లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు! కేవలం రూ.59 వేలకే.. విద్యార్థులకు, వృద్ధులకు.. ఎవరికైనా బెస్ట్ ఛాయిస్!

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (GEML) ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఆంపియర్ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడంలో బాగా ప్రసిద్ది చెందింది. రోజువారి అవసరాల కోసం ఉపయోగపడే మోడళ్లను తీసుకొస్తుంది. అందరికీ ఎలక్ట్రిక్ వాహనాలను చేరువ చేయాలనే దృష్టితో మరో ముందడుగు వేసింది. తాజాగా, కంపెనీ "రియో 80 (reo 80)" అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌కి పరిచయం చేసింది. దీన్ని కంపెనీ ప్రత్యేకంగా ప్రజల రోజువారి అవసరాలను చేసుకోవడానికి రూపొందించబడింది. ఇది పేద, మధ్యతరగతి వారు కొనగలిగే విధంగా అందుబాటు ధరలో లభిస్తుంది. పెట్రోల్ ధరలు భారీగా ఉన్న నేపథ్యంలో ఇది అందరికి బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

భారతీయ ఎలక్ట్రిక్ టూవీలర్ వాహన మార్కెట్ రోజురోజుకీ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, ఆంపియర్ సంస్థ తన రియో 80 మోడల్‌ను కేవలం రూ. 59,900 ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ధరలో అంటే ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, ప్రధానంగా పేద, మధ్యతరగతి వినియోగదారుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. రియో 80ను చాలా సులభంగా డ్రైవింగ్ చేయవచ్చు. మెయింటనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.

New Ampere Reo 80 Electric Scooter

ముఖ్యంగా మొదటిసారిగా స్కూటర్‌ను ఉపయోంచే వారికి, విద్యార్థులకు, వయస్సు పైబడిన వారికి, సాధారణ గృహావసరాల కోసం ఇది అనుకూలంగా ఉంటుంది. మరో విషయం ఏమిటంటే దీన్ని లైసెన్స్ అవసరం లేకుండా, రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా నడపవచ్చు. ప్రముఖ బ్రాండ్‌ల స్కూటర్లలో కనిపించే అనేక ముఖ్యమైన ఫీచర్స్ దీనిలో కనిపిస్తాయి. అతితక్కువ ధరలో లభిస్తున్న ఈ స్కూటర్‌లో వినియోగదారులను ఆకట్టుకునే స్మార్ట్ ఫీచర్స్‌కు ఎలాంటి కొదవ లేదు.

రియో 80 ఎలక్ట్రిక్ స్కూటర్‌‌లో ఎక్కువ కాలం మన్నికతో పాటు వేడిని సైతం కంట్రోల్ చేసే LFP బ్యాటరీని అందించారు. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేసినట్లయితే దాదాపు 80 కి.మీల రేంజ్ వరకు ఛార్జ్ కోసం ఎక్కుడ ఆగకుండా ప్రయాణిస్తుంది. ముందువైపు డిస్క్ బ్రేక్‌లు మెరుగైన నియంత్రణను అందించడమే కాకుండా, కీలెస్ స్టార్ట్ సదుపాయం గల ప్రీమియం కీఫాబ్ వంటివి ఈ స్కూటర్ మరింత లేటెస్ట్‌గా మార్చుతున్నాయి.

Ampere Reo 80 Electric Scooter Design

ఇది మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర స్కూటర్లతో పోలిస్తే, నిజంగా రోజువారి ప్రయాణాలకు బాగా సెట్ అవుతుందని కంపెనీ తెలిపింది. రియో 80 డ్యూయల్-టోన్ స్పోర్టీ కలర్ ఆప్షన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. నలుపు, ఎరుపు, నీలం, తెలుపు కలర్స్‌లో అందరిని ఆకట్టుకుంటుంది. ఇది స్టైలిష్ అల్యూమినియం అల్లాయ్ వీల్స్, కొత్త డిజైన్ టచ్‌ తో ఈ స్కూటర్‌కు ప్రీమియం లుక్ అండ్ ఫీల్‌ను కలిగిస్తుంది.

సిటీ రైడింగ్‌కు అత్యంత అనువైన ఈ రియో 80, తక్కువ వేగం కేటగిరీలోకి వస్తూ, గంటకు 25 కిలోమీటర్లకే పరిమితమైన టాప్ స్పీడ్‌తో మాత్రమే దూసుకెళ్తుంది. అంటే ఇది ట్రాఫిక్‌తో కూడిన పట్టణ రోడ్లపై సురక్షితమైన ప్రయాణానికి బెస్ట్ ఎంపికగా మారుతోంది. సింపుల్ డిజైన్, తక్కువ స్పీడ్ కేటగిరీకి చెందడంతో, యువ విద్యార్థులు, వృద్ధులు, మొదటిసారిగా స్కూటర్‌ను వినియోగించబోయే వారు ఇలా ఎన్నో వర్గాల ప్రజలకు ఇది సెట్ అవుతుంది.

Ampere Reo 80 Electric Scooter Battery

రియో 80 ఎలక్ట్రిక్ స్కూటర్‌‌‌కు సంబంధించిన డెలివరీలు 2025 ఏప్రిల్ నుండి దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. లైసెన్స్ అవసరం లేకుండా, రిజిస్ట్రేషన్ అవసరం లేనటువంటి ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు ఆంపియర్ అధికారిక వెబ్‌సైట్ లేదా సమీప డీలర్‌షిప్‌ల ద్వారా బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. తక్కువ ధరలో లభించడం కారణంగా జనాల్లో బాగా డిమాండ్ ఉన్న మోడల్‌గా నిలవడానికి అవకాశాలు ఉన్నాయి.

అందుకే ఆలస్యం చేయకుండా దీని గురించిన వివరాలను బ్‌సైట్ లేదా సమీప డీలర్‌షిప్‌ల ద్వారా తెలుసుకోన వెంటనే బుకింగ్ చేసుకోవడం బెస్ట్. ఈ స్కూటర్ విడుదల సందర్బంగా ఈ సందర్భంగా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, CEO విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఆంపియర్‌లో, 'ఎవ్రీ గల్లీ ఎలక్ట్రిక్ (ప్రతి గల్లీ కూడా ఎలక్ట్రిక్ ఉండాలనే)' అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని వారు తన ప్రకటనలో తెలిపారు.

కొత్త ఆంపియర్ రియో 80 ద్వారా, మేము భారతదేశంలోని ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఆంపియర్ సంస్థ భారతీయ వినియోగదారులకు ఎప్పుడు అందుబాటు ధరలో, ఆకట్టుకునే డిజైన్లతో, అధునాతన ఫీచర్స్‌తో వాహనాలను తీసుకొస్తుంది. ఈ కొత్త స్కూటర్ లాంచ్ చిన్న పట్టణాల నుంచి పెద్ద నగరాల వరకు ప్రతి గల్లీలోకి ఎలక్ట్రిక్ విప్లవాన్ని తీసుకెళ్లే మరో ప్రయత్నంగా చెప్పొచ్చని ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే భారతదేశంలోని ఎలక్ట్రిక్ వాహన రంగంలో తనదైన స్థానం సంపాదించుకుంటున్న గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, మార్చి 2025లో కీలక మైలురాయిని చేరుకుంది. వాహన్ డేటా ప్రకారం, ఈ సంస్థ ఏకంగా నెలవారీగా 52 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ఒక్క మార్చి నెలలోనే 6,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ టూవీలర్స్‌ను విక్రయించింది. ఇది మార్కెట్‌లో సంస్థకు ఉన్న బలమైన ఉనికిని స్పష్టంగా తెలియజేస్తుంది.

గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ (GCL) గురించి చూసినట్లయితే 165 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ సంస్థ, భారతీయ ఇంజినీరింగ్ రంగంలో తన కీలకంగా ఉంది. ఒకప్పుడు డీజిల్ ఇంజిన్ల తయారీలో ప్రఖ్యాతి గాంచిన ఈ కంపెనీ, ఇప్పుడు ఇంధనాలకు అతీతంగా, ఎండ్-టు-ఎండ్ మొబిలిటీ సొల్యూషన్లను అందించే సంస్థగా మారింది. 2030 నాటికి బిలియన్ వాహనాల మైలురాయిని చేరుకోవాలన్న లక్ష్యంతో సంస్థ వెళ్తుంది.

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (GEML), భారతదేశంలో 16 సంవత్సరాలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందిస్తోంది. ఇది ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో బలమైన ఉనికిని కలిగి ఉంది. దీనికి అనుబంధంగా MLR ఆటో లిమిటెడ్, బెస్ట్‌వే ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి. భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌పై దృష్టి సారించిన మొదటి కంపెనీలలో ఇది ఒకటి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, April 10, 2025, 17:50 [IST]
English summary
New ampere reo 80 electric scooter launched in india with price at rs 59900
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+