65 కి.మీ మైలేజ్ బైకును కళ్లుమూసుకుని కొనచ్చు! జాబ్ చేసేవారికి దేవుడిచ్చిన వరం.. చీప్ అండ్ బెస్ట్

హోండా షైన్ 125 (Honda Shine 125) భారత మోటార్‌సైకిల్ మార్కెట్లో ఒక నమ్మకమైన పేరు. ఈ బైక్‌ను తొలిసారిగా 2006లో హోండా పరిచయం చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, రోజువారీ ప్రయాణాలు చేసే ఉద్యోగులు, మంచి మైలేజ్ కోరుకునే వినియోగదారుల మధ్య షైన్ 125 ప్రత్యేకమైన ఆదరణను సంపాదించుకుంది. సింపుల్ డిజైన్, తక్కువ నిర్వహణ ఖర్చులు, హోండా ఇంజిన్ నమ్మకం... ఇవన్నీ కలిసే ఈ బైక్‌ను ఇంత పాపులర్‌గా నిలబెట్టాయి. మీరు కొత్త మోటార్‌సైకిల్ కొనాలనుకుంటున్నట్లయితే, ఖర్చు ఎక్కువ కాకుండా, రోజూ నమ్మకంగా ఉపయోగించుకునే బైక్ కావాలంటే హోండా షైన్ 125 నిజంగా ఒక ఉత్తమ ఎంపికగా చెప్పుకోవచ్చు. ఇది ప్రధానంగా ప్రాక్టికల్ యూజ్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది.

నగరంలో ఆఫీస్‌కు వెళ్లడం కావొచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ పనుల కోసం ఉపయోగించడం కావొచ్చు అన్ని అవసరాలకు ఇది సూట్ అవుతుంది. ధర విషయానికి వస్తే, షైన్ 125 అన్ని వర్గాల వినియోగదారులకు అందుబాటులో ఉండేలా హోండా ధరను నిర్ణయించింది. ఎక్స్-షోరూమ్ ధర ప్రకారం, ఈ బైక్ కనిష్టంగా రూ. 80,542 నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో, టాప్ వేరియంట్ ధర రూ. 84,902 వరకు ఉంటుంది.

Middle Class Families Best Suitable Bike Honda Shine 125 Design Mileage And Features

ఈ ధర శ్రేణిలో హోండా బ్రాండ్, 125cc సెగ్మెంట్ ఇంజిన్, మంచి మైలేజ్ లభించడం పెద్ద ప్లస్ పాయింట్. ఇది డ్రమ్ బ్రేక్, డిస్క్ బ్రేక్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీంతో కస్టమర్ అవసరాలు, బడ్జెట్‌కు అనుగుణంగా వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. మొత్తం మీద, తక్కువ ధర, నమ్మకమైన పనితీరు, మంచి రీసేల్ విలువ వంటి అంశాలతో షైన్ 125 భారత మార్కెట్లో ఒక బెస్ట్ సెల్లింగ్ 125cc మోటార్‌సైకిల్‌గా కొనసాగుతోంది.

హోండా షైన్ 125 ధరకు తగిన విధంగా బలమైన, నమ్మకమైన పవర్‌ట్రెయిన్‌తో వస్తుంది. ఇందులో 123.94 సిసి సామర్థ్యం కలిగిన పెట్రోల్ ఇంజిన్‌ను హోండా అందించింది. ఈ ఇంజిన్ 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.63 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేయగలదు. అదే సమయంలో, 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 11 ఎన్ఎమ్‌ల టార్క్‌ను అందించడం వల్ల నగర ట్రాఫిక్‌లో సాఫీగా నడపడానికి, ఓవర్‌టేకింగ్ సమయంలో కూడా ఇబ్బంది లేకుండా పనితీరు చూపిస్తుంది.

Middle Class Families Best Suitable Bike Honda Shine 125 Design Mileage And Features

ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేయడం వల్ల గేర్ మార్పులు స్మూత్‌గా ఉండటమే కాకుండా, హైవే రైడింగ్‌లో కూడా మంచి స్థిరత్వం లభిస్తుంది. రోజువారీ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ట్యూన్ చేసిన ఈ ఇంజిన్ ఎక్కువ ఆర్‌పిఎమ్‌ల అవసరం లేకుండా సరైన పవర్‌ను అందిస్తుంది. నిర్వహణ ఖర్చుల విషయానికి వస్తే, హోండా షైన్ 125 తక్కువ మెయింటెనెన్స్‌తో ఎక్కువ కాలం నమ్మకంగా పనిచేసే బైక్‌గా పేరుగాంచింది.

రెగ్యులర్ సర్వీసింగ్ ఖర్చులు కూడా సాధారణంగానే ఉంటాయి. ఇంధన సామర్థ్యం విషయానికి వస్తే, రైడింగ్ స్టైల్, రోడ్డు పరిస్థితులపై ఆధారపడి ఈ బైక్ సాధారణంగా లీటర్‌కు 50 నుంచి 65 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. ఇందులో 10.5 లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాంక్‌ను ఇవ్వడం వల్ల, ఒకసారి ట్యాంక్ పూర్తిగా నింపితే సుమారు 525 నుంచి 630 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

Middle Class Families Best Suitable Bike Honda Shine 125 Design Mileage And Features

కొత్త హోండా షైన్ 125 ఇప్పుడు ఫీచర్ల పరంగా మరింత ఆధునికంగా మారింది. ఈ మోటార్‌సైకిల్‌లో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అందించారు. ఇందులో స్పీడ్, ఫ్యూయల్ లెవల్, ట్రిప్ మీటర్, గేర్ పొజిషన్ వంటి కీలక సమాచారం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది రోజువారీ రైడింగ్‌లో రైడర్‌కు మరింత సౌకర్యాన్ని అందిస్తుంది. భద్రత సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ ఫీచర్‌, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ను కూడా అందించారు.

More from DriveSpark

Article Published On: Tuesday, December 23, 2025, 11:24 [IST]
English summary
Middle class families best suitable bike honda shine 125 design mileage and features
Read more on: #honda motorcycle #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+