టూవీలర్స్‌పై టోల్ ఛార్జీలు? అసలు నిజం ఇదే! నితిన్ గడ్కరీ, NHAI ఇచ్చిన క్లారిటీ

సాధారణంగా దేశంలో టూవీలర్ వాహనాలపై ఎలాంటి టోల్ ఛార్జీలు ఉండవు. అయితే కొన్ని మీడియా సంస్థలు ఇటీవల టూవీలర్స్‌పై కూడా టోల్ ఛార్జీలు విధించారని కథనాలను ప్రచురించాయి. ఈ వార్తలు టూవీలర్స్‌ను వాడే కోట్లాది మంది వినియోగదారుల మధ్య గందరగోళాన్ని సృష్టించాయి. తాజాగా ఈ వార్తలను భారత జాతీయ రహదారుల అథారిటీ (NHAI) స్పష్టంగా ఖండించింది. టూవీలర్ వాహనాలపై టోల్ ఛార్జీలకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో లేదని, ద్విచక్ర వాహనాలపై టోల్ పన్ను మినహాయింపు పూర్తిగా అమలులో కొనసాగుతుందని NHAI ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. మీడియా కథనాల ద్వారా ప్రజల్లో అపోహలు ఏర్పడుతున్నాయని, అలాంటి వాదనలకు ఎలాంటి నిజమైన ఆధారం లేదని వివరించింది.

అంతేకాకుండా, ఈ అంశంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ కూడా సోషల్ మీడియా వేదికల ద్వారా మరింత స్పష్టతతో చెప్పారు. టూవీలర్ వాహనాలపై టోల్ పన్ను విధించడం గురించి కొన్ని మీడియా సంస్థలు తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేస్తున్నాయి. అలాంటి నిర్ణయం ఏదీ ప్రతిపాదించబడలేదు. ద్విచక్ర వాహనాలకు టోల్ పన్ను మినహాయింపు కొనసాగుతుంది అని ఆయన తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.

No Toll Tax On Two Wheelers Union Minister Nitin Gadkari

నిజాన్ని ధృవీకరించకుండా కేవలం సంచలనం కోసం ఇలాంటి వాదనలను పంచుకోవడం జవాబుదారీతనం కలిగిన జర్నలిజానికి విరుద్ధమని గడ్కరీ తీవ్రంగా అభిప్రాయపడ్డారు. ఈ తరహా వార్తలను తాను ఖండిస్తున్నానని కూడా స్పష్టం చేశారు. అందువల్ల, బైక్ యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టూవీలర్ వాహనాలపై ఎటువంటి కొత్త టోల్ చార్జీలు విధించబడడం లేదు. మున్ముందు ఇటువంటి వార్తలపై ఖచ్చితమైన ఆధారాల ద్వారా ధృవీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇలా ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం రావడంతో, దేశవ్యాప్తంగా టూవీలర్ కలిగిన వారు ఊపిరి పీల్చారు. ఇకపై ఎలాంటి టోల్ చార్జీలు బైకులపై విధించబడవు అని అధికారికంగా సమాచారం అందుకున్న తర్వాత, ప్రజల్లో ఆందోళనకు స్వస్తి పలికినట్లయింది. దీని గురించిన పూర్తి వివరాలను ఒకసారి చూసినట్లయితే జులై 15 నుంచి దేశంలోని జాతీయ రహదారులపై టూవీలర్స్‌కు టోల్ చార్జీలు వసూలు చేస్తారని కొన్ని జాతీయ మీడియా కథనాలు రాశాయి.

ఈ వార్తలతో బైక్ యజమానులు, సాధారణ ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన మొదలైంది. ఇప్పటివరకు కేవలం ఫోర్ వీలర్లు, పెద్ద వాహనాలకే టోల్ వసూలు చేస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు టూవీలర్స్‌పై కూడా ఆర్థిక భారం మోపుతుందా? అనే ప్రశ్నలు నెటిజన్ల మధ్య చర్చకు దారి తీసాయి. సోషల్ మీడియాలో కొంతమంది కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించగా, మరికొందరు ఈ నిర్ణయాన్ని అన్యాయంగా పేర్కొన్నారు.

ఈ అపోహలకు తెరదించేందుకు, కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ఎక్స్ వేదికగా చాలా స్పష్టంగా స్పందించారు. అలాంటి ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో పెట్టలేదు. ఇప్పటిలానే బైకులకు టోల్ మినహాయింపు కొనసాగుతుంది అని ఆయన చెప్పారు. ఇదే విషయాన్ని భారత జాతీయ రహదారుల అథారిటీ (NHAI) కూడా అధికారిక ప్రకటన ద్వారా ధృవీకరించింది.

Toll Tax On Two Wheelers

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, June 27, 2025, 12:14 [IST]
English summary
No toll tax on two wheelers union minister nitin gadkari and nhai clarified
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+