పెట్రోల్ ఖర్చు మరిచిపోండి.. సింగిల్ ఛార్జ్‌ చాలు! బడ్జెట్ ధరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం ఓ రేంజ్‌లో పెరిగింది. చాలా మంది కొత్త వినియోగదారులు సాంప్రదాయ ఇంధన వాహనాల కంటే ఎలక్ట్రిక్ మోడళ్లపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్లో లభించే వాటిలో మంచి బ్యాటరీ పనితీరు, అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ కలిగిన మోడళ్లను ఎంచుకుని కొనుగోలు చేస్తున్నారు. భారత కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా ఈవీ తయారీదారులు వారి ఇష్టానికి అనుగుణంగా వరుసగా కొత్త ఇస్కూటర్లను విడుదల చేస్తున్నారు. పెద్ద కంపెనీలకు పోటీగా స్టార్టప్ కంపెనీలు సైతం ముందడుగు వేసి తమకు అందుబాటులో ఉన్న బడ్జెట్‌లోనే పలు మోడళ్లను విడుదల చేస్తున్నాయి. ఈ సెగ్మెంట్‌లో మార్కెట్లో ఉన్న ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ సింపుల్ ఎనర్జీ (Simple Energy) కొత్తగా సింపుల్ వన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది.

ఈ సింపుల్ వన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌(simple ones electric scooter) ప్రారంభ ధర రూ.1,39,999 (ఎక్స్-షోరూమ్). ఇది ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుంది. కస్టమర్లకు నమ్మా రెడ్, గ్రేస్ వైట్, అజూర్ బ్లూ,బ్రాజెన్ బ్లాక్ అనే నాలుగు కలర్స్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. మంచి బ్యాటరీ పనితీరు, అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ కలిగిన మోడళ్లకు దేశీయ ప్రజలు బాగా ఆదరిస్తారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మెరుగైన పనితీరును అందిస్తుంది.

Simple Ones Electric Scooter Range Battery

సింపుల్ వన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌‌‌లో అత్యాధునిక ఫీచర్స్ ఉన్నాయి. 5G e-SIM, Wi-Fi,బ్లూటూత్ ద్వారా కనెక్టివిటీ కూడా దీనిలో ఉంది. రైడర్లకు సులభమైన రైడింగ్‌ను ఇవ్వడానికి ఎకో, రైడ్, డాష్, సోనిక్ అనే నాలుగు మోడ్స్‌లను కలిగి ఉంటుంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ డ్యాష్‌బోర్డ్‌ ఉంది. దీనిలో స్మార్ట్‌ఫోన్‌కు వచ్చే కాల్స్‌ను కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్స్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటివి ఉన్నాయి.

పోటీ మార్కెట్లో అందరికంటే ఎక్కువగా సేల్స్ సాధించాలంటే మిగతా ప్రత్యర్థుల కంటే ప్రత్యేకమైన ఫీచర్స్‌ను ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే వన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఇతర మోడళ్లలో లేని డజన్ల కొద్ది ఫీచర్స్‌ను అందించారు. ఈ కొత్త మెడల్ లాంచ్‌తో సింపుల్ ఎనర్జీ దాని మునుపటి ఎంట్రీ-లెవల్ మోడల్ అయినటువంటి సింపుల్ డాట్ వన్‌ను నిలిపివేస్తుంది. దాని కంటే మరిన్ని కీలక అప్‌డేట్స్‌ సింపుల్ వన్స్‌లో ఉన్నాయి.

Simple Ones Electric Scooter Price

సింపుల్ వన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ పనితీరు విషయానికి వస్తే, ఇది 8.5kW PMSM మోటార్‌తో పనిచేస్తుంది. దీనిలో స్థిరంగా ఉండగలిగే 3.7 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. దీన్ని పూర్తిగా ఛార్జింగ్ చేసినట్లయితే IDC పరిధిలో 181 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 105 కిలోమీటర్లుగా ఉంది. ఇది కేవలం 2.55 సెకన్లలో 0 నుండి 40 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది.

సింపుల్ వన్స్‌ భారతీయ వినియోగదారుల రోజువారీ అవసరాలను తీర్చడంలో బాగా ఉపయోగపడుతుందని కంపెనీ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కువ లగేజీని పెట్టుకోవడానికి సీటు కింది భాగంలో 35 లీటర్ల నిల్వ సరిపడినంత స్థలం దీనిలో ఉంటుంది. ఫైండ్ మై వెహికల్ ద్వారా స్కూటర్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. ఇది పార్క్ అసిస్ట్ ఫంక్షన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రాపిడ్ బ్రేకింగ్ సిస్టమ్‌ వంటి వాటిని కలిగి ఉంది.

ఈ సింపుల్ వన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ప్రస్తుతం హైదరాబాద్, వైజాగ్, కొచ్చి,బెంగళూరు, పూణే, విజయవాడ, మంగళూరులోని 15 సింపుల్ ఎనర్జీ అధీకృత షోరూమ్‌లలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త మోడల్ రాకతో భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్, ఏథర్, బజాజ్ వంటి తయారీదారులకు గట్టి పోటీ ఎదురుకానుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, March 12, 2025, 15:40 [IST]
English summary
New simple ones electric scooter launched in india price range battery and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+