రూ.75 వేలకే హోండా కొత్త బైక్ లాంచ్.. డిమాండ్ పెరగక ముందే వెంటనే షోరూమ్‌కు పరిగెత్తండి
పెట్రోల్ ధరలు నిత్యం పెరిగిపోతున్న వేళ, ప్రతి రూపాయికి విలువ చూసే వినియోగదారుల కోసం హోండా మరోసారి తన నమ్మకాన్ని నిలబెట్టడానికి కొత్త బైకును తెచ్చింది. మంచి మైలేజ్‌తో పాటు, మెరుగైన పనితీరు కలిగిన బైక్ కోసం ఎదురుచూస్తున్న వారికి తాజాగా శుభవార్త చెప్పేసింది. హోండా తన కొత్త మోడల్ షైన్ 100 డిఎక్స్(Shine 100 DX) ను ఈరోజు అంటే ఆగస్టు 1న భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఇది ఇప్పటికే ప్రజాదరణ పొందిన హోండా షైన్ 100 బైక్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్ అనే చెప్పొచ్చు. ఫ్యూయల్ ఎఫిషియన్సీ, కంఫర్ట్, డిజైన్.. అన్ని ఒకే దానిలో అందించేలా ఈ కొత్త వేరియంట్ రూపొందించారు. షైన్ 100 DX బైక్‌ను కంపెనీ రూ.74,959 ఎక్స్-షోరూమ్ (న్యూఢిల్లీ ధర) ధరకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇక, ఈ బైకుకు సంబంధించిన బుకింగ్‌లు కూడా అధికారికంగా మొదలయ్యాయి. బైక్‌ను కొనాలనుకునే వారు హోండా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా సమీపంలోని షోరూమ్‌కు వెళ్లి బుకింగ్ చేయొచ్చు. ఆకర్షణీయమైన డిజైన్, రోజువారీ వాడకానికి మినిమమ్ ఖర్చుతో మాక్సిమమ్ బెనిఫిట్ ఇవ్వగల బైక్ కావాలనుకునే వారికి ఇది ఒక మంచి ఎంపిక. ఇలా చూస్తే, హోండా ఈ కొత్త మోడల్‌తో మధ్యతరగతి వినియోగదారుల మనసు గెలవడంలో ఖాయం.

హోండా షైన్ 100 DX బైక్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తున్న అంశాల్లో ప్రధానమైనది దాని శక్తివంతమైన పవర్‌ట్రెయిన్. ధర పరంగా బడ్జెట్ ఫ్రెండ్లీగా కనిపించినా, ఇందులో దాగున్న ఇంజిన్ పెర్ఫామెన్స్ మాత్రం మంచి సర్ప్రైజ్‌లా ఉంటుంది. ఈ బైక్‌లో 98.98 సీసీ సామర్థ్యం గల సింగిల్-సిలిండర్ ఫ్యూయల్-ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్ఠంగా 7.28 PS పవర్, 8.04 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
చిన్నగా కనిపించే ఈ సంఖ్యలు, బైక్‌కి అవసరమైన పనితీరును అందించేందుకు చాలు. హోండా ఇంజిన్‌కు 4-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేసింది, ఇది నగర ప్రయాణాలకు సరిగ్గా సరిపోయేలా డిజైన్ అయింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దీని మైలేజ్. హోండా ప్రకారం, ఈ బైక్ లీటర్‌కు 70 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలదని అంచనా. పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ సమయంలో ఇది ఓ పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.

సాధారణంగా చిన్న ఇంజిన్ బైకులు పెర్ఫామెన్స్ తక్కువ, మైలేజ్ ఎక్కువ అనే అభిప్రాయాన్ని కలిగిస్తుంటాయి. కానీ షైన్ 100 DX మాత్రం రెండు అంశాలను బ్యాలెన్స్‌తో సమాధానమివ్వగలుగుతోంది. ఇది రోజూ స్కూల్, కాలేజ్, ఆఫీస్ వెళ్లే వారికి సరైన ఎంపికగా నిలుస్తోంది. ఈ బైక్‌కి 10 టర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం ఉంది. అయితే, ఇది ఎప్పుడూ ఎక్కువ ప్రయాణాలు చేయని డైలీ కమ్యూటర్లకు బాగా సరిపోతుంది.
కలర్స్ విషయానికి వస్తే, ఈ బైక్ నలుపు, ఎరుపు, నీలం, బూడిద రంగుల్లో అందుబాటులో ఉంది. ముఖ్యంగా, అన్నీ కలర్ వేరియంట్లు కూడా ఒకే ధరకు లభించడం వినియోగదారులకు మరో అదనపు లాభం. టెక్నాలజీ పరంగా చూసినప్పుడు, LCD డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఈ సెగ్మెంట్‌లో ఓ అడ్వాన్స్‌డ్ టచ్‌గా చెప్పుకోవచ్చు. దాంతో పాటు సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ ఫీచర్ సేఫ్టీకి ప్లస్ పాయింట్.
రైడింగ్ కంఫర్ట్ కోసం టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక భాగంలో 5-స్టెప్ అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్‌ను అందించారు. దీని వల్ల దారుల్లో గుంతలు, అడ్డంకులు ఉన్నా కూడా ప్రయాణం చాలా సాఫీగా ఉంటుంది. భద్రతకు సంబంధించి CBS (కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్) ఉండటంతో, బ్రేకింగ్ సమయంలో బైక్‌ను బ్యాలెన్స్ చేయడం సులభం. డ్రమ్ బ్రేక్‌లు కూడా డైలీ యూజ్‌కి సరిపోయే పనితీరు ఇస్తాయి.


Click it and Unblock the Notifications








