ఈ బైకును కళ్లుమూసుకుని కొనచ్చు! ఉద్యోగస్తులకు దేవుడిచ్చిన వరం.. చీప్ అండ్ బెస్ట్, లీటరుకు 65 కి.మీలు!

భారతదేశంలో పేద, మధ్యతరగతి కుటుంబాలు రోజువారి ప్రయాణాల్లో ఖర్చు తగ్గించుకోవడానికి చిన్న ఇంజిన్‌ విభాగంలో వచ్చే, అధిక మైలేజ్ ఇచ్చే టూవీలర్లునే ఎక్కువగా ఎంచుకుంటాయి. పెట్రోల్ ధరలు నిరంతరం పెరుగుతుండటంతో, రోజూ ఆఫీసు, స్కూల్, మార్కెట్, చిన్న చిన్న పనుల కోసం అధిక మైలేజ్ ఇచ్చే బైక్ తప్ప మిగతా ప్రత్యామ్నాయం కనిపించదు. అందుకే 100cc-110cc సెగ్మెంట్ ఇప్పటికీ దేశంలో టాప్ డిమాండ్ ఉన్న విభాగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, భారతీయ టూవీలర్ మార్కెట్లో హోండా షైన్ 100 (Honda Shine 100) తనకు ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. హోండా కంపెనీ ఇప్పటికే విశ్వసనీయత, తక్కువ నిర్వహణ ఖర్చులు, మైలేజ్ విషయంలో మంచి పేరొందింది. ఈ నమ్మకం ఆధారంగా భారతీయ వినియోగదారులు షైన్ 100 వైపు ఆకర్షితులవుతున్నారు.

హోండా షైన్ 100 ఎక్స్-షోరూమ్ ధర రూ.65,561, ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 80,000 వరకు ఉంటుంది. డిజైన్ విషయానికి వస్తే, సింపుల్‌గా, సొగసుగా, ఎంతో ప్రాక్టికల్‌గా రూపుదిద్దుకుంది. రోడ్డుపై చూసిన వెంటనే ఆకట్టుకునే హెడ్‌ల్యాంప్, క్లీనైన లైన్లు, ఫ్యూయల్ ట్యాంక్‌పై ఉన్న Honda బ్యాడ్జ్, అలాగే క్లాసిక్‌గా కనిపించే టెయిల్ లైట్ బైక్‌కు ఒక సంప్రదాయ హోండా స్టైల్‌ను ఇస్తాయి. నగరాలు, గ్రామాల్లో వారికి సూట్ అయ్యేలా ఉంటుంది.

Middle Class Peoples Best Mileage Bike Honda Shine 100 Price And All Details

ఇది ఆరెంజ్ విత్ బ్లాక్, గ్రీన్ విత్ బ్లాక్, గ్రే విత్ బ్లాక్, బ్లూ విత్ బ్లాక్, రెడ్ విత్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ఇది 98.98cc ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. చిన్నదే అయినా, రోజువారీ ప్రయాణాల కోసం సరిపడే శక్తిని ఇస్తుంది. ఈ ఇంజన్ 7.38 bhp పవర్ (7500 RPM వద్ద), 8.05 Nm టార్క్ (5000 RPM వద్ద) ఉత్పత్తి చేస్తుంది.

అదే కాకుండా 4-స్పీడ్ గేర్‌బాక్స్ ఇస్తారు, ఇది నగర రోడ్లలో, చిన్న చిన్న ట్రిప్‌లలో చాలా సౌకర్యంగా ఉంటుంది. కొత్త Honda Shine 100 మోటార్‌సైకిల్ అద్భుతమైన మైలేజ్ సామర్థ్యంతో వచ్చింది. కంపెనీ ప్రకారం, ఇది లీటరుకు సుమారు 65 కి.మీ మైలేజ్ ఇస్తుంది. 9 లీటర్ల ఇంధన ట్యాంక్ కారణంగా, ఒక్కసారి పూర్తిగా నింపితే ఈ బైక్ దాదాపు 585 కి.మీ వరకు దూసుకెళ్తుంది.

Middle Class Peoples Best Mileage Bike Honda Shine 100 Price And All Details

అంటే సాధారణ ప్రయాణాలు చేసే వారికి 2 నుంచి 3 వారాల పాటు పెట్రోల్ ఖర్చు లేకుండా సులభంగా నడపవచ్చు. తక్కువ మెయింటెనెన్స్, అధిక మైలేజ్ అనే రెండు ప్రధాన కారణాల వల్ల హోండా షైన్ 100 ఇప్పటికే బడ్జెట్ బైక్ మార్కెట్లో ప్రజలు ఎక్కువగా చూసే మోడల్‌గా మారుతోంది. భద్రత పరంగా, ఇది ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక డ్యూయల్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ సెటప్‌ను అందిస్తుంది.

బ్రేకింగ్ కోసం CBS (కాంబి-బ్రేక్ సిస్టమ్) తో కూడిన డ్రమ్ బ్రేక్‌లు లభిస్తాయి. ఇవి అత్యవసర పరిస్థితుల్లో రైడర్‌కు అదనపు నియంత్రణను అందించి, సురక్షిత డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తాయి. దీనిలో రైడర్‌కు అవసరమైన అనేక ప్రాక్టికల్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ట్విన్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ సెన్సార్, సౌకర్యవంతమైన సింగిల్-పీస్ సీటు లాంటివి ఉన్నాయి.

Middle Class Peoples Best Mileage Bike Honda Shine 100 Price And All Details

బైక్‌కు మంచి చక్రాలు, టైర్లు అమర్చారు, రైడింగ్‌లో స్థిరత్వాన్ని అందిస్తాయి. సీటు ఎత్తు 786 మిమీ ఉండటంతో కాస్త హైట్ తక్కువ ఉన్న రైడర్‌లకు సులభంగా అనిపిస్తుంది. పనితీరులో, Shine 100 గరిష్టంగా గంటకు 85 కి.మీ వేగాన్ని చేరుకుంటుంది. అదేవిధంగా, 0 నుండి 60 కి.మీ/గం వేగానికి కేవలం 7.82 సెకన్లలో చేరడం దీని రిఫైన్డ్ ఇంజిన్ పనితీరును చూపిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 2, 2025, 15:03 [IST]
English summary
Middle class peoples best mileage bike honda shine 100 price and all details
Read more on: #honda motorcycle #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+