యెజ్డి అడ్వెంచర్ vs హిమాలయన్.. ఆ ఒక్క మార్పుతో అంతా మారిపోతుందట.. ఏంటో తెలుసా? 

మనదేశంలో అడ్వెంచర్ టూరర్ బైక్‌లకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఈ విభాగంలో యెజ్డి అడ్వెంచర్ ఒక బెస్ట్ ఆఫ్షన్. ఇది అందుబాటు ధరలో మంచి పనితీరును, అనేక ఫీచర్లను అందిస్తుంది. క్లాసిక్ లెజెండ్స్ వచ్చే నెల మే 15న యెజ్డి అడ్వెంచర్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఈ బైక్‌కు కొత్త డిజైన్‌ను అందించనున్నట్లు సమాచారం. రాబోయే బైక్‌లో మనం ఎలాంటి మార్పులు రావచ్చో తెలుసుకుందాం.

గతేడాది క్లాసిక్ లెజెండ్స్ యెజ్డి అడ్వెంచర్ అప్డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేసింది. కంపెనీ పెద్దగా మార్పులు చేసిన ఇంజిన్‌ను, కొన్ని డిజైన్ మార్పులను చేర్చింది. ఇప్పుడు క్లాసిక్ లెజెండ్స్ తమ అడ్వెంచర్ బైక్ మరొక అప్‌డేట్‌ను విడుదల చేయడానికి రెడీ అవుతుంది. గత ఏడాది బైక్‌కు పర్ఫామెన్స్ ఆధారిత అప్ డేట్స్ లభించినందున.. ఈ సారి దాని రూపాన్ని మెరుగుపరచడం మీద దృష్టి పెట్టవచ్చు.

New Yezdi Run

దాని కోసం వారు చేసే మొదటి పని కొత్త కలర్ ఆఫ్షన్లను పరిచయం చేయడం. ప్రస్తుతం యెజ్డి అడ్వెంచర్‌లో పెద్దగా గ్రాఫిక్స్, స్టిక్కరింగ్ కనిపించవు. అయితే, యెజ్డి అడ్వెంచర్ పోటీదారులు అలా కాదు. స్టిక్కర్, గ్రాఫిక్స్ విషయంలో కొందరు మినిమలిస్ట్ విధానాన్ని ఇష్టపడితే, చాలా మంది భిన్నంగా ఆలోచిస్తారు.

ప్రస్తుత యెజ్డి అడ్వెంచర్‌కు ట్యాంక్ బ్రేస్‌పై 'Est. 69' అనే అక్షరాలు, ఫ్యూయల్ ట్యాంక్‌పై యెజ్డి లోగో ఉన్నాయి. సైడ్ ప్యానెల్‌లకు 'అడ్వెంచర్' బ్యాడ్జింగ్ లభిస్తుంది. అయితే, యెజ్డి అడ్వెంచర్‌తో పోలిస్తే హీరో ఎక్స్‌పల్స్ 210, కెటిఎమ్ 250 అడ్వెంచర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 వంటి పోటీదారులు, పవర్ ఫుల్, గ్రాఫిక్స్‌ను ఉపయోగించడం వల్ల మరింత డైనమిక్‌గా కనిపిస్తాయి.

Yezdi Adventure

ప్రస్తుతం ఉన్న కలర్ పాలెట్‌లోని రంగులు యెజ్డి అడ్వెంచర్ పర్ఫామెన్స్ సరిపోలడం లేదని ఒక లోపంగా చెప్పవచ్చు. ప్రస్తుతం యెజ్డి అడ్వెంచర్‌లో రెండు మాట్ (టొర్నాడో బ్లాక్, మాగ్నైట్ మెరూన్), రెండు గ్లోస్ (వుల్ఫ్ గ్రే, గ్లేసియర్ వైట్) కలర్ ఆఫ్షన్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని మంచి రంగులను అందిస్తే అది బైక్ అమ్మకాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది.

గతేడాది గణనీయమైన మార్పులకు గురైనందున 2025 యెజ్డి అడ్వెంచర్‌లో మెకానికల్‌గా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఈ బైక్ 29.60 PS పవర్, 29.80 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 334సీసీ, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, DOHC ఇంజన్ నుండి పవర్ గ్రహిస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

New Yezdi Adventure

ఈ బైక్‌లో 41 mm టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లతో కూడిన డబుల్ క్రెడిల్ ఫ్రేమ్, లింకేజ్, 7-స్టెప్ అడ్జస్టబుల్ ప్రీలోడ్‌తో కూడిన రియర్ మోనో షాక్ అబ్సార్బర్‌ను ఉపయోగించారు. ముందు, వెనుక వైపులా వరుసగా 90/90, 130/80 టైర్లతో రోల్డ్ 21-ఇంచులు, 17-ఇంచుల వీల్స్ ఉన్నాయి. రెండు చివర్లలో డ్యూయల్-ఛానల్ ABS తో డిస్క్ బ్రేక్‌లు వస్తాయి.

ప్రస్తుతం యెజ్డి అడ్వెంచర్ ధర 2.10 లక్షల నుండి 2.16 లక్షల రూపాయల వరకు ఉంది. క్లాసిక్ లెజెండ్స్ ఈ ధరను కొనసాగిస్తుందా లేదా పెంచుతుందా అని తెలుసుకోవడానికి మే 15 వరకు వేచి చూడాలి. పోటీదారులతో పోల్చి చూస్తే హీరో ఎక్స్‌పల్స్ 210 ధర 1.86 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతుంది.

New Yezdi Adventure

కెటిఎమ్ 250 అడ్వెంచర్ ధర 2.60 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 అనేక రంగులలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. హిమాలయన్ ధర 2.85 లక్షల నుండి 2.98 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, April 26, 2025, 7:03 [IST]
English summary
New yezdi adventure launching soon these changes could worry himalayan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+