రోజూ ఆఫీస్‌కి వెళ్లాలా? పెట్రోల్ ఖర్చుతో విసిగిపోయారా? బడ్జెట్‌లో బెస్ట్ మైలేజ్ బైక్స్ ఇవే!
ప్రతి రోజూ ఆఫీస్ పనుల కోసం వెళ్లే వారికి మోటార్ సైకిళ్లు చాలా అవసరం. అయితే, చాలా మందికి ఏ బైక్ తీసుకుంటే మంచిది? అది ఎక్కువ కాలం మన్నుతుందా? తక్కువ ధరలో దొరుకుతుందా? ఎక్కువ మైలేజీ అందిస్తుందా అన్న సందేహాలు ఉంటాయి. ఇక్కడ రోజువారీ అవసరాల కోసం ఉపయోగించడానికి బాగా సరిపోయే, ఎక్కువ మైలేజీ ఇచ్చే 7 ముఖ్యమైన మోటార్ సైకిళ్ల ధర, స్పెషాలిటీ గురించి వివరంగా తెలుసుకుందాం.
మొదటగా బజాజ్ సిటీ 110ఎక్స్ (Bajaj CT 110X) గురించి మాట్లాడుకుందాం. ఇలా చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉంది. పేద, మధ్య తరగతి కస్టమర్లు సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఈ మోటార్‌సైకిల్ ధర రూ.70,000 (ఎక్స్-షోరూమ్). ఇది 115.45 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 70 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.

బజాజ్ ప్లాటినా 110 (Bajaj Platina 110) కూడా బాగా పాపులారిటీ పొందిన మోటార్‌సైకిల్. ఇది కూడా చాలా తక్కువ ధరలో లభిస్తుంది. దీని ధర రూ.71,000 నుంచి రూ.74,000 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ ధర ప్రకారం మంచి పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌ను కలిగి ఉంది. 115.45 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో 70 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.
హీరో ప్యాషన్ ప్లస్ (Hero Passion Plus) గురించి చెప్పాలంటే.. దీని ధర రూ.79,000 నుంచి రూ. 81,000 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 97.2 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 70 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. డిజిటల్ అనలాగ్ క్లస్టర్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ (Hero Xtreme 125R) మోటార్‌సైకిల్ గురించి తెలుసుకుంటే, ఈ బైక్ ధర రూ.98,000 నుంచి రూ.1.06 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 124.7 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 66 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. రైడర్ల సేఫ్టీ కోసం డిస్క్ బ్రేక్ ఆప్షన్‌ను కలిగి ఉంది.
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 (Bajaj Pulsar NS 125) కూడా బాగా పేరు పొందిన బైక్. దీని ధర రూ.1.12 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 124.45 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 64.75 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.

హోండా ఎస్‌పి 125 (Honda SP 125) మోటార్‌సైకిల్ గురించి మాట్లాడితే.. ఇది కూడా తక్కువ ధరలో అందుబాటులో ఉంది. దీని ధర రూ.89,000 నుంచి రూ. 99,999 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 123.94 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌ను కలిగి ఉంది. 60 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.
చివరగా హోండా షైన్ 100 (Honda Shine 100) బైక్ గురించి చెప్పాలంటే.. ఈ మోటార్‌సైకిల్ ధర రూ.68,600 నుంచి రూ.70,521 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 98.98 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 55 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ట్విన్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








