దేశంలో అందరి ఫేవరెట్ కొత్త స్ప్లెండర్ ప్లస్ వచ్చేస్తోంది! లేటెస్ట్ అవతారంలో 4 కోట్ల హృదయాలను గెలిచిన మోడల్
దేశీయ దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ హీరో(Hero) భారతీయ పేద, మధ్య తరగతి వినియోగదారుల కోసం అందుబాటు ధరలో, అధిక మైలేజ్ ఇచ్చే మోడళ్లను విడుదల చేస్తుంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన బైక్స్‌కు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా స్ప్లెండర్ ప్లస్ (splendor plus) కోట్లాది మంది హృదయాల్లో చోటు సంపాదించుకున్న ఒక నమ్మకమైన బైక్. ప్రపంచంలోనే నంబర్ 1 మోటార్ సైకిల్‌గా ఇది ఖ్యాతి గడించింది. సాధారణంగా మార్కెట్లో ఎన్నో మోడల్స్ వచ్చి పోతూ ఉంటాయి. కానీ స్ప్లెండర్ మాత్రం దశాబ్దాలుగా తన స్థానం నిలబెట్టుకుంది. ఇప్పటి వరకు 4 కోట్లకు పైగా స్ప్లెండర్ ప్లస్ యూనిట్లు అమ్ముడవడం అంటేనే, ఈ బైక్‌పై ప్రజల ప్రేమ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
కంపెనీ ఎప్పటికప్పుడు వినియోగదారుల ఇష్టాలకు అనుగుణంగా ట్రెండ్‌ను బట్టి అప్‌డేట్ చేస్తూ తీసుకురావడం వల్లే ఇన్ని కోట్ల అమ్మకాలను చేరడానికి వీలైంది. ఈ క్రమంలో హీరో తన ప్రసిద్ధ బైక్‌ను కొత్తగా అప్‌డేట్ చేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. తాజాగా, 2025 సంవత్సరం కోసం రూపొందించిన కొత్త స్ప్లెండర్ ప్లస్ మోడల్ టెస్ట్ రైడ్‌లో కనిపించింది. దీనికి సంబంధించిన స్పై ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి.

ఈ కొత్త వెర్షన్ ద్వారా హీరో మోటోకార్ప్ తన ప్రసిద్ధ మోడల్‌తో మార్కెట్లో సంచలన అమ్మకాలను సాధించాలని చూస్తుంది. బయటకు వచ్చిన ఫోటోలను చూస్తే, డిజైన్‌లో కొన్ని మార్పులు, ఫీచర్లలో కొన్ని కొత్త అంశాలు కనిపిస్తున్నాయి. ఈ మోడల్ మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎన్నో విధాలుగా అప్‌డేట్ అవుతూ వచ్చినప్పటికి భారతీయ పేద, మధ్య తరగతి కుటుంబ వినియోగదారుల నుంచి ఆదరణ లభిస్తూనే ఉంది.
2025 కొత్త స్ప్లెండర్ ప్లస్ కూడా అమ్మకాల పరంగా మెరుగైన గణాంకాలను నమోదు చేస్తుందని కంపెనీ భావిస్తోంది. కొద్ది మార్పులు ఉన్నప్పటికి దీని డిజైన్ మాత్రం మొత్తంగా ప్రస్తుత స్ప్లెండర్ మోడల్‌ని పోలి ఉంటుందని తెలుస్తుంది. సైడ్ ప్యానెల్స్‌పై ఉన్న గ్రాఫిక్స్‌లో కంపెనీ కొద్ది మార్పులు చేసింది. హార్డ్‌వేర్‌లో ఎలాంటి కొత్త మార్పులు కనిపించడం లేదు. ఇది ట్యూబులర్ డబుల్ క్రెడిల్ ఫ్రేమ్‌తో ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్ ఉన్నాయి.

వెనుక 5-స్టెప్ అడ్జస్టబుల్ డ్యూయల్-షాక్ అబ్జార్వర్ సస్పెన్షన్ అందించారు. ఈ బైకుకు 80/100 ట్యూబ్‌లెస్ టైర్లు, 18-అంగుళాల చక్రాలను అమర్చారు. రైడింగ్ సమయంలో రైడర్లకు మెరుగైన కంట్రోలింగ్ ఇవ్వడానికి ముందు, వెనుక 130 mm డ్రమ్ బ్రేక్‌లను ఏర్పాటు చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే, మరింత ఎక్కువగా కనీసం 165 మిమీగా ఉంటుంది. ప్రస్తుత మోడల్ లాగానే అదే 97.2cc, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది.
మరో కీలక విషయం ఏమిటంటే, ఇంజిన్‌ను OBD-2B ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ చేశారు. కాబట్టి దీని నుంచి తక్కువ మొత్తంలో కాలుష్య కారకాల ఉద్గారాలు విడుదలవుతాయి. ఇది పర్యావరణానికి మేలు కలిగించే అంశం అని చెప్పవచ్చు. కార్బన్ ఉద్గారాల సమస్య వచ్చినట్లయితే వెంటనే రైడర్‌ను అలర్ట్ చేయడానికి ఇది వీలవుతుంది. ఇక ప్రస్తుతం మోడల్ గురించి చూసినట్లయితే 8.02 PS హార్స్‌పవర్, 8.05 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న మోడల్ ప్రారంభ ధర రూ. 77,176 నుంచి మొదలుకుని టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 79,926 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఆన్‌రోడ్ అయితే మరింత స్వల్పంగా ఎక్కువగా ఉంటుంది. ఇది వినియోగదారులకు బ్లాక్ గ్రే స్ట్రైప్, స్పోర్ట్స్ రెడ్ బ్లాక్, ఫోర్స్ సిల్వర్, బ్లూ బ్లాక్, బ్లాక్ రెడ్ పర్పుల్ వంటి ఆకర్షణీయమైన కలర్స్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








