ఫుల్ ట్యాంకుతో ఏకంగా 600కి.మీ.. మైలేజీలో కింగ్ అనిపించుకున్న స్ప్లెండర్ ప్లస్

హీరో స్ప్లెండర్ ప్లస్(Hero Splendor Plus) బైక్ అంటే మన దేశంలో తెలియని వారు ఉండరు. ముఖ్యంగా మైలేజ్‌లో మెయింటెనెన్స్ ఖర్చులతో సామాన్యులకు ఇది ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటిది. 2025లో వచ్చిన కొత్త అప్‌డేట్‌లతో ఈ బైక్ ఇప్పుడు మరింత స్మార్ట్‌గా మారింది. అయితే, ఒక ఫుల్ ట్యాంక్‌తో ఈ బైక్ ఎంత దూరం వెళ్తుంది? దాని లేటెస్ట్ ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ నిజంగానే రోడ్లపై తన సత్తా చూపిస్తుందని చెప్పవచ్చు. ఈ బైక్ లీటర్‌కు 65 కిలోమీటర్ల మైలేజీని సగటున ఇస్తుంది. స్ప్లెండర్ ప్లస్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 9.8 లీటర్లు కాబట్టి, ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే దాదాపు 590కిలోమీటర్ల దూరం సులభంగా ప్రయాణించవచ్చు. అంటే సుమారు రూ.1000పెట్రోల్ కొట్టిస్తే 590కిలో మీటర్లు ప్రయాణించవచ్చు. ఇది రోడ్ పరిస్థితులు, డ్రైవింగ్ స్టైల్ బట్టి కొద్దిగా మారవచ్చు.

Hero Splendor Plus

హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) తమ బెస్ట్ సెల్లింగ్ మోటార్‌సైకిల్ అయిన హీరో స్ప్లెండర్ ప్లస్‌ను లేటెస్ట్ OBD2B (On-Board Diagnostics 2nd Stage) నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేసింది. ఈ OBD2B నిబంధనలు భారత్ స్టేజ్ VI (BS6) ఫేజ్ 2 ఎమిషన్ నిబంధనలలో భాగం. 2025 ఏప్రిల్ 1న లేదా ఆ తర్వాత తయారైన వెహికల్స్ ఈ ఆన్-బోర్డ్ డయాగ్నస్టిక్ స్టాండర్డ్‌లను పాటించాల్సి ఉంటుంది.

సెకండ్ జనరేషన్ ఆన్‌బోర్డ్ డయాగ్నస్టిక్ డివైస్ వల్ల బైక్ ఎమిషన్స్‌ను రెగ్యులర్‎గా పర్యవేక్షించవచ్చు. ఇంధన సరఫరాలో లోపాలు లేదా అసాధారణ ఉద్గారాలు వంటి సమస్యలను ఇది గుర్తించగలదు. అంతేకాకుండా, పెద్ద సమస్యలుగా మారకముందే రైడర్‌కు నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది. ఈ లేటెస్ట్ నిబంధనలను పాటించే మోటార్‌సైకిళ్ల ధరలు కాస్త పెరిగాయి.

Hero Splendor Plus

మెకానికల్‌గా చూస్తే, హీరో స్ప్లెండర్ అదే 97.2 సీసీ, సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 8000 ఆర్‌పిఎమ్ (RPM) వద్ద 7.9 బీహెచ్‌పి (బ్రేక్ హార్స్‌పవర్), 6000 ఆర్‌పిఎమ్ వద్ద 8.05 ఎన్‌ఎమ్ (న్యూటన్ మీటర్) పీక్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే, మైలేజీ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ఇంజిన్ పవర్ ఎప్పటిలాగే స్ట్రాంగ్‌గా ఉందని చెప్పొచ్చు.

హీరో స్ప్లెండర్ ప్రస్తుతం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి స్ప్లెండర్+ (Splendor+), స్ప్లెండర్+ ఎక్స్ టెక్ (Splendor+ XTec), స్ప్లెండర్+ ఎక్స్ టెక్ 2.0 (Splendor+ XTec 2.0)లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ అయిన స్ప్లెండర్+ అనేది ఎలాంటి హంగులు లేకుండా ఒక సాధారణ కమ్యూటర్ మోటార్‌సైకిల్. స్ప్లెండర్+ ఎక్స్ టెక్ వెర్షన్ మాత్రం ముందు వైపు డిస్క్ బ్రేక్ ఆప్షన్‌తో కూడా వస్తుంది.

Hero Splendor Plus

ఇక టాప్-ఎండ్ వేరియంట్ అయిన ఎక్స్ టెక్ 2.0లో LED హెడ్‌లైట్ , బ్లూటూత్ కనెక్ట్ అయ్యే ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కానీ ఇందులో ముందు డిస్క్ బ్రేక్ ఆప్షన్ లేదు. ఈ లేటెస్ట్ రెగ్యులేషన్స్‌కు తగ్గట్టుగా అన్ని స్ప్లెండర్ వేరియంట్ల ధరలు రూ. 1,750 పెరిగాయి.

హీరో స్ప్లెండర్+ డ్రమ్ బ్రేక్ OBD2B అప్‌డేట్‌తో ధర రూ. 78,926 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. స్ప్లెండర్+ i3S OBD2B అప్‌డేట్‌తో ధర రూ. 80,176 (ఎక్స్-షోరూమ్). టాప్-ఎండ్ స్ప్లెండర్+ ఎక్స్ టెక్ ధర కూడా రూ. 1,750 పెరిగి ఇప్పుడు రూ. 85,501 (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: హీరో స్ప్లెండర్ ప్లస్ ఎప్పటిలాగే మంచి మైలేజ్ ఇచ్చే బైక్‌గా కొనసాగుతుంది. లేటెస్ట్ OBD2B అప్‌డేట్‌లతో ఇది మరింత స్మార్ట్‌గా, పర్యావరణ హితంగా మారింది. ధర కొద్దిగా పెరిగినా, అందిస్తున్న ఫీచర్లు, విశ్వసనీయతకు ఇది మంచి వ్యాల్యూను అందిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు, తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణాలకు ఇది ఎప్పటికీ ఒక బెస్ట్ ఆప్షన్.

More from DriveSpark

Article Published On: Monday, June 2, 2025, 13:15 [IST]
English summary
Mileage king returns hero splendor plus offers up to 686 kms on full tank
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+