స్పోర్ట్స్ బైక్ ఎంట్రీ లెవల్‌లో సంచలనం.. KTM నుంచి బడ్జెట్ ధరలో అదిరిపోయే బైక్ లాంచ్

ప్రీమియం పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిళ్ల ప్రపంచంలో అగ్రగామి బ్రాండ్‌గా పేరుగాంచిన KTM, భారతీయ బైక్ మార్కెట్‌లో మరోసారి సంచలనాన్ని సృష్టించింది. ఎప్పుడూ తన రెడీ టూ రేస్‌ను ముందుకు నెడుతూ, అత్యుత్తమ పనితీరు, అద్భుతమైన డిజైన్, రైడింగ్ థ్రిల్‌ను అందించే KTM, ఇప్పుడు కొత్త ఎంట్రీ లెవల్ మోడల్‌ కెటీఎమ్ 160 డ్యూక్ (KTM 160 Duke) ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. భారత మార్కెట్లో దీని ధర వచ్చేసి రూ.1.85 లక్షల (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త డ్యూక్, ప్రీమియం 160cc సెగ్మెంట్‌లోకి KTM తీసుకున్న సాహసోపేతమైన అడుగుగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 200cc పైగా ఉన్న బైక్‌లతో స్పోర్ట్స్ బైక్ ప్రేమికులను అలరించిన KTM, ఇప్పుడు మరింత పెద్ద స్థాయిలో ఎక్కువ మంది యువ కస్టమర్లను పెంచుకునే దిశగా ఈ కొత్త బైకును తీసుకొచ్చింది.

కొత్త KTM 160 డ్యూక్ కేవలం లుక్‌లోనే కాకుండా, పనితీరులో కూడా KTM అసలైన DNAని ప్రతిబింబించేలా డిజైన్ చేయబడింది. దీని ఇంజిన్ విషయానికి వస్తే, 164.2 cc సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, SOHC ఇంజిన్ రైడర్‌కు రోడ్ మీద ఉత్సాహాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ మోటార్ 9,500 rpm వద్ద గరిష్టంగా 19 హార్స్‌పవర్ శక్తిని, అలాగే 7,500 rpm వద్ద 15.5 Nm పీక్ టార్క్‌ను అందిస్తుంది.

Ktm New Duke 160 Launched In India At Rs 1 85 Lakh

రైడింగ్ అనుభవాన్ని మరింత సాఫీగా, కంట్రోల్‌తో ఉంచేందుకు ఇంజిన్‌ను స్లిప్,అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌కు జత చేశారు. స్లిప్ క్లచ్ గేర్ డౌన్‌షిఫ్ట్ సమయంలో రియర్ వీల్ లాక్ అవకుండా కాపాడితే, అసిస్ట్ క్లచ్ క్లచ్ లివర్‌ను తేలికగా ఉపయోగించేలా చేస్తుంది. ఈ కాంబినేషన్ వల్ల KTM 160 డ్యూక్ కేవలం నగర రోడ్లలోనే కాకుండా, హైవేల్లో కూడా స్పీడ్, సౌకర్యాన్ని సమానంగా అందించగలిగే ఈ బైక్ నిలుస్తుంది.

కొత్త KTM 160 డ్యూక్ కేవలం పనితీరు పరంగా మాత్రమే కాదు, లుక్, టెక్నాలజీ పరంగానూ రైడర్ల మనసు గెలుచుకునేలా రూపొందించబడింది. ఇది ఎలక్ట్రానిక్ ఆరెంజ్, అట్లాంటిక్ బ్లూ, సిల్వర్ మెటాలిక్ మ్యాట్ వంటి మూడు ఆకర్షణీయమైన కలర్స్‌లో లభిస్తుంది. ఈ కలర్ ఆప్షన్స్ బైక్‌కి ఒక స్పోర్టీ, ప్రీమియం, అగ్రెసివ్ స్టైల్‌ని ఇస్తాయి, KTMకి సొంతమైన విజువల్ ఐడెంటిటీని మరింత బలపరుస్తాయి.

Ktm New Duke 160 Launched In India At Rs 1 85 Lakh

కంపెనీ ప్రకారం, బుకింగ్‌లు ఇప్పటికే అధికారిక KTM వెబ్‌సైట్, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని KTM డీలర్‌షిప్‌లలో ప్రారంభమయ్యాయి. రైడర్లు కేవలం ఒక క్లిక్‌తో ఆన్‌లైన్‌లోనూ, లేదా సమీప డీలర్‌ వద్ద నేరుగా వెళ్లి కూడా బుక్ చేసుకోవచ్చు. పనితీరుతో పాటు ప్రాక్టికాలిటీని దృష్టిలో ఉంచుకుని, KTM 160 డ్యూక్‌లో 10.1 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కల్పించబడింది, దీంతో సిటీ రైడింగ్‌, లాంగ్ రైడ్స్‌కి ఇది సరైన మోడల్ అవుతుంది.

టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ బైక్‌లోని 5-అంగుళాల LCD కన్సోల్ కేవలం స్పీడ్, రేవ్స్, లేదా ఫ్యూయల్ లెవల్ మాత్రమే చూపించదు. ఇది మొబైల్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. అంటే, మీ స్మార్ట్‌ఫోన్‌ని బైక్‌తో సింక్ చేసి, రైడ్ సమయంలోనే నేరుగా కన్సోల్‌పై నావిగేషన్ సూచనలను పొందవచ్చు. దీనిలో అధునాతన సస్పెన్షన్, బ్రేకింగ్ సిస్టమ్‌లను అమర్చారు.

Ktm New Duke 160 Launched In India At Rs 1 85 Lakh

ముందుభాగంలో WP అప్‌సైడ్-డౌన్ ఫోర్కులు 138 mm ట్రావెల్‌తో ఉంటాయి, ఇవి కఠినమైన బ్రేకింగ్ సమయంలోనూ లేదా హఠాత్తుగా వచ్చే గుంతల్లోనూ రైడర్‌కు మెరుగైన స్థిరత్వాన్ని అందిస్తాయి. వెనుక భాగంలో మోనో-లింకేజ్ సస్పెన్షన్ 161 mm ట్రావెల్‌తో ఉంటుంది, ఇది హైవేలు, సిటీ రోడ్లు, లేదా వంకర రోడ్ల మీదైనా స్మూత్ రైడింగ్ అనుభవాన్ని కల్పిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 12, 2025, 7:20 [IST]
English summary
Ktm new duke 160 launched in india at rs 1 85 lakh more details inside
Read more on: #ktm #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+