యూత్‌కు బాగా నచ్చే లుక్స్‌తో సరికొత్త హీరో స్కూటర్ విడుదల.. ఇది బైకుకు తక్కువ, స్కూటర్‌కు ఎక్కువ!
భారత టూ- వీలర్ మార్కెట్లో హీరో మోటోకార్ప్ సంస్థ పేరు అందరికీ సుపరిచితమే! ఎన్నో ఏళ్లుగా ఈ సంస్థ వాహనాలు భారతీయుల మనసు దోచుకుంటున్నాయి. ఈ సంస్థ నుంచి 'స్ప్లెండర్' బైకు అయితే.. పల్లెల నుంచి పట్టణాల దాకా అందరికీ చేరువైంది. ఈ సంస్థ నెమ్మదిగా స్కూటర్ సెగ్మెంట్‌లోనూ తన మార్క్ చూపెడుతూ వస్తోంది. ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో తమ బ్రాండ్ నుంచి ఓ కొత్త స్కూటర్‌ను లాంఛ్ చేసి ఆకట్టుకుంది. అదే 'Xoom 160' స్కూటర్. బైకు కంటే తక్కువ, రెగ్యులర్ స్కూటర్ కంటే ఎక్కువ అనేటట్లు ఉన్న ఈ స్కూటర్‌ను అధునాతన ఫీచర్లు జోడించి, అదిరే లుక్‌లో తీసుకువచ్చింది హీరో సంస్థ. మరి ఈ స్కూటర్‌లో ఉన్న ఇతర ఫీచర్లు, ధర వంటి విశేషాలేంటో చూసేద్దాం.
ధర: ఈ హీరో జూమ్ 160 స్కూటర్‌ను సరసమైన ధరలో తీసుకువచ్చింది హీరో సంస్థ. దీని ఎక్స్- షోరూమ్ ధర రూ.1.48 లక్షలుగా ఉంది. ఇది పురుషులకు మాత్రమే కాకుండా స్త్రీలు కూడా తమ రోజువారీ అవసరాల కోసం వినియోగించేందుకు అనువుగా ఉండేలా తయారు చేశారు. ఈ ధరలో ఈ స్కూటర్ భారీ ఫీచర్లను కలిగి ఉంది.

డిజైన్: ఈ హీరో జూమ్ 160 స్కూటర్‌ను మోడర్న్ లుక్‌తో తయారు చేశారు. ఇది split-LED హెడ్ లైట్, విండ్ స్క్రీన్‌తో వస్తుంది. ఈ స్కూటర్.. Cast Pearl Summit White, Cast Canyon Red, Cast Volcanic Grey, Cast Matte Rain Forest Green అనే కలర్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.
పవర్‌ట్రైన్: ఈ స్కూటర్ 156- సీసీ సింగిల్- సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఉంటుంది. ఇది 14 bhp హార్స్ పవర్, 13.7 Nm గరిష్ఠ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 40 కేఎంపీఎల్ మేలైజీ అందించగలదు. ఫర్ఫామెన్స్ పరంగా బైక్‌తో సమానంగా ఇది పోటీ పడుతుంది. కావున దీనిని బైక్‌కి ఎక్కువగా భావించవచ్చు.

ఫీచర్లు: ఈ స్కూటర్‌లో ఫీచర్లకు కొదవ లేదు. ఇది LCD ఇన్స్టుమెంట్ కన్సోల్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, టర్న్- బై- టర్న్ నేవిగేషన్‌తో ఉంటుంది. దీంట్లో i3S సిస్టం, సైలెంట్ స్టార్టర్, కీలెస్ ఇగ్నిషన్ ఉంటాయి. దీని సీటు ఎత్తు 787 మి.మీలతో ఉంటుంది. ఇది 155 మి.మీ.ల గ్రౌండ్ క్లియరెన్స్ అందిస్తుంది.
సస్పెన్షన్ సెటప్ & బ్రేకింగ్ సిస్టం: ఈ హీరో జూమ్ 160 స్కూటర్ ఫ్రంట్.. టెలిస్కోపిక్ ఫోర్క్‌తో ఉంటుంది. రియర్ వైపు ట్విన్ షాక్ అబ్సార్బర్స్ సస్పెన్షన్ సెటప్ ఆప్షన్ ఉంటుంది. ఇది డబుల్ డిస్క్ బ్రేక్స్‌తో ఉండి రైడర్‌కు సేఫ్టీ అందిస్తుంది. దీంట్లో 12- అంగుళాల అలాయ్ వీల్స్ ఉంటాయి.

హీరో జూమ్ 125 స్కూటర్ స్కూటర్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. దీని ఎక్స్- షో రూమ్ ధర రూ.86,900 గా ఉంది. ఇది VX, ZX వేరియంట్లలో లభిస్తుంది. ఇది 124.6 సీసీ ఎయిర్ - కూల్డ్ సింగిల్- సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఉంటుంది. 7.6 సెకన్లలోనే ఇది సున్నా నుంచి 60 కి.మీ.ల వేగాన్ని అందుకుంటుంది.
ఈ జూమ్ 125 స్కూటర్ LCD ఇన్స్టుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్- బై- టర్న్ నేవిగేషన్, USB ఛార్జింగ్ పోర్ట్, అండర్- సీట్ స్టోరేజ్ లైట్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఈ స్కూటర్ డిస్క్ లేదా డ్రమ్ బ్రేక్స్‌తో ఉండి, రైడర్‌కు సేఫ్టీ అందిస్తుంది. హై ఫర్ఫామెన్స్, భారీ ఫీచర్లు కలిగిన స్కూటర్ కోసం చూస్తుంటే ఇది మీకు సరిపోతుంది.


Click it and Unblock the Notifications








