ఓల్డ్ ఈజ్ గోల్డ్.. ఫేమస్ వింటేజ్ కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ.. ఓలా, ఏథర్లకు షాక్ తగిలినట్టే!
ప్రస్తుతం భారత్‌లో ఈవీల హవా కొనసాగుతోంది. ఫ్యూయల్ ఖర్చులు రోజురోజుకు పెరిగిపోతుండడం.. కాలుష్యం అధికమవడం వంటి కారణాలతో జనం ఈవీ వాహనాలను వాడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అదే సమయంలో అనేక వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల తయారు చేసి, పోటీ పెంచుతున్నాయి. టు- వీలర్స్ విషయంలో దిగ్గజ సంస్థలెన్నో ఈవీలతో తమ మార్క్ చూపెట్టాయి. 90వ దశకంలో ఓ వెలుగు వెలుగిన దిగ్గజ టూ-వీలర్ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లతో మార్కెట్లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది. అదే ఎల్ఎమ్‌ఎల్ (LML). ఈ విషయం తెలియగానే టూ-వీలర్ ప్రేమికులు ఎల్‌ఎమ్‌ఎల్ సంస్థ గురించి మళ్లీ ఆరా తీస్తున్నారు. ఈ సరికొత్త స్కూటర్ ఎలా ఉండబోతుంది, దీని ఫర్పామెన్స్, ప్రత్యర్థి స్కూటర్లకు సంబంధించిన వివరాలు ఇక్కడ మీకోసం..
లూనా, కైనెటిక్ వంటి దిగ్గజ వాహన సంస్థలు ఇదివరకే ఎలక్ట్రిక్ టూ-వీలర్ రంగంలోకి అడుగుపెట్టాయి. ఇప్పుడిక LML వంతు. తమ బ్రాండ్ నుంచి మూడు కొత్త టూ- వీలర్స్ ద్వారా భారత్ మార్కెట్లోకి ప్రవేశిస్తామని గతేడాది ఎల్ఎమ్‌ఎల్ సంస్థ ప్రకటించింది. ఓరియాన్, మూన్ షాట్, స్టార్ పేర్లతో వీటిని తీసుకువస్తామని తెలిపింది. త్వరలోనే వీటిని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది ఎల్ఎమ్‌ఎల్ సంస్థ.

ఈ స్కూటర్ లాంచ్‌కి సంబంధించిన సన్నాహక పనులను కూడా ఈ సంస్థ ఇదివరకే ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఈ ఏడాది చివరినాటికి భారత్‌లో లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లలో పేరు పొందిన సంస్థలైన ఓలా, ఏథర్ వంటి సంస్థలకు రానున్న రోజుల్లో ఎల్ఎమ్‌ఎల్ గట్టి పోటీ ఇవ్వనుంది. ఇదే క్రమంలో తమ స్టార్ ఇ-స్కూటర్‌కు సంబంధించి రేంజ్, పెర్ఫార్మెన్స్‌ని వెల్లడించి మార్కెట్లో హైప్ పెంచేసింది.
స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ విషయానికి వస్తే.. దీన్ని విదేశీ టు- వీలర్ దిగ్గజ సంస్థలైన డుకాటి, ఫెరారి, యమహా, కవాసాకి వంటి వాహనాలు తయారు చేసిన వారు దీన్ని డిజైన్ చేశారు. ఇక దీన్ని బట్టి ఇది లుక్స్ పరంగాను అదరగొట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా ఈ స్కూటర్‌లో ఇన్నోవేటివ్ ఫీచర్లు, ప్రీమియం డిజైన్, ఎక్సెలెంట్ పర్ఫార్మెన్స్ వంటి ఫీచర్లు జోడించి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ స్టార్ ఇ- స్కూటర్ ఏకంగా 203 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. భారత్‌లో ఇప్పటివరకు ఉన్న స్కూటర్ల ఛార్జింగ్‌తో అందే దూరం కంటే ఇదే అధికం కావాడం గమనార్హం. అయితే ఈ స్కూటర్ బ్యాటరీ సైజ్ గురించి వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఈ స్కూటర్‌లో రెండు సెట్ల రిమూవెబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఉండబోతున్నట్లు సమచారం.
ఇది 7.8 bhp పవర్‌ని ఉత్పత్తి చేయగలదు. దీని టాప్ స్పీడ్ 90kmphగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా ఫ్యూచరిస్టిక్ లుక్‌లో ఉండబోతోంది. ఈ స్కూటర్ డ్యూయల్ టోన్ బ్లాక్, వైట్ బాడీ కలర్ ఆప్షన్లతో లభిస్తుంది. దీంట్లో LED DRL, ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, రెడ్ యాసెంట్స్(Red accents) వంటివి ఉంటాయి. దీని డిజైన్ పరంగా మిడ్- మ్యాక్సీ స్కూటర్‌గా దీన్ని అభివర్ణించింవచ్చు.

ఈ స్కూటర్ లో 14 అంగుళాల అలాయ్ వీల్స్ ఉంటాయి. డిజిటల్ డిస్‌ప్లే, వైర్లెస్ ఛార్జర్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉంటాయి. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ మోడ్, ఏబీఎస్ వంటి సేఫ్టీ ఫీచర్లు దీంట్లో ఉండనున్నాయి. మొత్తంగా చూస్తే ఎల్ ఎంఎల్ ఇ-స్కూటర్ల రంగంలోకి లేటుగా ఎంట్రీ ఇచ్చినా.. ఇతర సంస్థలకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications








