మదర్స్ డే స్పెషల్: అమ్మకు ప్రేమతో ఓ స్కూటర్ గిఫ్ట్ ఇచ్చేయండి.. తక్కువ ధరలో ఇవే బెస్ట్ ఆప్షన్లు

ప్రతి మనిషి జీవితంలో తల్లి స్థానం అమూల్యం. అమ్మ అనగానే గుర్తొచ్చేది ఆమె ప్రేమ, త్యాగం, ఎన్నటికీ మారని ఆదరణ. కాలం మారుతోంది, అభిరుచులు మారుతున్నాయి, కానీ తల్లి చూపే ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు. ఈ విశిష్టతను గుర్తు చేసుకుంటూ, మాతృ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం ఎంతో ఆనందంగా జరుపుకుంటాం. ఈ ఏడాది మదర్స్ డే మే 11న వస్తోంది. మీరు ఆ రోజున మీ అమ్మకి జీవితంలో మరపురాని సర్‌ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నారా? అయితే, ఒక స్మార్ట్, స్టైలిష్, సౌకర్యవంతమైన స్కూటర్ కంటే మంచి బహుమతి ఇంకేమీ ఉండదు. ఈ సందర్భానికి అనుకూలంగా, మార్కెట్లోని కొన్ని ప్రముఖ స్కూటర్ మోడల్స్‌ను ఎంపిక చేసుకుని మీ అమ్మకు గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు.

ప్రస్తుతం దేశీయంగా తేలికైన బాడీ, మంచి మైలేజ్ కావాలనుకునే వారికి హీరో ప్లెజర్ ప్లస్ మంచి ఆప్షన్‌గా ఉంది. యువతలో ఫేమస్ అయినటువంటి టీవీఎస్ జెస్ట్ 110 కూడా మీ అమ్మగారికి బహుమతిగా ఇవ్వచ్చు. మరో మోడల్ హీరో డెస్టినీ 125, మెరుగైన ఫీచర్లు, సీటింగ్ స్పేస్ అందిస్తుంది. హోండా యాక్టివా-ఇ, ఏథర్ రిట్జా వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో ఆకట్టకుంటాయి. వాటి గురించి కింద చూడండి.

Mothers Day Gift

TVS Zest 110: ఈ స్కూటర్, మీ తల్లికి ఇవ్వగలిగే బహుమతుల్లో ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. ఈ స్కూటర్‌లో 109.7 సీసీ సామర్థ్యంతో కూడిన పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. టీవీఎస్ జెస్ట్ 110 సుమారు 45 కిలోమీటర్ల మైలేజీని ఒక్క లీటర్ పెట్రోల్‌తో అందించగలదు, దాంతో పాటు దాని ఎఫ్‌ఫిషియన్సీ కూడా మెచ్చతగ్గది. ఇది బడ్జెట్‌కు అనుకూలంగా రూ. 75,000 నుంచి రూ. 77,000 మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.

Hero Pleasure+ XTEC: ఈ స్కూటర్ తల్లుల కోసం చక్కని బహుమతిగా నిలుస్తుంది. ప్రత్యేకంగా మహిళలను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేయబడింది. మీరు ఈ మదర్స్ డే సందర్భంగా మీ అమ్మకు బహుమతిగా ఇవ్వడానికి బెస్ట్ ఎంపిక. దీని ధర రూ.72,000 నుండి రూ. 84,000 వరకు (ఎక్స్-షోరూమ్). ఇందులో 110.9 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది మెరుగైన పరఫార్మెన్స్‌తో పాటు సుమారు 50 కిలోమీటర్ల మైలేజీని అందించగలదు.

Mothers Day Hero Destiny 125

Hero destiny 125: ఇది ఈ మదర్స్ డేను ప్రత్యేకంగా మార్చేందుకు సరైన ఎంపికగా చెప్పుకోవచ్చు. రూ. 82,000 నుండి రూ. 93,000 వరకు ఎక్స్-షోరూమ్ ధరతో లభించే డెస్టిని 125 నగర ప్రయాణాలకు సరిపడే విధంగా దాదాపు 59 కిలోమీటర్ల మైలేజీని అందించగలదు. దీనిలో 124.6 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది క్లాసిక్ అయినప్పటికీ కాస్త మోడర్న్ టచ్‌ను కలిగించి ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Honda Activa e: హోండా యాక్టివా ఇ మీ తల్లికి బహుమతిగా ఇచ్చేందుకు అత్యుత్తమమైన ఎలక్ట్రిక్ స్కూటర్. దాని ధర రూ. 1.17 లక్షల నుంచి రూ. 1.52 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌లతో లభ్యమవుతుంది. 1.5 కిలోవాట్ల సామర్థ్యంతో పూర్తిగా ఛార్జ్ చేసినపుడు ఈ స్కూటర్ సుమారు 102 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది. రోజూ చిన్న ప్రయాణాల కోసం ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

Mothers Day Gift Activa E

Ather Rizta: ఇది లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా గుర్తింపు పొందింది. దీని ధర రూ. 1.11 లక్షల నుండి రూ. 1.52 లక్షల వరకు ఉంటుంది (ఎక్స్-షోరూమ్). ఇందులో 2.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఫుల్ ఛార్జ్‌పై ఇది సుమారు 123 కిలోమీటర్ల ప్రయాణాన్ని అందిస్తుంది, అంటే తల్లులు రోజువారీ అవసరాల కోసం పదే పదే చార్జింగ్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు.

More from DriveSpark

Article Published On: Saturday, May 10, 2025, 9:46 [IST]
English summary
Mothers day top 5 best scooters for gift your mother activa e zest 110 etc
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+