నెలకు రూ.3 వేలతో 90Km మైలేజ్ ఇచ్చే బైక్ సొంతం.. ఆఫీసు వెళ్లేవారికి బెస్ట్.. EMI వివరాలు ఇవే
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పండుగల సీజన్ మొదలైంది. దసరా, దీపావళి వంటి సందర్భాల్లో కొత్త వాహనం కొనే ఉత్సాహం ప్రజల్లో కనిపిస్తుంది. చాలామంది ఈ పండుగ కాలాన్ని శుభారంభంగా భావించి, కొత్త బైక్ లేదా కారును కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు. ముఖ్యంగా బైకులు, రోజువారీ అవసరాలకు, ఉద్యోగానికి వెళ్లడానికి, షాపింగ్‌కి, కుటుంబ అవసరాలకు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. అందుకే, తక్కువ ధరలో మంచి మైలేజ్, నమ్మకమైన పనితీరు అందించే బైకులకు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుంది. ఇలాంటి బైకుల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది బజాజ్ ప్లాటినా (Bajaj Platina). ఇది సాధారణ ప్రజల మనసుల్లో విశ్వసనీయమైన పేరు. 2006లో మార్కెట్‌లోకి వచ్చిన ఈ బైక్ ఇప్పటికి దాదాపు రెండు దశాబ్దాలు పూర్తయ్యేలోపే, తన స్థిరమైన స్థానాన్ని నిలబెట్టుకుంది.
మార్కెట్లో కొత్త మోడళ్లు వరుసగా వస్తున్నా, ప్లాటినాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. చాలా సింపుల్, సులభంగా అందుబాటులో ఉండే ధరలో దొరుకుతుంది, దానిపై ఖర్చు చేసిన ప్రతి రూపాయికి రెండింతల విలువ అందిస్తుంది. ప్లాటినా బైక్ అంటే పేద, మధ్యతరగతి ప్రజలకు సరిగ్గా సరిపోయే ఆప్షన్. ఉద్యోగానికి వెళ్లే సాధారణ ఉద్యోగి అయినా, కాలేజీకి వెళ్లే విద్యార్థి అయినా, లేదా రోజువారీ చిన్న వ్యాపారం చూసుకునే వారికి బెస్ట్.

బజాజ్ ప్లాటినా బైక్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు ధర, EMI వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం మార్కెట్లో ఇది ES Drum వేరియంట్‌లో అందుబాటులో ఉంది, ఇది రోజువారీ ప్రయాణానికి సరిగ్గా సరిపోయే ఆప్షన్‌గా నిలుస్తోంది. దీని ఆన్‌రోడ్ ధర సుమారు రూ. 81,450 వరకు ఉంటుంది. తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇవ్వగలగడం వలన ఈ బైక్‌కు సాధారణ ప్రజల్లో మంచి డిమాండ్ ఉంది.
ఎవరైనా ఈ బైక్‌ను EMI ఆప్షన్ ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే, ముందుగా రూ. 20,000 వరకు డౌన్ పేమెంట్ చెల్లించినట్లయితే, తర్వాత మిగిలిన మొత్తం సుమారు రూ. 61,450 అవుతుంది. ఈ మొత్తం మీద బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు సాధారణంగా 10 శాతం వడ్డీ రేటుతో రుణాన్ని అందిస్తున్నాయి. రుణ రేటు అనేది, మార్కెట్ పరిస్థితులను బట్టి మారుతుంది. మేము ఈ కథనంలో 10 శాతం ఆధారంగా వివరిస్తున్నాం.

ఈ లెక్క ప్రకారం, మీరు 2 సంవత్సరాల(24 నెలల) కాలానికి రుణం తీసుకుంటే, ప్రతి నెలా సగటున రూ.3,000 చొప్పున EMI చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్క బ్యాంకు, వడ్డీ రేటు, రుణ ప్రాసెసింగ్ ఛార్జీలపై ఆధారపడి ఉంటుంది. పెద్ద మొత్తంలో క్యాష్ చెల్లించకుండా కూడా ప్లాటినా బైక్‌ను సులభంగా EMIల ద్వారా కొనుగోలు చేయవచ్చు. తక్కువ డౌన్ పేమెంట్‌తో ఈ బైక్ మధ్యతరగతి ప్రజలకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
ఈ బైక్ గురించిన ఇతర వివరాలను చూసినట్లయితే, పెట్రోల్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది లీటరుకు సగటున 70 నుండి 90 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుంది. ప్లాటినా 100లో 102 సీసీ సామర్థ్యం గల 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ DTS-i ఇంజిన్ అమర్చారు. దీని 11 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌ను ఫుల్ చేస్తే, 700 నుండి 800 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు.

ప్లాటినా డిజైన్ విషయానికి వస్తే, ముందుభాగంలో హాలోజన్ హెడ్‌లైట్, LED డే టైమ్ రన్నింగ్ లైట్లు రాత్రివేళల్లో స్పష్టమైన లైటింగ్ ఇస్తాయి. దీనిలో USB ఛార్జింగ్ పోర్ట్ ప్లాటినాలో ఉంది. దీని ద్వారా రైడింగ్‌లో మొబైల్ ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో, మంచి కంఫర్ట్, సింపుల్ డిజైన్‌తో పాటు బలమైన ఇంజిన్ కలిగి ఉండటం వలన ఈ బైక్ రోజువారీ వినియోగదారులకు అత్యంత అనువైనది.


Click it and Unblock the Notifications








