పైసా ఖర్చు లేకుండా 100కిమీ. వెళ్లొచ్చు.. లక్ష లోపే దొరికే అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే !

భారతదేశంలో టూ వీలర్ మార్కెట్ చాలా వేగంగా పెరుగుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో వాహనాలు అమ్ముడవుతున్నాయి. మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలు ఎక్కువగా బైకులు లేదా స్కూటర్లపై ఆధారపడుతున్నారు. ఇలాంటి వాళ్లు రోజూవారీ పనులకు పెట్రోల్ వాహనాలు వాడకుండా, డబ్బు ఆదా చేసే ఎలక్ట్రిక్ బైకులను వాడొచ్చు.

పెట్రోల్ ఖర్చు లేకుండా రోజుకు మూడు గంటలు ఛార్జ్ చేస్తే ఒక్క పైసా ఖర్చు లేకుండా 100కి.మీ. దూరం వెళ్లొచ్చు. అలాంటి టాప్-4బైకుల గురించి వివరంగా తెలుసుకుందాం. దేశంలో పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారుచేసే కంపెనీ ఓలా ఎలక్ట్రిక్, ఇప్పుడు మోటార్‌సైకిల్ సెగ్మెంట్లోకి కూడా అడుగుపెట్టింది. కంపెనీ ఇటీవల పరిచయం చేసిన 'ఓలా రోడ్‌స్టర్ ఎక్స్' ధర రూ.99,999(ఎక్స్-షోరూమ్).

Ola Roadstar

ఈ బైక్‌లో 2.5కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి ఈ బైక్‌ను పూర్తిగా ఛార్జ్ చేస్తే 140కి.మీ. దూరం వెళ్లొచ్చు. ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ బైక్‌లో 7కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ బైక్ కేవలం 3.4 సెకన్లలో 40 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఓలా ఎలక్ట్రిక్ ఈ కొత్త బైక్ బ్యాటరీపై 3 సంవత్సరాలు లేదా 50,000 కి.మీ. వారంటీని ఇస్తోంది. ఇది 6.2గంటల్లో 80% ఛార్జ్ అవుతుంది.

ఈ మోటార్‌సైకిల్ 2.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 110 కి.మీ. దూరం వెళ్లొచ్చు. దీనికి 8 సంవత్సరాలు లేదా 80,000 కి.మీ. బ్యాటరీ వారంటీ ఉంది. కేవలం 2 గంటల్లోనే 80% వరకు ఛార్జ్ అవుతుంది. భారతదేశంలో దీని ధర రూ.90,000 (ఎక్స్-షోరూమ్).

Revolt

రివోల్ట్ మోటార్స్ కంపెనీకి చెందిన ఆర్‌వీ1 బైక్ కేవలం రూ.90,000 (ఎక్స్-షోరూమ్) ధరలో లభిస్తుంది. ఈ బైక్‌లో 2.2 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 100 కి.మీ. దూరం వెళ్లొచ్చు. కేవలం 2 గంటల 15 నిమిషాల్లో 80% ఛార్జ్ అవుతుంది.

రివోల్ట్ ఆర్‌వీ1 మోటార్‌సైకిల్‌లో పవర్ ఫుల్ 2.8 కిలోవాట్ మోటార్ అమర్చారు. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్, బ్యాటరీపై 5 సంవత్సరాలు లేదా 75,000 కి.మీ. వారంటీని ఇస్తోంది. ఛార్జర్‌పై కూడా 2 సంవత్సరాల వారంటీ ఉంది.

Oben Rorr

ప్యూర్ ఈవీ కంపెనీకి చెందిన ఈకో డ్రిఫ్ట్ జడ్ బైక్‌లో 3 కిలోవాట్ బ్యాటరీ ఉంది. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేస్తే 140 కి.మీ. దూరం వెళ్లొచ్చు. ఇది 3 గంటల్లో 80%, 6 గంటల్లో 100% ఛార్జ్ అవుతుంది. దీని ధర రూ.99,999 (ఎక్స్-షోరూమ్). డ్రైవ్, క్రాస్‌ఓవర్, థ్రిల్ అనే మూడు రైడ్ మోడ్‌లను ఇది కలిగి ఉంది.

తక్కువ ధర, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, అన్నింటికంటే ముఖ్యంగా పెట్రోల్ ఖర్చు లేకపోవడంతో ఈ ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్‌లో చాలా వేగంగా దూసుకుపోతున్నాయి. మార్కెట్‌లో ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు అన్నీ లక్ష లోపు ధరలో లభించే అత్యంత బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు కాబట్టి, కస్టమర్లకు ఇవి బెస్ట్ ఆప్షన్లుగా నిలుస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Sunday, June 22, 2025, 9:38 [IST]
English summary
No petrol costs top 4 electric bikes under rs 1 lakh for smart riders
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+