కొత్త బైక్ కొనాలంటే కాస్త ఆగండి భయ్యా..ఈ నెలలో కేక పుట్టించే కిర్రాక్ బైక్స్ రాబోతున్నాయ్..చూసి కొనేయండి
2025 డిసెంబర్ నెల భారతీయ టూ వీలర్ లవర్స్‌కు సంవత్సరాంతపు గొప్ప బహుమతితో రాబోతోంది. కొంతకాలంగా టెస్టింగ్ దశలో కనిపించిన స్పై షాట్‌లు, నిరంతరంగా బయటపడిన అప్‌డేట్‌లు టూ వీలర్ లవర్లలో భారీ ఉత్సాహాన్ని నింపాయి. ఇప్పుడు ఆ స్కూటర్లు, బైకుల్లో కొన్ని అధికారికంగా మార్కెట్లోకి విడుదల కావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ కొత్త మోడళ్లు BMW, సుజుకి, బజాజ్, FB మొండియాల్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుండి రాబోతున్నాయి. ఈ మోడళ్లన్నీ అన్ని రకాల రైడర్లను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడ్డాయి.
సుజుకి ఇ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్
సుజుకి తమ అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్‌లలో ఒకటైన యాక్సెస్ మోడల్‌ను ఈసారి పూర్తిగా మార్చబోతోంది. పెట్రోల్ ఇంజిన్‌కు బదులుగా, కొత్త ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌తో యాక్సెస్ మార్కెట్‌లోకి రాబోతోంది. కమ్యూటర్ సెగ్మెంట్‌లో ఇప్పటికే బలమైన అభిమానుల మద్దతు పొందిన యాక్సెస్, ఎలక్ట్రిక్ రూపంలో విడుదల కావడం మార్కెట్‌పై పెద్ద ప్రభావాన్ని చూపుతుందని అంచనా.

టీవీఎస్, బజాజ్, హీరో వంటి ప్రముఖ బ్రాండ్‌ల ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటికే విజయం సాధించిన నేపథ్యంలో సుజుకి ఈ రంగంలోకి అడుగు పెట్టడం కీలకం కానుంది. పెట్రోల్ యాక్సెస్‌కు సమానమైన స్టైలింగ్, మెరుగైన ఫీచర్లను ఇందులో ఆశించవచ్చు.
FB మొండియాల్ పీయేగా 452
చాలా కాలం విరామం తర్వాత, ఇటాలియన్ వెహికల్ బ్రాండ్ FB మొండియాల్ భారత మార్కెట్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. డిసెంబర్‌లో గోవాలో జరగనున్న ఇండియా బైక్ వీక్ 2025 ఈ బ్రాండ్ గ్రాండ్ రీ-ఎంట్రీకి వేదిక కానుంది. మోటోహోస్ (Motohouse) సహకారంతో రాబోతున్న కొత్త FB మొండియాల్ పీయేగా 452 మోడల్ భారతీయ ప్రీమియం మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లో గొప్ప సంచలనం సృష్టించే అవకాశం ఉంది.

ఈ బైక్‌లో 449.5 సీసీ, లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 47.5 bhp పవర్‌ను, 39 Nm టార్క్‌ను అందిస్తుంది. పవర్ డెలివరీని మరింత సున్నితంగా చేయడానికి ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్ కూడా చేర్చబడింది.
కొత్త బజాజ్ 125 సీసీ స్పోర్టీ బైక్
బజాజ్ ఈ నెలలో ఒక కొత్త 125 సీసీ స్పోర్టీ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ బైక్ N-సిరీస్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన N125 వలె అదే మోడ్రన్ ఆర్కిటెక్చర్‌ను పంచుకునే అవకాశం ఉంది. ఈ కొత్త మోడల్, పల్సర్ అగ్రెసివ్ డిజైన్‌ను, N-సిరీస్ మోడ్రన్ ఫీచర్-సెట్‌ను కలిపి ఒక ప్యాకేజీగా అందించబోతోంది.

హార్లీ-డేవిడ్‌సన్ X440T
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి పోటీగా హీరో మోటోకార్ప్, హార్లీ-డేవిడ్‌సన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన X440 ఇప్పటికే మంచి గుర్తింపు పొందింది. ఇప్పుడు దాని మరింత స్టైలిష్, మోడ్రన్ ప్రీమియం వేరియంట్ అయిన X440T ని హార్లీ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త మోడల్‌లో కూడా అదే 440 సీసీ ఇంజన్ ఉండవచ్చు, కానీ ఆకర్షణీయమైన LED లైట్లు, కొత్త కలర్ ఆప్షన్లు వంటి డిజైన్ మార్పులను ఇందులో ఆశించవచ్చు.

BMW F450 GS
చివరగా, BMW F450 GS అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను BMW భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. టీవీఎస్, BMW సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ బైక్ వారి భాగస్వామ్యంలో తదుపరి ముందడుగు. తమిళనాడులోని హోసూర్‌లో ఉన్న టీవీఎస్ ప్లాంట్‌లో తయారయ్యే ఈ బైక్‌లోని 420 సీసీ, ట్విన్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ దాదాపు 48 bhp పవర్‌ను, 43 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయవచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








