ఈ 3 బైక్‌ల్లో ఏదైనా ఒకటి ఇంటికి తెచ్చుకుంటే, నెలకు రూ.2000 పెట్టినా సరిపోతుంది!

ప్రస్తుతం టూవీలర్ లేనిదే రోజులు గడవట్లేదు. మార్కెట్, ఉద్యోగాలు, పిల్లల స్కూల్ డ్రాప్ మొదలగు అన్ని అవసరాలకు కూడా తప్పనిసరిగా బైక్ లేదా స్కూటర్ ఇంట్లో ఉండాల్సిందే. ప్రధానంగా బైకులు ఎక్కువ మైలేజ్ అందించడం కారణంగా వీటిని కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో తయారీదారులో పోటా పోటీగా తమ అధునాతన ఫీచర్స్, డిజైన్‌తో కూడిన బైకులను విడుదల చేస్తున్నాయి. ప్రతి నెలా లక్షల బైక్‌లు అమ్ముడవుతుండగా, ముఖ్యంగా 100cc నుంచి 125cc స్లాట్‌లో గిరాకీ ఊహించదగిన స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో హోండా మోటార్‌సైకిల్ ఇండియా, హీరో మోటోకార్ప్ తీవ్రంగా పోటీ పడే ఈ మార్కెట్లో, కొత్త మోటార్‌సైకిళ్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాటి గురించి ఈ కథనంలో చూద్దాం.

హోండా మోటార్‌సైకిల్ ఇండియా తాజాగా ప్రవేశపెట్టిన షైన్ 100 DX(Honda Shine 100 DX) బైక్ ఆగస్టు 1న మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ ఇటీవల దీనిని అధికారికంగా పరిచయం చేయగా, రూ.75,000 నుండి రూ.80,000 (ఎక్స్-షోరూమ్) మధ్య ధరకు లభించనుందని అంచనాలు ఉన్నాయి. సాధారణ ప్రజల కోసం, ముఖ్యంగా డైలీ యూజర్లకు అనుకూలంగా రూపొందించిన ఈ మోడల్ బాగా సెట్ అవుతుంది.

shine 100 Dx

ఇంజిన్ పరంగా ఇది 98.98cc సామర్థ్యం కలిగిన OBD2B సింగిల్-సిలిండర్ ఫ్యూయల్-ఇంజెక్ట్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది నాలుగు-స్పీడ్ గేర్‌బాక్స్ సహాయంతో పనిచేస్తుంది. డైలీ ట్రాఫిక్ కోసం సరిపడే పవర్, మైలేజ్ ఇచ్చేలా ట్యూనింగ్ చేశారు. బైక్ డిజైన్ విషయానికి వస్తే.. యువతను మెప్పించేలా డిజైన్ చేయబడింది. కాంపాక్ట్ స్టైల్‌తోపాటు కాస్త స్పోర్టీ టచ్ కూడా అందించారు.

ఫీచర్ల విషయానికొస్తే, LCD డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కంబైన్డ్ బ్రేక్ సిస్టమ్(CBS), డ్రమ్ బ్రేకులు, ఇంజిన్ కట్-ఆఫ్ విత్ సైడ్ స్టాండ్ వంటి అనేక ఉపయోగకరమైన అంశాలతో వస్తోంది. ఇవన్నీ కలిపి చూస్తే, కొత్తగా బైక్ కొనాలనుకునే వారికి ఇది ఒక బలమైన ఎంపికగా నిలుస్తుంది. ఇది నాలుగు ఆకర్షణీయ కలర్స్ పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, జెనీ గ్రే మెటాలిక్‌లలో లభిస్తుంది.

Honda cb 125 Hornet

హోండా మోటార్‌సైకిల్ లైనప్‌లో మరో స్పోర్టీ బైక్ CB125 హార్నెట్(CB125 Hornet). ఇటీవలే ఈ బైక్‌ను హోండా అధికారికంగా ఆవిష్కరించింది. ఇక ఆగస్టు 1న గ్రాండ్ లాంచ్ కార్యక్రమం జరగనుందని అంచనాలు ఉన్నాయి. ధర పరంగా చూస్తే ఇది రూ.95,000 నుండి రూ.1 లక్ష (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశముంది. అందుబాటులో ఉన్న ధరతోనే కాక, దాని స్టైలింగ్, పనితీరు, ఫీచర్లతో యువతను బాగా ఆకర్షించే అవకాశం ఉంది.

CB125 హార్నెట్ డిజైన్‌ను చూస్తే ఇది ఆకర్షణీయంగా ఉంటుంది. ముందు భాగంలో స్టైలిష్ ట్విన్ LED హెడ్‌ల్యాంప్స్, దానికి కాస్త అగ్రెసివ్ బాడీ లైన్స్ ఉన్న ఫ్యూయల్ ట్యాంక్, ఇవన్నీ బైక్‌కు ఒక స్పోర్టీ బలమైన లుక్ తీసుకువచ్చాయి. ఈ బైక్‌లో 123.94cc సామర్థ్యం గల ఫ్యూయల్-ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 11 PS శక్తిని, 11.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ, 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

New Budget Friendly Mileage Bikes

బైక్ 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.4 సెకన్లలో అందుకోగల సామర్థ్యం కలిగి ఉంది. ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో చాలా ఆధునిక టెక్నాలజీ వాడబడింది. 4.2 అంగుళాల TFT డిజిటల్ డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీతో హోండా రోడ్‌సింక్ యాప్, Usb టైప్-C ఛార్జింగ్ పోర్ట్, ఇంజిన్ స్టాప్ స్విచ్ వంటి వినియోగదారుల అవసరాలను తీర్చే ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

హీరో నుంచి గ్లామర్ 125(Hero Glamour 125) బైక్ త్వరలో విడుదల కాబోతుందని సమాచారం. హోండా తన మోడళ్లతో సిద్ధంగా ఉన్న తరుణంలో హీరో ఈ కొత్త మోడల్‌తో మార్కెట్లో సందడి చేయడానికి సిద్ధమవుతుంది. ఇది దాదాపు రూ.85,000 నుండి రూ.95,000 (ఎక్స్-షోరూమ్) ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 124.7 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో లీటరుకు 65 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదని అంచనా.

More from DriveSpark

Article Published On: Thursday, July 31, 2025, 16:56 [IST]
English summary
New budget friendly mileage bikes from honda and hero launch details
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+