కొత్తగా వచ్చిన మ్యాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ ఫీచర్స్.. అన్ని అదిరిపోతున్నాయ్..
ఎలక్ట్రిక్ వాహనాలపై క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఖర్చులు కలిసి వస్తాయని చాలా మంది టూ- వీలర్ వినియోగదారులు.. ఈవీలను కొనుగోలు చేస్తున్నారు. ఓలా, ఏథర్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ల రంగంలో తమదైన ముద్ర వేశాయి. మరోవైపు.. మరిన్ని స్టార్టప్ సంస్థలు కూడా వీటి కంటే ముందు నుంచే ఈవీ రంగంలో నిలదొక్కుకుని ఉన్నాయి. ఇలాంటి సంస్థల్లో యాంపియర్ ఒకటి. ఈ కంపెనీ నుంచి నెక్సస్ ఇ-స్కూటర్ ఈ కంపెనీనికి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ సంస్థ మరో కొత్త స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. సరికొత్త డిజైన్‌తో వచ్చిన ఈ ఇ-స్కూటర్ ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఈ స్కూటర్లో ఉన్న ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం.
అన్ని రకాల కస్టమర్లను ఆకర్షించేందుకు యాంపియర్ సంస్థ వివిధ వాహనాలను మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఈ కంపెనీ నుంచి పాపులర్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ మాగ్నస్ నుంచి మరో కొత్త వేరియంట్‌ను ఇటీవల తీసుకువచ్చింది. మ్యాగ్నస్ నియో పేరుతో దీన్ని విడుదల చేసింది.

ఈ ఈవీ రూ.79,999 ఎక్స్- షోరూమ్ ధరలో మార్కెట్లో అందుబాటులో ఉంది. యాంపియర్ లైనప్‌లో EX వేరియంట్ స్థానంలో మ్యాగ్నస్ నియోను తీసుకువచ్చారు. డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్ మినహా... ఈ నియో వెర్షన్ డిజైన్ ఇతర వేరియంట్ల తరహాలోనే ఉంటుందని చెప్పవచ్చు. అయితే కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఇందులో మరికొన్ని మార్పులను కూడా తీసుకువచ్చింది యాంపియర్ సంస్థ.
దీంట్లోని కొన్ని కాస్మెటిక్ మార్పులు చేశారు. ఇది ఎవరి దృష్టినైనా ఇట్టే ఆకర్షించగలదని కంపెనీ భావిస్తోంది. రివైజ్‌డ్ హెడ్ ల్యాంప్, రీడిజైన్‌డ్ ఫ్రంట్ యాప్రాన్, న్యూ ఇండికేటర్ యూనిట్లు వంటి వాటితో మ్యాగ్నస్ నియోను మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఈ స్కూటర్ Galactic Gray, Glossy Black, Glacial White, Metallic Red, and Ocean Blue అనే ఐదు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

2.3kWh LFP బ్యాటరీ ప్యాక్‌తో ఈ స్కూటర్ వస్తుంది. సింగిల్ ఛార్జ్‌తో ఇది 70 కి.మీ నుంచి 80 కి.మీ.ల దూరం వరకు ఇది ప్రయాణిస్తుందని యాంపియర్ సంస్థ చెబుతోంది. దీంట్లో లిథియం- ఫెర్రో- పాస్ఫేట్ బ్యాటరీ(LFP).. డిస్కంటిన్యూ చేసిన EX వేరియంట్ కంటే తక్కువ రేంజ్ అందిస్తుంది. LFP బ్యాటరీ ప్యాక్.. NMC బ్యాటరీ తరహాలో energy denseను కలిగి ఉండదు కాబట్టి ఇది మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది.
ఈ మ్యాగ్నస్ నియో ఇ-స్కూటర్ 65 kmph గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది. ఇది ఈ మ్యాగ్నస్వేరియంట్‌లో ఇదే అత్యధిక వేగం కావడం గమనార్హం. ఈ కొత్త మోడల్‌లో మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇది 12 అంగుళాల వీల్స్ తో ఉంటుంది. అంతకుముందు ఉన్న మోడల్స్‌లో కేవలం 10 అంగుళాల వీల్సే ఉన్నాయి
ఈ మ్యాగ్నస్ నియో మోడల్... చిన్న డిజిటల్ డ్యాష్ బోర్డుతో ఉంటుంది. ఇది 165 మి.మీ.ల గ్రౌండ్ క్లియరెన్స్‌తో ఉంటుంది. ఇది మునుపటి EX వెర్షన్ కంటే 18 మి.మీ.ల ఎత్తులో ఉంటుంది. ఇది 150 కిలోల లోడింగ్ కెపాసిటీతో ఉంటుంది. ఈ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ రివర్స్ మోడ్ సహా మూడు రైడ్ మోడ్స్‌తో ఉంటుంది. దీంట్లో USB ఛార్జర్ సదుపాయం కూడా ఉంటుంది.
ఈ మ్యాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి 5-6 గంటల సమయం పడుతుంది. దీనికి 5 సంవత్సరాలు లేదా 75,000 కి.మీ బ్యాటరీ వారంటీని కల్పిస్తోంది యాంపియర్ సంస్థ. రూ.79,999 ధరలో ఈ ఇ-స్కూటర్ లభించడం.. ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఇదే అత్యంత అందుబాటు ధరలో ఉన్నదిగా చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








