రూ. 35,000 లకే ‘మంత్ర' ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల.. రూ. 5000 డౌన్‌పేమెంట్ కడితే చాలు బండి మీదే!
ఎలక్ట్రిక్ కార్ల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో అనేక వాహన తయారీ సంస్థలు.. కొత్త ఈవీలతో ముందుకు వస్తున్నాయి. స్టార్టప్‌లతో పాటు దిగ్గజ సంస్థలు కూడా ఈవీలతో మార్కెట్లో పోటీని పెంచుతున్నాయి. అయితే.. ఎలక్ట్రిక్ వాహనాల వాడకంతో ఖర్చులు తగ్గుతాయన్న మాట నిజమే అయినప్పటికీ.. వీటి ధర అధికంగా ఉండడం వల్ల చాలా మంది ఈవీలను కొనాలంటే బెంబేలెత్తిపోతుంటారు. ఈ సమస్యకు పరిష్కారాన్ని కల్పించేలా మంత్ర అనే ఓ స్టార్టప్ సంస్థ ముందుకు వచ్చింది. తమ బ్రాండ్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్‌లను అత్యంత తక్కువ ధరలో తీసుకువచ్చింది. దీంతో తమ ఈవీలు.. ఎకో- ఫ్రెండ్లీ మాత్రమే కాదు, బడ్జెట్ ఫ్రెండ్లీ అని కూడా అంటోందీ సంస్థ. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఉన్న ఫీచర్లు, రేంజ్, ధర తదితర విశేషాలు తెలుసుకుందాం.
వినియోగదారుల బడ్జెట్లకు, వారి అవసరాలకు తగ్గట్టుగా వివిధ స్కూటర్ మోడళ్లను మంత్ర సంస్థ అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.5,000 డౌన్ పేమెంట్‌తో తమ స్కూటర్‌ను ఇంటికి తీసుకువెళ్లవచ్చని చెబుతోంది. RTO, non-RTO వెర్షన్లని కలుపుకుని మంత్ర సంస్థ 10 విభిన్న మోడళ్లను తీసుకువచ్చింది. non-RTO కేటగిరీలోని బేస్ మోడల్ ధర రూ.35,000 నుంచి మొదలవుతుంది. ఇది 60 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది.

డ్యూయల్ బ్యాటరీ వేరియంట్ రూ.40,000 కు అందుబాటులో ఉంది. Vapor Grill model రూ.56,000లకు లభిస్తుండగా ఇది 80 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది. ఇక దీంట్లో ఇతర పాపులర్ మోడళ్లైన VaporU ధర రూ. Rs 54,000గాను, మోనార్క్ ధర రూ.57,000గా ఉంది. ఈ రెండు మోడళ్లు కూడా 80 కి.మీ.ల రేంజ్ అందిస్తాయి.
ఇక దీంట్లో యాక్టివా మోడల్ ధర రూ.53,000గా ఉంది. ఇది కూడా 80 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది. అదే సమయంలో B9 Activa New మోడల్ రూ.60,000కు అందుబాటులో ఉంటూ 100 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది. మంత్ర ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఫీచర్లకు కొదవలేదని చెప్పవచ్చు. దీంట్లోని B9 Vapor New మోడల్ రూ.64,000 ధరలో లభిస్తంంది.

ఈ స్కూటర్‌లో జెల్ అండ్ లిథియం బ్యాటరీ ఆప్షన్స్, ఆటో- లాకింగ్ సిస్టం, రివర్స్ మోడల్, LED లైట్స్, పవర్ బ్రేక్స్, ట్యూబ్‌లెస్ టైర్స్, USB పోర్ట్, సెంట్రల్ లాకింగ్ సిస్టం వంటి ఫీచర్లు ఉంటాయి. అంతేగాకుండా వినియోగదారులు దీంట్లోని బ్యాటరీ రకాన్ని, మోడల్‌ను బట్టి సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు వారంటీ సదుపాయాన్ని పొందవచ్చు.
ఇక రూ.35,000కు లభించే మోడల్ ఐదు బ్యాటరీ ఆప్షన్స్‌తో వస్తుంది. ఇది 60- వోల్ట్ సిస్టంపై ఆపరేట్ అవుతుంది. రూ.5,000 నుంచి రూ.10,000 మధ్య ఉండే డౌన్‌పేమెంట్‌తో ఇన్‌స్టాల్‌మెంట్ ప్లాన్స్ ఎంచుకోవచ్చు. ఎంట్రీ- లెవెల్ స్కూటర్‌లో కలర్‌ఫుల్ మీటర్, ట్యూబ్‌లెస్ టైర్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, LED లైట్స్, సెంట్రల్ లాక్ సిస్టం వంటి ఫీచర్లు ఉంటాయి.

ఇక దీంట్లోని టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.64,000గా ఉంటూ.. ఇది 120 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్‌లో 12 అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్స్, స్పేషియస్ లాంగ్ సీట్, 25- లీటర్ బూట్ స్పేస్, డ్యూయల్ డిస్క్ బ్రేకింగ్ సిస్టం, వైబ్రెంట్ డిజిటల్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉంటాయి. వినియోగదారులు ఈ వాహనాన్ని కొనుగోలు చేసే ముందు ఫ్రీ టెస్ట్ రైడ్ కూడా చేయవచ్చు.
అంతేగాకుండా ఈ స్కూటర్ కొనుగోలు చేసేవారికి 32- ఇంచ్ LED TV వంటి ఆకర్షణీయమైన బహుమతులు కూడా ఆఫర్ చేస్తోందీ సంస్థ. ప్రస్తుతం ఎలక్ట్రిక్ మార్కెట్‌లో పెరుగుతున్న ఆదరణతో ఈ కంపెనీలు ఈవీ స్కూటర్లను తీసుకువస్తోంది. మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు తక్కువ ధరలో భారీ ఫీచర్లను ఈ సంస్థ ఆఫర్ చేస్తోంది. కావున ఎవరైనా కొత్తగా ఈవీ స్కూటర్లను కొనాలని చూస్తే దీనిని ట్రై చేయవచ్చు.


Click it and Unblock the Notifications








