KTM లవర్స్‌కు పెద్ద గుడ్‌న్యూస్.. అదిరిపోయే కొత్త స్టన్నింగ్ బైక్ వస్తుంది.. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి

భారత్‌లో స్టైలిష్ స్పోర్ట్స్ మోడల్ తరహా బైకులకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. సాధారణ టూవీలర్స్‌తో పోలిస్తే ఇవి మెరుగైన ఇంజిన్ పనితీరును కలిగి ఉంటాయి. దేశంలోని చాలా టూవీలర్ తయారీ మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకుని నిలబడటానికి అధునాతన ఫీచర్స్, ఆకట్టుకునే డిజైన్లతో స్టైలిష్ మోడల్ బైక్స్‌లను విడుదల చేస్తున్నారు. ఇలాంటి మోడళ్లను తయారు చేసి విడుదల చేయడంతో ప్రముఖ కంపెనీ కేటీఎమ్ (Ktm) చాలా ప్రసిద్ది చెందింది. అంతర్జాతీయంగా కూడా ఇది మంచి మార్కెట్‌ను కలిగి ఉంది. ప్రపంచ మార్కెట్లో బాగా ప్రసిద్ధి చెందిన తన మోడళ్లను ఇండియాలో కూడా విడుదల చేస్తూ ఇక్కడి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కేటీఎమ్ బైక్స్ ఇండియాలో నగరాలు, పట్టణాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆఫ్‌రోడ్ ప్రయాణాలకు ఈ బైక్స్ పెట్టింది పేరు. వీటి డిజైన్ చూడగానే ఆఫ్‌రోడ్ ప్రయాణాలకు బెస్ట్ ఆప్షన్‌గా అనిపించేలా ఉంటాయి.

ప్రతి ఏడాది కూడా సరికొత్త బైక్స్‌లను లాంచ్ చేస్తున్న KTM ఈ కొత్త ఏడాదిలో అదిరిపోయే బైక్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న రెండవ తరం KTM 390 అడ్వెంచర్ ఎస్ బైక్‌ను జనవరి 30న ఇండియాలో లాంచ్ చేయబోతుందని సమాచారం. ఈ మోడల్‌ను కంపెనీ ఇటలీలోని మిలన్‌లో జరిగిన 2024 EICMA మోటార్ షోలో ఆవిష్కరించింది. అలాగే, 2024 ఇండియా బైక్ వీక్‌లో దేశంలో ప్రదర్శించారు.

Ktm Will Launch New 390 Adventure S Model Launch

KTM 390 అడ్వెంచర్ S డిజైన్‌ను పరిశీలిస్తే, ఇది దాని పాత తరం కంటే కొత్తగా అనిపిస్తుంది. కొత్త అప్‌డేట్స్ చాలా ఉన్నాయి. దీనిని పూర్తిగా ఇండియాలోనే తయారు చేశారు. ఇవి ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి తక్కువ ధరలో విడుదల కాబోతోందని తెలుస్తుంది. దీనిలో ఫీచర్స్ బోలెడు ఉన్నాయి. 390 డ్యూక్ బైక్‌లో ఉన్నట్టుగానే 5-అంగుళాల TFT డిస్‌ప్లేను అందించారు. డ్యూయల్-ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్ సెటప్ ఆకట్టుకుంటుంది.

ఇంకా పొడవైన విండ్‌స్క్రీన్, పొడవాటి ఫ్రంట్ మడ్‌గార్డ్, విశాలమైన బాడీ ప్యానెల్‌లు, సెక్షన్డ్ DRLలు, కంఫర్ట్‌గా ఉండే హ్యాండ్‌గార్డ్‌లు, పాత మోడల్ కంటే మరింత మెరుగ్గా అప్‌డేట్ అయిన టెయిల్ సెక్షన్ వంటివి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ముందు 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, వెనుక 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఇది డ్యూయల్-పర్పస్ టైర్లను కలిగి ఉంటుందని సమాచారం.

Ktm Will Launch New 390 Adventure S Design

KTM 390 అడ్వెంచర్ Sతో పాటే కంపెనీ మరో మోడల్‌ను కూడా తీసుకువస్తుంది. దాని పేరే 'ఎండ్యూరో R'. ఈ రెండు బైక్స్ కూడా ఒకే విధంగా సర్దుబాటు చేయగల సస్పెన్షన్‌ను కలిగి ఉంటాయి. ఎండ్యూరో R మోడల్ కాస్త భిన్నంగా అనిపిస్తుంది. ఈ రెండు 399సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో రన్ అవుతాయి. ఇది 45.5 bhp పవర్‌‌ను, 39 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ జత చేశారు. మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ రెండు బైక్స్‌లను లోకల్‌గా తయారు చేశారు. మొదట KTM 390 అడ్వెంచర్ Sను విడుదల చేసిన తర్వాత ఎండ్యూరో Rను మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. ఈ రెండు మోడళ్ల ధరలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. పాత తరం మోడల్‌తో పోలిస్తే కొత్త తరం అడ్వెంచర్ ధర మరింత ఎక్కువగా ఉంటుంది.

Ktm Will Launch New Enduro

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, January 29, 2025, 11:10 [IST]
English summary
Ktm will launch new 390 adventure s model bike on january 30 all details check here
Read more on: #ktm #new bike #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+