చైనా దెబ్బకు బజాజ్ విలవిల.. ఆగస్టులో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి నిలిపివేత ?
ప్రపంచమంతా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తోంది. ముఖ్యంగా స్కూటర్లు, టూవీలర్ల డిమాండ్ బాగా పెరిగింది. కానీ, ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఎదురైంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడానికి ముఖ్యమైన ఒక ముడిసరుకు ఉంది. దాని పేరు రేర్ ఎర్త్ ఎలిమెంట్. దీన్ని ఎక్కువగా చైనా తయారు చేస్తుంది. ఇప్పుడు చైనా ఈ ముడిసరుకును వేరే దేశాలకు అమ్మకుండా ఆపేసింది.
ఈ దెబ్బకు, మన దేశంలోని పెద్ద కంపెనీ అయిన బజాజ్ వచ్చే ఆగస్టు నెలలో ఒక్క ఎలక్ట్రిక్ వాహనాన్ని కూడా తయారు చేయలేని పరిస్థితికి వచ్చింది. అసలు ఎందుకు ఇలా జరిగింది? వివరంగా తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఎంత ఉందో, వాటికి కావాల్సిన ముడిసరుకు కొరత కూడా అంతే ఉంది. ముఖ్యంగా, ఎలక్ట్రిక్ మోటార్లకు చాలా అవసరమైన రేర్ ఎర్త్ ఎలిమెంట్ అనే పదార్థం చైనాలో మాత్రమే ఎక్కువగా దొరుకుతుంది. ఇప్పుడు చైనా దీన్ని ఎవరికీ అమ్మకుండా నిషేధించింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసే కంపెనీలన్నీ కంగారు పడుతున్నాయి. చాలా కంపెనీలు ఇప్పటికే చైనా కాకుండా వేరే దేశాల నుంచి ఈ ముడిసరుకును తెచ్చుకోవాలని చూస్తున్నాయి.
ఈ ముడిసరుకు కొరత బజాజ్ ఆటో కంపెనీని బాగా ఇబ్బంది పెట్టింది. బజాజ్ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ ఆటోలు తయారు చేయడంలో చాలా ముందుంది. మార్కెట్‌లో మంచి వృద్ధిని సాధించింది. కానీ, ఈ ముడిసరుకు కొరత వల్ల బజాజ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఇటీవల ఎకనామిక్స్ టైమ్స్ పత్రికకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన ఈ సమస్య గురించి చెప్పారు. "ఎలక్ట్రిక్ వాహనాలకు కావాల్సిన హెవీ రేర్ ఎర్త్ మాగ్నెట్ దొరకడం చాలా కష్టంగా మారింది. ప్రస్తుతం మేము తక్కువ సంఖ్యలో మాగ్నెట్లను తయారు చేసే వాళ్లతో ఒప్పందం చేసుకున్నాం. కానీ, వాళ్ళు మాకు కావాల్సినన్ని మాగ్నెట్లను ఇవ్వలేకపోతున్నారు" అని ఆయన అన్నారు.
రాజీవ్ బజాజ్ మాట్లాడుతూ.. "మా దగ్గర ఉన్న స్టాక్స్ అన్నీ గత జూన్ నెలలోనే అయిపోయాయి. ఈ జూలై నెలలో మేము ఉత్పత్తిని సగం తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇక వచ్చే ఆగస్టు నెలలో అయితే, ఒక్క ఎలక్ట్రిక్ వాహనాన్ని కూడా తయారు చేయలేకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇది నిజమైతే, మేము మార్కెట్‌లో మా మార్కెట్ షేర్ ఆదాయాన్ని చాలా కోల్పోతాము" అని ఆందోళనగా చెప్పారు.

భారతదేశంలో త్వరలో పండుగలు వస్తున్నాయి. ఈ టైంలో కార్లు, బైక్‌ల అమ్మకాలు పెరుగుతాయి. అలాంటి ముఖ్యమైన టైంలో ఉత్పత్తి ఆగిపోవడం బజాజ్‌కు చాలా నష్టం కలిగిస్తుంది.
ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎలక్ట్రిక్ మోటార్ చాలా ముఖ్యం. ఈ మోటార్లు చాలా శక్తివంతమైన మాగ్నెటిక్ శక్తితో పనిచేస్తాయి. ఈ మాగ్నైట్స్ తయారు చేయడానికే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనే ముడిసరుకు అవసరం. వీటిలో ఎక్కువ భాగం చైనాలోనే ఉత్పత్తి అవుతాయి. చైనా ఇప్పుడు వీటిని అమ్మకుండా నిషేధించడంతో మిగతా దేశాల్లోని ఈవీ తయారీదారులు చాలా కష్టపడుతున్నారు.
"చైనా కాకుండా వేరే దేశాల నుంచి ఈ ముడిసరుకును తెచ్చుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అయితే, క్వాలిటీ, ధర రెండింటినీ సరిచూసుకోవాలి. దీనికి ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచిస్తున్నాం" అని రాజీవ్ బజాజ్ చెప్పారు.
బజాజ్ కంపెనీ ప్రస్తుతం 'చేతక్' అనే బ్రాండ్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్లను, అలాగే కోకో అనే బ్రాండ్‌తో ఎలక్ట్రిక్ ఆటోలను కూడా తయారు చేస్తోంది. ఈ ముడిసరుకు కొరత వల్ల ఈ రెండు బ్రాండ్ల ఉత్పత్తి కూడా ఆగిపోయే అవకాశం ఉంది. చైనా విధించిన ఈ నిషేధం ప్రపంచంలోని వాహనాల తయారీదారులందరికీ ఇబ్బందులు సృష్టిస్తోంది.
భారతదేశంలోని చాలా కంపెనీలు ఇప్పటికే వేరే మార్గాలను వెతుకుతున్నాయి. బజాజ్ కూడా ఈ సమస్య నుంచి త్వరలోనే బయటపడి మళ్లీ ఉత్పత్తిని మొదలుపెడుతుందని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications








