2025 డియో 125 వచ్చేసింది! స్టైలిష్ లుక్, స్మార్ట్ ఫీచర్స్‌తో అదరగొట్టింది

ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హోండా తన డియో స్కూటర్‌ను 2025కి మరింత ఆకర్షణీయంగా అప్‌డేట్ చేసి విడుదల చేసింది. ఈసారి డియో 125, యువతను ఆకట్టుకునేలా పూర్తి కొత్తగా, లేటెస్ట్ ఫీచర్లతో, ఇంకా మెరుగైన మైలేజీతో మార్కెట్లో అడుగుపెట్టింది. స్పోర్టీ లుక్స్‌ను ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఎంపిక అవుతుంది. ఇది నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు, స్టైలిష్‌గా ఉండాలనుకునే వారికి బాగా సెట్ అవుతుంది. ఈ మోడల్ రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది. DLX మోడల్‌క ఎక్స్-షోరూమ్ ధర రూ. 96,749 కాగా, H-స్మార్ట్ మోడల్ ధర రూ.1,02,144గా నిర్ణయించారు. ఈ రెండు వేరియంట్లూ యూనిక్ ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీ, స్టైలిష్ డిజైన్‌లతో కొత్త తరాన్ని ఆకట్టుకునేలా రూపొందించబడ్డాయి.

దీని డిజైన్ విషయానికి వస్తే, స్పోర్టీ హెడ్‌లాంప్, కొత్త గ్రాఫిక్స్, అప్‌డేటెడ్ బాడీ లైన్స్ ఉన్నాయి. ఫీచర్లలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ కీ సిస్టమ్, బెటర్ ఇంజిన్ పనితీరు ఉండడం వలన, ఇది కేవలం స్టైలిష్‌గా మాత్రమే కాకుండా ప్రాక్టికల్‌గా కూడా ఉండేలా మారింది. ఈ డియో 125 ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువగా రైడింగ్ ఆనందాన్ని, ఫ్యూయల్ ఎఫిషియెన్సీని అందించగలదు.

New 2025 Honda Dio 125 Scooter Launched

ఈసారి హోండా, డియో ఐకానిక్ డిజైన్‌ను కొనసాగిస్తూ, దానికి శక్తివంతమైన గ్రాఫిక్స్‌, ఆకట్టుకునే కలర్స్‌ను ఇచ్చారు.. స్కూటర్‌ను చూసిన క్షణమే స్పోర్టీ వైబ్ బలంగా కనిపిస్తుంది. ఇది మ్యాట్ ఫినిష్‌లో, మెటాలిక్ టచ్‌లో అందంగా కనిపిస్తుంది. కేవలం లుక్స్‌ మాత్రమే కాదు, టెక్నాలజీ పరంగానూ డియో మరింత కొత్తగా ఉంటుంది. 4.2 అంగుళాల TFT డిజిటల్ డిస్ప్లే ఎంతో ఇంప్రెసివ్‌గా ఉంటుంది.

ఇందులో ఎకో ఇండికేటర్, రియల్-టైమ్ మైలేజ్, ట్రిప్ మీటర్, రేంజ్ వంటి సమాచారం అందుబాటులో ఉంటుంది. 2025 డియో 125 భారతదేశం అంతటా హోండా డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది. ఇది కేవలం బలమైన పనితీరం కలిగిన స్కూటర్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి తగ్గట్టు ఉండేలా ఐదు వేరు వేరు కలర్స్‌లో లభిస్తోంది.

New 2025 Honda Dio 125 Scooter Launched

ఇది మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, పెర్ల్ స్పోర్ట్స్ యెల్లోలో అందుబాటులో ఉంది. 2025 హోండా డియో 125, స్పోర్టీ లుక్స్ మాత్రమే కాదు, స్మార్ట్ ఫీచర్లతో కూడిన టెక్నాలజీ స్కూటర్‌గానూ వచ్చింది. ఇది ఇప్పుడు హోండా రోడ్ సింక్ యాప్‌తో అనుసంధానించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

దీనివల్ల రైడర్లు తమ ఫోన్‌ను స్కూటర్‌కి లింక్ చేసి, కాల్‌లు, మెసేజ్‌లు, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి కీలక సమాచారం TFT డిస్ప్లే మీదే చూడవచ్చు.ఇది 123.92cc సింగిల్ సిలిండర్ PGM-Fi ఇంజిన్‌తో 6.11 కిలోవాట్ల శక్తిని, 10.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కాంబినేషన్ వల్ల స్కూటర్ నగర మార్గాల్లో చురుకైన రైడింగ్ అనుభవాన్ని అందించగలదు, అంతేగాక మంచి మైలేజ్ కూడా ఇస్తుంది.

New 2025 Honda Dio 125 Scooter Launched

USB టైప్-C చార్జర్‌ ద్వారా రైడింగ్‌లో ఫోన్‌ను చార్జ్ చేసుకోవచ్చు. ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్‌తో వేగంగా ప్రయాణం ప్రారంభించొచ్చు. గత రెండు దశాబ్దాలుగా భారతీయ ప్రజలను ఆకట్టుకుంటూ, హోండా డియో స్కూటర్ ఒక ప్రత్యేకమైన స్థానం సాధించింది. ఇప్పుడు, 21 సంవత్సరాల తర్వాత కూడా, ఈ స్కూటర్‌కి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, April 16, 2025, 17:45 [IST]
English summary
New 2025 honda dio 125 scooter launched in india with updated features
Read more on: #honda motorcycle #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+