ఉద్యోగాలు, కాలేజ్, చిన్న వ్యాపారాలకు బెస్ట్ బైక్‌లు.. పెట్టిన ప్రతి రూపాయికి లాభం

మన దేశంలో సాధారణ మధ్యతరగతి, పేద కుటుంబాల జీవనశైలిలో టూవీలర్ ఇప్పుడు ఒక అవసరంలా మారిపోయింది. ఉద్యోగాలకు వెళ్లాలన్నా, కాలేజీకి వెళ్లాలన్నా, చిన్న చిన్న వ్యాపారాలు చేయాలన్నా.. బైక్ లేకుండా ఒక అడుగు కూడా ముందుకేయలేని పరిస్థితి వచ్చింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మీద ఆధారపడితే టైం ఎక్కువగా వృధా అవుతుంది, ఖర్చు కూడా తగ్గదనే అనిపించదు. అందుకే చాలా కుటుంబాలు తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకుల వైపు మళ్లిపోతున్నాయి. ఇలాంటి డిమాండ్ ఉన్న సెగ్మెంట్‌లో 125cc బైకులు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఇవి మైలేజ్ బాగానే ఇస్తాయి, పవర్ సరిపడా ఉంటుంది, అంతేకాదు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ఎక్కువ కావు. ఈ కేటగిరీలో మూడు బైకులు టీవీఎస్ రైడర్ 125, బజాజ్ పల్సర్ 125, హోండా షైన్ 125 గురించి చూద్దాం.

Honda Shine 125: హోండా షైన్ 125 అయితే పూర్తిగా ఫ్యామిలీ యూజ్‌కి తగ్గట్టుగా ఉంటుంది. డిజైన్ సింపుల్‌గా ఉన్నా, నాణ్యతలో మాత్రం ఎప్పటిలాగే హోండా స్టాండర్డ్‌ను నిలబెట్టుకుంటుంది. ఇంజిన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది, రైడ్ కంఫర్ట్ బాగుంటుంది. ఎక్స్-షోరూమ్ ధర రూ.89,008 నుంచి రూ.1.02 లక్షల వరకు ఉండటంతో, ఎక్కువ ఖర్చు చేయకుండా ఒక మంచి మైలేజ్ బైక్‌ను పొందాలనుకునే వారికి ఇది సరైన ఆప్షన్.

Middle Class Best Mileage bikes Honda Shine Tvs Raider Bajaj Pulsar

పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే, ఈ బైక్ 123.94 సిసి సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 10.63 PS పవర్, 11 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుండటంతో రైడింగ్ అనుభవం మరింత సాఫీగా ఉంటుంది. దాని మైలేజ్ కూడా ప్రత్యేక ఆకర్షణ. ఇది సగటున 55 కి.మీ వరకు ఇస్తుంది. ఇది మధ్యతరగతి ప్రజలు కోరుకునే ఆర్థిక ప్రయోజనం.

TVS Raider 125: టీవీఎస్ రైడర్ 125 గురించి చెప్పుకుంటే, ఇది యువత కోసం ప్రత్యేకంగా రూపొందించిన బైక్ అని చెప్పొచ్చు. అయినప్పటికి అన్ని వయస్సుల వారికి ఇది సరిగ్గా సూట్ అవుతుంది. బైక్ ధర రూ. 87,375 నుంచి రూ. 1.03 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండటం వలన, మధ్యతరగతి కుటుంబాలకు సులభంగా అందుబాటులో ఉంటుంది. డిజైన్ పరంగా చూస్తే ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

Middle Class Best Mileage bikes Honda Shine Tvs Raider Bajaj Pulsar Details

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, దీనిలో 124.8 సిసి సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 11.12 PS హార్స్‌పవర్, 11.2 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రైడింగ్‌ను స్మూత్‌గా, బలంగా చేసేలా దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ అమర్చబడింది. ముఖ్యంగా దీని మైలేజ్ సుమారు 67 కిలోమీటర్ల వరకు రావడం మధ్యతరగతి వినియోగదారులకు ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఇది 10 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కలిగి ఉంది.

Bajaj Pulsar 125: బజాజ్ పల్సర్ 125 ఇది యూత్ కోసం పవర్‌ఫుల్ లుక్, స్పోర్టీ స్టైలింగ్‌తో వస్తుంది. అదే సమయంలో ఇతర వయస్సుల వారిని కూడా బాగా అట్రాక్ట్ చేస్తుంది. రోడ్డు మీద చూసే వారికి ఒక ప్రత్యేకమైన ప్రెజెన్స్ ఇస్తుంది. ధర పరంగా చూస్తే ఇది మరింత అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం పల్సర్ 125 ధర రూ.85,178 నుంచి రూ.94,451 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

Middle Class Best Mileage bikes Honda Shine Tvs Raider Bajaj Pulsar

ఇంజిన్ పరంగా ఇది 124.4 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ జతచేయబడింది. ఈ ఇంజిన్ మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడమే కాకుండా, నగర రైడింగ్‌కి సరిపడా పవర్‌ను అందిస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, ఇది సగటున 51 కిలోమీటర్ల వరకు ఇస్తుంది. ఇంధన ట్యాంక్ సామర్థ్యం 11.5 లీటర్లు ఉండటంతో, లాంగ్ రైడ్‌లో కూడా ఇది సులభంగా ఉపయోగపడుతుంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 21, 2025, 9:38 [IST]
English summary
Middle class best mileage bikes honda shine tvs raider bajaj pulsar details
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+