కారుకు సమానమైన ఇంజిన్‎తో KTM కొత్త రాక్షసుడు వచ్చేస్తున్నాడు..మిగతా కంపెనీలను మింగేయడం ఖాయం

ప్రపంచంలో ది బెస్ట్ పర్ఫామెన్స్ బైక్స్ తయారు చేయడంలో కేటీఎం సంస్థకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికే ఈ బ్రాండ్ నుంచి వచ్చిన 1390 సూపర్‌ డ్యూక్ R మోడల్ హై పర్ఫార్మెన్స్‌తో రైడర్‌లను ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడు అంతకంటే ఎక్కువ పవర్, మెరుగైన ప్రదర్శనను ఇచ్చే ఒక లిమిటెడ్ ఎడిషన్ ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను తీసుకురావడానికి కంపెనీ సిద్ధమవుతోంది.

ఈ కొత్త మోడలే 1390 సూపర్‌ డ్యూక్ RR. ఇది కేవలం కొన్ని యూనిట్లలో మాత్రమే తయారవుతుంది. వాస్తవానికి 2025 EICMA మోటో షోలో దీన్ని పరిచయం చేయాలనుకున్నా, కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా ఆలస్యమైంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ రాక్షస మోడల్ 2026లో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉంది.

KTM Unveils 1390 Super Duke RR Details A Limited Edition Flagship Hyper-Naked is Coming Soon

లిమిటెడ్ ఎడిషన్ కావడంతో, ఈ బైక్‌ను కొద్ది మంది లక్కీ రైడర్‌లకు మాత్రమే కేటీఎం అందించనుంది. ఈ కొత్త బైక్ వివరాలను కంపెనీ స్పష్టంగా వెల్లడించింది. పర్ఫార్మెన్స్‌ను పెంచడానికి కేటీఎం ఇంజనీర్లు ముఖ్యంగా బైక్ బరువును తగ్గించడంపై దృష్టి పెట్టారు. స్టాండర్డ్ 1390 సూపర్‌ డ్యూక్ R బరువు 212.5 కిలోలు ఉంటే, కొత్త RR మోడల్ బరువు కేవలం 204 కిలోలు మాత్రమే.

అంటే దాదాపు 8.5 కిలోల బరువును తగ్గించడం జరిగింది. బరువు తగ్గడం వల్ల బైక్ వేగంగా దూసుకుపోవడమే కాకుండా కార్నర్‌లలో మరింత కచ్చితత్వంతో కంట్రోల్ చేయడం ఈజీ అవుతుంది. ఈ సూపర్ మోడల్‌కు కేటీఎం ప్రఖ్యాత 1350 సీసీ వీ-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ శక్తినిస్తుంది. ఈ ఇంజన్ కేవలం 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 190 బీహెచ్‌పీ (బ్రేక్ హార్స్‌పవర్) శక్తిని, 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 145 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

KTM Unveils 1390 Super Duke RR Details A Limited Edition Flagship Hyper-Naked is Coming Soon

ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. పర్ఫార్మెన్స్ అప్డేట్ కోసం RR మోడల్‌లో ప్రత్యేకంగా అక్రపోవిక్ (Akrapovic) టైటానియం ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను అమర్చారు. అంతేకాకుండా, బరువును మరింత తగ్గించడానికి, పర్ఫార్మెన్స్‌ను పెంచడానికి విస్త్రృతమైన కార్బన్-ఫైబర్ భాగాలను, తేలికైన లిథియం-అయాన్ బ్యాటరీని ఉపయోగించారు.

RR మోడల్‌లో ఉపయోగించిన WP అపెక్స్ ప్రో USD ఫోర్క్‌లు, మోనో-షాక్ రియర్ సస్పెన్షన్ అద్భుతమైనవి. ఇవి సిటీలో, హైవేపై కూడా అత్యుత్తమ స్థిరత్వాన్ని, సౌకర్యాన్ని అందిస్తాయి. బ్రేకింగ్ సిస్టమ్‌కు వస్తే, ముందు వైపున బ్రెమ్బో పవర్ఫుల్ కాలిపర్‌లు, పెద్ద డిస్క్ బ్రేక్‌లు అసాధారణమైన స్టాపింగ్ శక్తిని అందిస్తాయి. హ్యాండిల్‌బార్ సెటప్‌ను కూడా స్పోర్టీగా మార్చారు, ఇది రైడర్‌కు మరింత ఆత్మవిశ్వాసంతో కూడిన కంట్రోల్ ఇస్తుంది.

KTM Unveils 1390 Super Duke RR Details A Limited Edition Flagship Hyper-Naked is Coming Soon

కేటీఎం ఇప్పుడు భారతదేశంలో బజాజ్ ఆటో (Bajaj Auto) ఆధ్వర్యంలో పనిచేస్తోంది. ఇప్పటికే స్టాండర్డ్ సూపర్‌ డ్యూక్ R మోడల్ ఇండియాలో రూ.22.95 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో అమ్ముడవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత ఈ లిమిటెడ్ ఎడిషన్ 1390 సూపర్‌ డ్యూక్ RR మోడల్ కూడా 2026 నాటికి భారత్‌లోకి రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరింత ప్రీమియం ఫీచర్లు, అదనపు పర్ఫార్మెన్స్ మెరుగుదలలతో ఇది అంతర్జాతీయ బైక్ ప్రియులకు ఒక అద్భుతమైన ఆప్షన్ కానుంది.

More from DriveSpark

Article Published On: Friday, December 12, 2025, 9:42 [IST]
English summary
Ktm unveils 1390 super duke rr details a limited edition flagship hyper naked is coming soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+