కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? మీకు అదిరిపోయే లక్కీ ఛాన్స్! భారీ తగ్గింపు ఇస్తున్న కంపెనీ

అంతర్జాతీయంగానే కాకుండా భారత్‌లో కూడా ప్రముఖ ప్రీమియం స్పోర్ట్స్ మోటార్‌సైకిల్ బ్రాండ్‌గా పేరుగాంచిన దిగ్గజ కంపెనీ కేటీఎమ్ (Ktm) మంచి మార్కెట్ కలిగి ఉంది. యూత్‌ను ఆకట్టుకునే విధంగా అధునాతన డిజైన్లతో కూడిన మోడళ్లను లాంచ్ చేయడంలో ఈ కంపెనీ చాలా ప్రసిద్ది చెందింది. గతంతో పోలిస్తే ఇటీవలి సంవత్సరాల్లో ఇండియాలో స్పోర్ట్స్ తరహా బైక్స్ వాడకం భారీగా పెరిగింది. దీంతో ktm వరుసగా కొత్త మోడళ్లను తీసుకొస్తూనే ఉంది. 2024 ఏడాదిలో మెరుగైన సేల్స్ సాధించిన కంపెనీ 2025లో కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో సేల్స్‌ను నమోదు చేయడానికి పలు కొత్త బైక్స్‌లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే కంపెనీ వీటిని తీసుకురావడానికి ముందు తన ప్రసిద్ధ స్ట్రీట్‌ఫైటర్ మోడల్ అయినటువంటి Gen-3 390 డ్యూక్‌ (390 Duke) బైక్‌పై భారీ ఎత్తున తగ్గింపు ఆఫర్ అందిస్తుంది. ఈ విషయాన్ని Ktm ఒక ప్రకటనలో తెలిపింది.

Ktm Gen-3 390 డ్యూక్‌ స్పోర్ట్స్ బైక్‌పై రూ.18,000 తగ్గింపు అందిస్తుంది. మార్కెట్లో దీని ధర రూ. 3.13 లక్షల వరకు ఉంది. అయితే ఇప్పుడు కంపెనీ ఇచ్చిన డిస్కౌంట్ ఆఫర్‌తో ఇది వినియోగదారులకు రూ.2.95 లక్షలకు కొనుగోలుకు అందుబాటులో ఉంది. 390cc విభాగంలో ఈ బైక్ అత్యంత ఫేమస్. ఇప్పుడు ధరను తగ్గించడం వలన యూత్ అట్రాక్ట్ అయి కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారని కంపెనీ భావిస్తోంది.

Ktm Offers Rs 18000 Discount Gen 3 390 Duke

మరో విషయం ఏమిటంటే ఈ బైక్ ధరను తగ్గించడంతో పాటు, అదనంగా కొత్త ఫీచర్స్‌ను తీసుకొచ్చింది. ఈ రెండింటి ద్వారా సేల్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది. కొత్తగా ప్రీమియం స్పోర్ట్స్ బైక్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారు ఇంత భారీ తగ్గింపుతో ఈ బైకును సొంతం చేసుకోవచ్చు. Gen-3 390 డ్యూక్‌ ఇంజిన్ విషయానికి వస్తే, 399 సీసీ LC4C ఇంజిన్‌తో రన్ అవుతుంది.

ఇది 46 PS పవర్, 39 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో అమర్చిన ఇంజిన్ రైడర్లకు మెరుగైన పనితీరును అందిస్తుందని కంపెనీ పేర్కొంది. 399 సీసీ విభాగంలో ఇది టాప్ ఫెర్ఫామెన్స్‌ను ఇస్తుంది. స్పోర్ట్స్ బైక్ లవర్స్‌కు ఇది బాగా సెట్ అవుతుంది. Gen-3 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా వచ్చిన 390 డ్యూక్‌ మెరుగైన హ్యాండ్లింగ్‌తో పాటు ట్రాక్షన్ కంట్రోల్‌ డైనమిక్స్‌ను మరింత మెరుగ్గా సపోర్ట్ చేస్తుంది.

Ktm Gen 3 390 Duke

ఇది బహుళ రైడింగ్ మెడ్స్‌లను కలిగి ఉంది. కార్నరింగ్, సూపర్‌మోటో ABS సిస్టంను కూడా దీనిలో అందించారు. ఇది రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. రైడింగ్‌లో రైడర్లకు మరింత సురక్షితమైన ప్రయాణాన్ని ఇవ్వడం కోసం అధునాతన బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. కొత్త అప్‌డేట్‌లలో ప్రధానంగా స్ట్రీట్, రెయిన్ రైడ్ మోడ్స్‌లతో ట్రాక్షన్ కంట్రోల్ (MTC), సూపర్‌మోటో ABS, క్విక్‌షిఫ్టర్+, కార్నరింగ్ ABS వంటి మొదలగు వాటిని కలిగి ఉంది.

భారతీయ మార్కెట్లో 390cc సెగ్మెంట్‌లో Gen-3 390 డ్యూక్‌, ఇతర కంపెనీలకు చెందిన మోడళ్లకు బలమైన ప్రత్యర్థిగా ఉంది. ఇప్పుడు కంపెనీ ధరను కూడా తగ్గించడం ద్వారా మరింత మంది వినియోగదారులు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, February 15, 2025, 9:10 [IST]
English summary
Ktm offers rs 18000 discount on streetfighter gen 3 390 duke here the details
Read more on: #ktm #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+