మార్కెట్‌ను షేక్ చేయబోతున్న మాన్ స్టర్..750 సీసీ పవర్‌తో రోడ్డుమీద పోతుంటే పక్క వాళ్లు ఎగిరిపోవాల్సిందే

రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Motoverse 2025 ఈవెంట్ గోవాలోని వాగేటర్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో కంపెనీ తమ కొత్త Continental GT 750 రేస్ బైక్ ప్రోటోటైప్‌ను ప్రదర్శించింది. ఇటలీలో జరిగిన EICMA 2025లో అంతర్జాతీయంగా పరిచయం అయిన తర్వాత, మన దేశంలోకి ఈ కొత్త మోడల్ రావడం ఇదే మొదటిసారి.

ఇది కేవలం షోకేస్ మాత్రమే కాదు, ఎన్‌ఫీల్డ్ నుంచి త్వరలో రాబోయే 750cc ప్లాట్‌ఫామ్‌కు ఇది ఒక ట్రెయిలర్‌గా నిలుస్తోంది. వచ్చే ఏడాది రేసింగ్ సీజన్‌లో ప్రస్తుత GT 650 రేస్ మోడల్‌ స్థానంలో ఈ 750cc బైక్ రేసింగ్ ట్రాక్‌పైకి వస్తుంది. ఈ జీటీ 750.. రాయల్ ఎన్‌ఫీల్డ్ రాబోయే 750 సీసీ ప్లాట్‌ఫారమ్‌ను పరిచయం చేస్తోంది. వచ్చే ఏడాది రేసింగ్ సీజన్‌లో ప్రస్తుత జీటీ 650 రేస్ మోడల్‌ను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Motoverse 2025 Royal Enfield Continental GT 750 Race Bike Prototype Showcased in Goa

పాత రేసర్.. కొత్త లుక్
రాయల్ ఎన్‌ఫీల్డ్ GT 750 రేస్ ప్రోటోటైప్ పూర్తిగా రెట్రో-రేసర్ స్టైల్‌లో కనిపిస్తోంది. దీనికి చిన్న బికీని ఫెయిరింగ్, పొట్టిగా ఉండే క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్లు, వెనుకకు అమర్చిన ఫుట్-పెగ్స్, షార్ట్ చేసిన సబ్-ఫ్రేమ్ ఇచ్చారు. దీంతో బైక్ చాలా కాంపాక్ట్‌గా, చురుగ్గా కనిపిస్తుంది. వెనుక వైపు ఉన్న ట్విన్-బార్ LED లైట్, సైడ్‌కి అమర్చిన రేస్ నంబర్ ప్లేట్లు ఇది రేసింగ్ కోసమే రూపొందించిన బైక్ అని స్పష్టం చేస్తున్నాయి.

ఛాసిస్, బ్రేక్స్, సస్పెన్షన్ అప్‌గ్రేడ్
ఈ GT 750 రేస్ ప్రోటోటైప్‌లో కొత్తగా డిజైన్ చేసిన ఛాసిస్, మెరుగైన స్టీరింగ్ అసెంబ్లీ ఉన్నాయి. రేసింగ్‌కు అనుగుణంగా తయారు చేసిన షోవా-స్పెక్ సస్పెన్షన్ కాంపోనెంట్స్ ఇందులో వాడారు. ముందు భాగంలో స్ట్రాంగ్ టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో ట్విన్-షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే దీని పవర్ ఫుల్ స్పీడ్‌కు తగ్గట్టుగా ట్విన్ ఫ్రంట్ డిస్క్‌లు, హై-పెర్ఫార్మెన్స్ కాలిపర్‌లతో కూడిన అప్‌గ్రేడెడ్ బ్రేకింగ్ హార్డ్‌వేర్‌ను అమర్చారు.

Motoverse 2025 Royal Enfield Continental GT 750 Race Bike Prototype Showcased in Goa

ఇంజన్ పవర్
ఈ బైక్‌లో సరికొత్త 750cc ప్యారలల్-ట్విన్ ఇంజన్ ఉంటుంది. ఇది ప్రస్తుతం ఉన్న 648cc ఇంజన్ కంటే మరింత పవర్ఫుల్.అంచనాల ప్రకారం, రేస్-స్పెక్ లేఅవుట్‌లో ఈ ఇంజన్ సుమారు 54-55 bhp పవర్, 65 Nm పీక్ టార్క్ను ఉత్పత్తి చేయగలదు. ప్రస్తుత GT 650 మోడల్ కేవలం 47 bhp పవర్, 52 Nm టార్క్ మాత్రమే ఇస్తుంది. దీనితో పోలిస్తే కొత్త GT 750 చాలా ఎక్కువ శక్తివంతమైనది.ఇందులో కూడా స్లిప్పర్-క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్ కొనసాగే అవకాశం ఉంది.

ఉత్పత్తి వెర్షన్, ధర అంచనా
ప్రస్తుతం ప్రదర్శించినది కేవలం రేస్ బైక్ అయినప్పటికీ, భవిష్యత్తులో మార్కెట్‌లోకి రాబోయే ఉత్పత్తి వెర్షన్ ఎలా ఉంటుందో ఇది సూచిస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT 750 ఉత్పత్తి మోడల్ 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Motoverse 2025 Royal Enfield Continental GT 750 Race Bike Prototype Showcased in Goa

దీని ఎక్స్‌షోరూమ్ ధర సుమారు రూ.4 లక్షల దగ్గర ఉండే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం ఉన్న GT 650 కంటే ఇది కొద్దిగా ఎక్కువ ధరకే లభిస్తుంది. డ్యూయల్-డిస్క్ బ్రేక్‌లు, మెరుగైన హార్డ్‌వేర్‌ను చూస్తుంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు హై-పెర్ఫార్మెన్స్ బైక్‌ల వైపు అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది.

More from DriveSpark

Article Published On: Sunday, November 23, 2025, 9:26 [IST]
English summary
Motoverse 2025 royal enfield continental gt 750 race bike prototype showcased in goa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+