లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు..సైకిల్ లా తొక్కండి.. బైక్ లా దూసుకుపోండి..మార్కెట్లోకి సరికొత్త ఈ-సైకిల్
భారతదేశంలో ఎలక్ట్రిక్ సైకిల్స్‌కు పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, ప్రముఖ ఎలక్ట్రిక్ సైకిల్ కంపెనీ ఇమొటోరాడ్ ఒక సరికొత్త వాహనాన్ని విడుదల చేసింది. అదే అడ్వెంచర్ రేంజర్ ఈ-సైకిల్. ఇది ఇమొటోరాడ్ నుండి వస్తున్న మొదటి మోటో-స్టైల్ ఎలక్ట్రిక్ సైకిల్. దీని ధర కేవలం రూ.55,999 మాత్రమే.
ఇప్పుడు ఈ రేంజర్ ఈ-సైకిల్ ఇమొటోరాడ్ డీలర్‌షిప్‌లతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా అందుబాటులో ఉంది. బైక్, ఈ-సైకిల్ రెండింటి లక్షణాలను కలిపి, డిఫరెంట్ వెహికల్ కోసం చూస్తున్న వాళ్లకు ఈ రేంజర్ బెస్ట్ ఆప్షన్ అని కంపెనీ చెబుతోంది.

కంపెనీ విడుదల చేసిన ప్రెస్‌రిలీజ్ ప్రకారం.. ఈ రేంజర్ బైక్, ఈ-సైకిల్ రెండింటి కలయిక. ఇది దూకుడుగా కనిపించే డిజైన్, లావుపాటి టైర్లు, థ్రాటిల్‌ను కలిగి ఉంది. దీనికి అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా, దీనికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు, రిజిస్ట్రేషన్ చేయించాల్సిన పని లేదు. పెట్రోల్ పోయాల్సిన అవసరం కూడా లేదు.
ఇవన్నీ లేకపోయినా, ఒక మోటార్‌సైకిల్ నడుపుతున్న అనుభూతిని ఇది ఇస్తుంది. అంటే, బైక్ నడపడానికి ఉన్న తలనొప్పులు లేకుండా దాని మజాను పొందవచ్చు అన్నమాట. అడ్వెంచర్ రేంజర్ ఈ-సైకిల్ ప్రత్యేకతలను చూస్తే ఇది మోటో-స్టైల్ డిజైన్‌తో స్ట్రాంగ్ హై-టెన్సైల్ స్టీల్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. ఇది ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. ఇందులో 7-స్పీడ్ షిమానో గేర్‌లు ఉన్నాయి.

ఇవి మీకు ఎలాంటి భూభాగంలోనైనా సులభంగా ప్రయాణించే వెసులుబాటును ఇస్తాయి. ఈ ఈ-సైకిల్‌లో 48V 12.75Ah రిమూవబుల్ బ్యాటరీ ఉంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 75 కి.మీ.ల వరకు ప్రయాణించవచ్చు. థ్రాటిల్ సహాయంతో అయితే 60 కి.మీ.ల వరకు వెళ్లగలదు.
దీనికి క్లస్టర్ C6+ డిస్‌ప్లే ఉంది, ఇది రైడింగ్ చేసేటప్పుడు అవసరమైన సమాచారాన్ని స్పష్టంగా చూపిస్తుంది. డబుల్ క్రౌన్ సస్పెన్షన్ (120mm ట్రావెల్) ఉండటం వల్ల, గుంతలు, ఎత్తుపల్లాల రోడ్లు లేదా ఆఫ్-రోడ్ మార్గాల్లో కూడా సులభంగా ప్రయాణించవచ్చు. ఇది రైడింగ్‌ను మరింత సుఖంగా చేస్తుంది. ఈ బైక్ 110 కేజీల వరకు బరువును మోయగలదు.

5.4 అడుగుల లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న వారికి ఇది చాలా బాగా సరిపోతుంది. ఇమొటోరాడ్ తన కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవడానికి, ఈ రేంజర్ ఈ-సైకిల్‌కు 5 సంవత్సరాల ఫ్రేమ్ వారెంటీని అందిస్తోంది. ఇది ఈ బైక్ క్వాలిటీ పై కంపెనీకి ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది.
ఈ రేంజర్ ఈ-సైకిల్ ఇప్పుడు రూ.55,999 ధర వద్ద దేశవ్యాప్తంగా ఉన్న ఇమొటోరాడ్ డీలర్‌షిప్‌లలో, అలాగే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది.
భారతదేశంలోనే తయారైన ఈ రేంజర్ ఈ-సైకిల్, మారుతున్న వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా రూపొందించబడింది. ఇది స్కూటర్లు, పెట్రోల్ బైక్‌లకు ఒక చక్కటి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. ఇది స్మార్ట్‌గా, స్టైలిష్‌గా, ఆధునిక సాంకేతికతతో కూడినది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర ఈ-సైకిల్‌ల కంటే ఇది చాలా మెరుగైనదని కంపెనీ చెబుతోంది.
ఈ రేంజర్ ఈ-సైకిల్‌లో మంచి గ్రిప్ కోసం లావుపాటి 20 అంగుళాల టైర్లు ఉన్నాయి. సుఖవంతమైన ప్రయాణం కోసం డబుల్ క్రౌన్ సస్పెన్షన్ కూడా ఉంది. ఇది నగర రోడ్లతో పాటు, గుంతలు ఉన్న రోడ్లపై కూడా సులభంగా ప్రయాణించగలదు. సౌకర్యం, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడిన ఈ రేంజర్ ఈ-సైకిల్, కొత్త తరం యువతకు ఒక ఆకర్షణీయమైన ఎంపిక.
ఇమొటోరాడ్ సీఈవో కునాల్ గుప్తా మాట్లాడుతూ, "ఈ వాహనం వినోదం, పనితీరు మధ్య రాజీ పడకూడదు అనుకునే వారి కోసం రూపొందించబడింది. రేంజర్ మోటార్‌బైక్ లా కనిపిస్తుంది, కానీ ఈ-సైకిల్ లా నడుస్తుంది. ఇది థ్రిల్లింగ్ అనుభవాన్ని ఇస్తూనే, ఎలక్ట్రిక్‌గా ఉండాలనే మా నమ్మకాన్ని నిలబెట్టుకుంటుంది" అని అన్నారు.


Click it and Unblock the Notifications








