సాహస వీరుల కోసం సరికొత్త బైక్.. మతిపోగొట్టే డిజైన్, ఫీచర్లు.. యెజ్డిని చూస్తే ఓ మై గాడ్ అనాల్సిందే!
భారతదేశంలో అడ్వెంచర్ బైక్‌ల పట్ల ఇష్టం రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటి తరంలోని యువత బైక్ ప్రయాణాలకే కాదు, ఆఫ్-రోడ్ అడ్వెంచర్లకూ పెద్దపీట వేస్తున్నారు. ఈ తరుణంలో యెజ్డి కంపెనీ విడుదల చేసిన అప్‌డేటెడ్ అడ్వెంచర్ బైక్ యెజ్డి అడ్వెంచర్ 2025 మోడల్ (yezdi adventure bike), మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈసారి యెజ్డి అడ్వెంచర్ చాలా డైనమిక్‌గా, మరింత రఫ్-అండ్-టఫ్ లుక్‌తో రూపుదిద్దుకుంది. ముందుభాగంలో LED హెడ్‌ల్యాంప్, డే టైమ్ రన్నింగ్ లైట్స్, మస్క్యులర్ బాడీ డిజైన్ ఉన్నత స్థాయి ఫినిషింగ్‌ను అందిస్తున్నాయి. బైక్ డ్యుయల్-టోన్ స్కీమ్‌లో అందుబాటులో ఉండటం, దీన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడుతుంది.
కొత్తగా లాంచ్ అయిన యెజ్డి అడ్వెంచర్ బైక్ ఇప్పుడు యువతను ఆకట్టుకునేలా అత్యంత పోటీ ధరలో అందుబాటులోకి వచ్చింది. దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ.2.15 లక్షలుగా నిర్ణయించారు, ఇది న్యూఢిల్లీ ఎక్స్ షోరోమ్ ధర. టెస్ట్ రైడ్‌లు, అలాగే అధికారిక డెలివరీలు ప్రారంభమయ్యాయి. బైక్‌ను దగ్గరగా చూడాలనుకునే వారికి ఇది బెస్ట్. వీడియో గేమ్‌ల నుంచి ప్రేరణ పొందినట్టుగా ఉన్న ఈ బైక్ డిజైన్ యువతను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది.

దీని డిజైన్ విషయానికి వస్తే, ముందుభాగంలో పొడవైన విండ్‌షీల్డ్ ఉంది, ఇది ఎదురుగా వేగంగా వచ్చే గాలి ఒత్తిడిని తగ్గిస్తూ ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. దీని ట్విన్ LED హెడ్‌లైట్లు రాత్రి ప్రయాణాల్లో మెరుగైన విజిబిలిటీని అందించగా, డ్యూయల్ LED టెయిల్‌లైట్లు వెనక ఉన్న వాహనాలకు తేలికగా కనిపించేలా చేస్తాయి. ఇవన్నీ కలిపి బైక్‌ను ఒక ప్రీమియం అడ్వెంచర్ టూర్‌గా నిలిపాయి. డిజైన్ మాత్రమే కాదు, కలర్స్‌లో కూడా ఆకట్టుకుంటుంది.
యెజ్డి అడ్వెంచర్ 2025 బైక్ ఫారెస్ట్ గ్రీన్, వోల్ఫ్ గ్రే, టోర్నాడో బ్లాక్, గ్లేసియర్ వైట్ కలర్ ఆప్షన్లలో కొనుగోలుకు లభిస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ బైకు ఇంజిన్‌ను OBD-2B ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేశారు. దీంతో ఇది తక్కువ స్థాయిలో కాలుష్య కారకాలను విడుదల చేస్తుంది. ప్రస్తుతం కాలుష్య కారకాలు ఎక్కువగా విడుదలవుతున్న సమయంలో ఇది కాలుష్యాన్ని పెరగకుండా చూస్తోంది. ఇది అధునాతన టెక్నాలజీలను కలిగి ఉంది.

ప్రత్యేకంగా ఇది కార్బన్ ఉద్గారాల్లో ఏవైనా సాంకేతిక లోపాలు ఉన్నా, వెంటనే రైడర్‌కు అలర్ట్ రూపంలో తెలియజేసే ఫీచర్ కూడా ఉంది. అయితే, ఇంజిన్ పరంగా చూసుకుంటే, ఇందులో ఎటువంటి మార్పులు చేయకుండా మునుపటిలానే పవర్‌ట్రెయిన్‌ను కొనసాగించారు. ఇందులో 334cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఇది 30.2 bhp పవర్, 29.9 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీంతో రైడింగ్ చాలా కంఫర్ట్‌గా అనిపిస్తుంది.
అలానే, 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో హైవే రైడింగ్‌కు, క్లిష్టమైన ఆఫ్-రోడ్ కండిషన్‌లకు సైతం అద్భుతంగా స్పందిస్తుంది. ఈ బైకులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రిప్ నావిగేషన్ సిస్టమ్, మొబైల్ కనెక్టివిటీ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక సస్పెన్షన్, గ్రౌండ్ క్లియరెన్స్, డ్యూయల్ ఛానల్ ABS వంటి భద్రతా లక్షణాలు కూడా ప్రయాణాన్ని సురక్షితంగా చేస్తాయి. ఇది లీటర్ పెట్రోల్‌కు దాదాపు 33 కి.మీల వరకు మైలేజ్‌ను అందిస్తుందని అంచనా.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








