ్ క్లియరెన్స్, 825mm సీట్ ఎత్తును దీనికి అందించారు. ఇది ఆఫ్-రోడ్ ABS,బైక్ రైడ్-బై-వైర్, క్విక్‌షిఫ్టర్ ప్లస్‌ను కలిగి ఉంది. ఇతర మోడళ్లతో పోలిస్తే దీని బరువు పరంగా కంఫర్ట్‌గా ఉంటుంది. హ్యాండిల్ బార్ కూడా అనుకూలంగా ఉంటుందని కంపెనీ పేర్కొంటుంది.
390 అడ్వెంచర్ (adventure) విషయానికి వస్తే, రెగ్యులర్‌గా ఆఫ్‌రోడ్ ప్రయాణాలు చేసేవారికి మంచి ఆప్షన్ అవుతుంది. ఇది స్పోర్టీ లుక్‌తో కనిపిస్తుంది. ఇది 390ccతో రైడర్లకు మెరుగైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. దీని ధర రూ.3.68 లక్షలుగా ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్య విషయం ఏమిటంటే క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ కలిగిన మొదటి 390cc బైక్ ఇదే.

ఇది ముందు 21-అంగుళాలు, వెనుక 17-అంగుళాల వీల్స్‌తో ట్యూబ్‌లెస్ టైర్లతో వచ్చింది. 390 అడ్వెంచర్ స్మార్ట్ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో 5-అంగుళాల TFT డిస్‌ప్లే, బ్లూటూత్, చిన్న టెయిల్‌ల్యాంప్, మూడు రైడ్ మోడ్స్, కార్నరింగ్ ABSను కలిగి ఉంటుంది. దీని ఇంజిన్ 45.3 bhp పవర్, 39 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఇంజిన్‌కు జత చేశారు.
చివరగా, 390 అడ్వెంచర్ X (adventure X) విషయానికి వస్తే, దీని ధర రూ. 2,91,140గా ఉంది. అయితే ఇది ఎక్స్ షోరూమ్ ధర మాత్రమే. ఆన్‌రోడ్ అయితే పన్నులు, ఇన్సూరెన్స్‌తో కలిపి మరింత ఎక్కువగా ఉంటుంది. తక్కువ ధరలో అడ్వెంచర్ బైక్‌ను కొనాలనుకునేవారి సంఖ్య ఇటీవల కాలంలో ఎక్కువ అయిన నేపథ్యంలో అలాంటి వారి కోసం ఈ మోడల్‌ను రూ.3 లక్షల లోపే సొంతం చేసుకోవచ్చు.

ఇది కొండలు, గుట్టలు, ఎత్తుపల్లాలు ఉన్న ప్రాంతాల్లోనే కాకుండా సాధారణ రోడ్లపై కూడా సాఫీగా ప్రయాణించడానికి అత్యంత అనుకూలంగా ఉంది. దీని సీటు ఎత్తు, గ్రౌండ్ క్లియరెన్స్ 250 అడ్వెంచర్‌ను పోలి ఉంటాయి. దీనిలో స్పోక్డ్ వీల్స్ కు బదులుగా కాస్ట్ వీల్స్ అందించారు. భారత్‌లో ప్రస్తుతం అడ్వెంచర్ బైక్‌లకు ప్రాధాన్యత ఏర్పడిన తరుణంగా ఇవి సరిగ్గా సరిపోతాయని కంపెనీ భావిస్తోంది.


Click it and Unblock the Notifications








