47 కి.మీ మైలేజ్... రూ. 93,927 ధరతో టీవీఎస్ ఎన్‌టార్క్ 125కి 3 బెస్ట్ ఆల్టర్నేటివ్ స్కూటర్లు ఇవే
టీవీఎస్ ఎన్‌టార్క్ 125 అనేది యూత్ ఫేవరేట్ స్కూటర్. దీని ధర రూ.93,927 నుండి రూ.1.10 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది 124.8 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 47 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది.
డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, యూఎస్‌బీ ఛార్జర్, 20-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని సేఫ్టీ కోసం డ్రమ్/డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఎన్‌టార్క్ 125కి ప్రత్యామ్నాయంగా ఈ 3 పాపులర్ స్కూటర్‌లను కొనుగోలు చేయవచ్చు. అవేంటో వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. హోండా డియో 125 : ఇది ఒక పాపులర్ స్కూటర్. ఇది టీవీఎస్ ఎన్‌టార్క్ 125కి బెస్ట్ ఆల్టర్నేటివ్. దీని ధర రూ.91,649 నుండి రూ.97,044 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది 123.92 సీసీ ఎయిర్-కూల్డ్, ఫ్యూయెల్-ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌ను కలిగి ఉంది. ఇది 48 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది.
ఈ స్కూటర్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ ఫంక్షన్ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. దీని పొడవు 1830 mm, వెడల్పు 707 mm, ఎత్తు 1172 mm. ఇందులో 5.3 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంది. డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది.

2. సుజుకి యాక్సెస్ 125 : సుజుకి యాక్సెస్ 125 స్కూటర్‌ను కూడా టీవీఎస్ ఎన్‌టార్క్ 125కి ప్రత్యామ్నాయంగా కొనుగోలు చేయవచ్చు. ఇది చాలా తక్కువ ధరలో వినియోగదారులకు లభిస్తుంది. దీని ధర రూ.87,000 నుండి రూ.98,000(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది చాలా సరళమైన డిజైన్‌ను కలిగి ఉంది.
మెటాలిక్ మ్యాట్ స్టెల్లర్ బ్లూ, పెర్ల్ షైనీ బీజ్, పెర్ల్ గ్రేస్ వైట్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్, సాలిడ్ ఐస్ గ్రీన్ వంటి రంగులలో కూడా అందుబాటులో ఉంది. కొత్త యాక్సెస్ 125 స్కూటర్ 125 సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌ను కలిగి ఉంది.

ఇది 45 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. దీని బరువు దాదాపు 106 కేజీలు. 160 mm గ్రౌండ్ క్లియరెన్స్, 1265 mm పొడవైన వీల్‌బేస్ కలిగి ఉంది. 5 లీటర్ల సామర్థ్యంతో కూడిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంది.
ఇది డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి పదుల సంఖ్యలో ఫీచర్లను కలిగి ఉంది. దీని టాప్ స్పీడ్ గంటకు 90కిమీ. సేఫ్టీ కోసం ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక సింగిల్-షాక్ అబ్సార్బర్ సస్పెన్షన్ సెటప్ ఉంది. డిస్క్/డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది.

3. హీరో డెస్టినీ 125 : హీరో డెస్టినీ 125 స్కూటర్‌ను కూడా టీవీఎస్ ఎన్‌టార్క్ 125కి బదులుగా తీసుకోవచ్చు. ఇది బడ్జెట్ ధరలో కూడా లభిస్తుంది. దీని ధర రూ.99,000 నుండి రూ.1.13 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది 124 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 59 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఇది ఈ సెగ్మెంట్లో బెస్ట్ మైలేజ్ అని చెప్పొచ్చు.
కొత్త డెస్టినీ 125 స్కూటర్ డిజిటల్ డిస్‌ప్లే, టర్న్-బై-టర్న్ నావిగేషన్, బూట్ ల్యాంప్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. దీని బరువు సుమారు 115 కేజీలు. 5.3 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంది. డ్రమ్/డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: టీవీఎస్ ఎన్‌టార్క్ 125 యువతకు నచ్చే స్కూటర్. అయితే, మార్కెట్లో దీనికి ధీటుగా, మెరుగైన ఫీచర్లు, మైలేజ్‌తో పాటు బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న స్కూటర్లు కూడా ఉన్నాయి. హోండా డియో 125, సుజుకి యాక్సెస్ 125, హీరో డెస్టినీ 125 వంటివి మంచి ప్రత్యామ్నాయాలు.


Click it and Unblock the Notifications








