No Helmet No Petrol: ఆగస్టు 1 నుంచి హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పోయరు.. రూల్ బ్రేక్ చేస్తే జైలు శిక్ష!
భారతదేశంలో రోడ్డుప్రమాదాల కారణంగా ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషాదకరంలో అత్యధికంగా ప్రాణనష్టం జరగడం టూవీలర్ వాహనదారులకే సంబంధించినది. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా బైక్‌లు నడిపే వారు ప్రమాదంలో పడే అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. కేంద్రం, రాష్ట్రాలు ఎన్ని సూచనలు ఇచ్చినా కొంతమంది మాత్రం హెల్మెట్ ధరించడాన్ని లైట్‌గా తీసుకుంటున్నారు. ఈ తరహా నిర్లక్ష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఇప్పుడు మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అందులో భాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇందోర్ జిల్లా యంత్రాంగం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ నిబంధనలపట్ల ప్రజల్లో బాధ్యతాభావం పెంపొందించాలన్న ఉద్దేశంతో, "హెల్మెట్ లేకుంటే పెట్రోలు లేదు (No helmet no petrol)" అనే వినూత్న విధానాన్ని అమలు చేయబోతున్నారు.
ఈ చర్యను ఆగస్టు 1వ తేదీ నుంచే అధికారికంగా అమలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ రోజు నుంచి హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంక్ వద్దకు వచ్చే టూవీలర్ వాహనదారులకు ఇక ఫ్యూయల్ నింపరు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ పంపుల యజమానులకు అధికారాలు ఇప్పటికే తగిన ఆదేశాలు జారీ చేశారు. ఇది జీవితాలను రక్షించేందుకు తీసుకున్న ఒక ముందు జాగ్రత్త చర్య.

హెల్మెట్ ధరించడం వలన ప్రమాద సమయంలో తలకే ప్రధానమైన రక్షణ లభిస్తుంది. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం వల్ల మన జీవితమే కాదు, మన కుటుంబానికి కూడా భద్రత కలుగుతుంది అనే సందేశాన్ని ఈ చర్య ద్వారా స్పష్టంగా ఇవ్వాలనుకుంటున్నారు అధికారులు. ఇందుకు తోడు, ఇలాంటి విధానాలు ఇతర ప్రాంతాల్లోనూ అమలవుతే రోడ్డుప్రమాదాల్లో మరణాల రేటు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
మంగళవారం జరిగిన ఒక కీలక సమావేశంలో సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్‌గా ఉన్న మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే (రిటైర్డ్) ముఖ్యమైన సూచనలు చేశారు. రోడ్డు భద్రతను మెరుగుపర్చడం, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడం అన్నదే లక్ష్యంగా ఆయన జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో అధికారులు తాజా ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ ఆదేశాల్లో ప్రధానంగా రెండు అంశాలపై దృష్టి సారించారు.

మొదటిది, టూవీలర్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం. రెండవది, కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ ధరించడాన్ని అలవర్చుకోవాలి. ఈ రెండింటినీ కేవలం చట్టబద్ధమైన నిబంధనలుగా కాకుండా, ఒక భద్రతా చర్యగా ప్రజలు అంగీకరించేలా చేయాలని ఆయన కోరారు. ఈ ఉద్దేశంతో ఇండోర్ జిల్లాలో త్వరలోనే ఓ విస్తృత ప్రచార కార్యక్రమం ప్రారంభించనున్నారు.
రోడ్లపై హెల్మెట్ లేకుండా టూవీలర్ నడిపే వారిలో బాధ్యత పెరిగేలా, అలాగే కారులో ముందు మాత్రమే కాదు, వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణీకులు కూడా సీట్ బెల్ట్ ధరించేలా అవగాహన కల్పించడమే ఈ ప్రచార ఉద్దేశ్యం. జస్టిస్ సప్రే సూచనల ప్రకారం, ప్రచారం కేవలం ప్రభుత్వం లేదా పోలీసు విభాగం మాత్రమే చేయకూడదని, సామాజిక సంస్థలు, విద్యా సంస్థలు, మీడియా వంటి వర్గాలూ కలిసి ప్రజల్లో భద్రతపై చైతన్యం కలిగించాలన్నారు.

ఇది సమాజం మొత్తానికి సంబంధించిన విషయంలో ప్రతి ఒక్కరి పాత్ర ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. పెట్రోల్ బంకులు ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే.. ఏడాది జైలు శిక్ష లేదా రూ.5వేల జరిమానా లేదా రెండూ పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇందౌర్ అధికారులు ఇప్పటికే చర్యలు ప్రారంభించగా, రాబోయే రోజుల్లో ఈ విధానం ఇతర జిల్లాల్లోనూ, రాష్ట్రాల్లోనూ అమలవుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.


Click it and Unblock the Notifications








