పెరుగుతున్న పెట్రోల్ ఖర్చులకు ఫుల్ స్టాప్ పెట్టేయండి.. భారీ తగ్గింపు ధరతో ఈ హీరో స్కూటర్ కొనేయండి

ఏంటీ రోజు ఆఫీసుకు బస్సులో పోవడం ఇబ్బందిగా ఉందా.. అయితే కొత్త స్కూటర్ కొనాలని చూస్తున్నారా. అయితే మీకో శుభవార్త. హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ ఉంటే విడా వి2 ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు భారీగా తగ్గాయి. చూపు తిప్పుకోనీయని డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్‎తో మార్కెట్లో దూసుకుపోతున్న ఈ బండి మరింత మందికి అందుబాటులో ఉండేలా తక్కువ ధరలో కంపెనీ ప్లాన్ చేసింది.

ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ హీరో విడా వి2 ఎలక్ట్రిక్ స్కూటర్ వి2 లైట్, వి2 ప్లస్, వి2 ప్రో అనే మూడు వేరువేరు వేరియంట్స్‎లో లభిస్తోంది. కంపెనీ ఇప్పుడు ఈ స్కూటర్ల విక్రయాలను మరింత పెంచడానికి రెడీ అయింది. ఇందులో భాగంగానే వివిధ వేరియంట్ల ధరలను భారీగా తగ్గించింది.

Hero Electric Scooter

హీరో విడా వి2 లైట్ మోడల్ ధర ఏకంగా రూ.11,000 తగ్గింది. ధర తగ్గింపు తర్వాత, ఈ ఎంట్రీ-లెవెల్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.74,000కు చేరుకుంది. మరోవైపు, విడా వి2 ప్లస్ మోడల్ ధర దాదాపు రూ.15,000 తగ్గింది. దీంతో కొనుగోలుదారులు ఈ మిడ్-లెవెల్ వేరియంట్‌ను రూ.82,800 ఎక్స్-షోరూమ్ ధరలో సొంతం చేసుకోవచ్చు.

అయితే, టాప్-ఎండ్ మోడల్ అయిన విడా వి2 ప్రో ధర మాత్రం రూ.4,700 పెరిగింది. ప్రస్తుతం దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1,20,300గా ఉంది. కొత్తగా ధరలు తగ్గిన హీరో విడా వి2 లైట్ 2.2 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 94 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీని గరిష్ట వేగం గంటకు 69 కిలోమీటర్లు.

Price Drop for Popular Hero Electric Scooter

హీరో విడా వి2 ప్లస్ 3.44 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 143 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు.

ఇక హీరో విడా వి2 ప్రో విషయానికొస్తే, ఇది అత్యంత శక్తివంతమైన మోడల్. ఇది 3.94 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది మరియు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 165 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు.

Hero Electric

హీరో విడా వి2 అన్ని మోడళ్లలోనూ దాదాపు ఒకే విధమైన ఫీచర్స్ ఉన్నాయి. ముఖ్యంగా 7-ఇంచుల TFT టచ్‌స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, రీ-జెన్ బ్రేకింగ్, కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు వీటిలో ఉన్నాయి. ఈ స్కూటర్లు మ్యాట్ నెక్సస్ బ్లూ-గ్రే, గ్లోసీ స్పోర్ట్స్ రెడ్ వంటి వివిధ కలర్స్‎లో లభిస్తాయి.

హీరో విడా వి2 ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు తగ్గడం వినియోగదారులకు నిజంగా గుడ్ న్యూసే. ఈ స్కూటర్ లేటెస్ట్ డిజైన్, ఫీచర్లతో పాటు ఇప్పుడు మరింత అందుబాటు ధరలో లభిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ స్కూటర్‌కు కొనుగోలుదారుల నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, April 13, 2025, 7:00 [IST]
English summary
Massive price drop for popular hero electric scooter check how much you can save
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+