కేటీఎం బైక్ కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి.. ఇంతకంటే బెస్ట్ ఆఫర్ మళ్లీ జన్మలో రాదు - త్వరపడండి
ప్రస్తుతం దేశంలో ద్విచక్రవాహనాలకు డిమాండ్ బాగా పెరిగిపోతుంది. దాదాపు ప్రతి ఒక్కరికీ ఇవి కనీసం అవసరంగా మారిపోయాయి. గతంలో కుటుంబానికి ఒక్క బైక్ ఉంటే సరిపోయేది. కానీ ప్రస్తుం పరిస్థితి మారిపోయింది. మహిళలు కూడా ఉద్యోగాల చేస్తుండడంతో వారికీ బైక్, కార్లు అవసరం అయిపోయాయి. అంతే కాకుండా కాలేజీ వెళ్లే పిల్లలకు కూడా బైక్ తప్పనిసరి అయింది. దీంతో అనేక కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి దించుతున్నాయి కంపెనీలు.
గత కొన్నేళ్లుగా ఇండియన్ మార్కెట్లో స్పోర్ట్స్ బైకులను డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో వివిధ కంపెనీలు అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో లేటెస్ట్ వేరియంట్లను లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా కేటీఎం కంపెనీ రిలీజ్ చేసిన అడ్వెంచర్ బైక్స్‌కు మంచి స్పందన వస్తోంది. ఆన్-రోడ్, ఆఫ్-రోడ్ రైడింగ్ కోసం వీటిని యువత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ బైక్స్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.

ఒకటి 390 అడ్వెంచర్ X కాగా, మరొకటి 390 అడ్వెంచర్ S. కంపెనీ తాజాగా దీనికి లేటెస్ట్ వెర్షన్ '2025 కేటీఎం అడ్వెంచర్ ఎస్'లాంచ్ చేసింది. వాస్తవానికి కేటీఎం అనేది ఆస్ట్రియాకు చెందిన ప్రపంచంలోని ప్రముఖ బైక్ కంపెనీ. ఇది భారతదేశంలో బజాజ్ ఆటోతో భాగస్వామ్యంతో పని చేస్తుంది. 2012 లో ఇండియాలో కేటీఎం విడుదల చేసిన మొదటి బైక్ 200 డ్యూక్.
అప్పటి నుండి మన దేశంలో వివిధ మోడళ్ల కేటీఎం బైక్‌లు లాంచ్ అయినప్పటికీ మొదటి బైక్‌గా 200 డ్యూక్ ఎల్లప్పుడూ కేటీఎంకు స్పెషలే. అందుకే కేటీఎం 200 డ్యూక్ బైక్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంది. 200 డ్యూక్ బైక్ అమ్మకాలను పెంచే ప్రయత్నంలో భాగంగా ఎప్పటికప్పుడు ఆఫర్లు, గిఫ్ట్స్ లను ప్రకటిస్తుంది. ఆ విషయంలో 200 డ్యూక్ బైక్‌లను కొనుగోలు చేసే కస్టమర్లకు ఫ్రీ రైడింగ్ జాకెట్ అందిస్తున్నట్లు ప్రకటించింది.

కేటీఎం రైనాక్స్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని, 200 డ్యూక్ బైక్‌లను కొనుగోలు చేసే వారికి రైనాక్స్ సైఫర్ జీటీ అనే ఉచిత రైడింగ్ జాకెట్‌ను అందిస్తోంది. కేటీఎం 200 డ్యూక్ బైక్ ఎక్స్-షోరూం ధరలు రూ. 2.06 లక్షల నుండి ప్రారంభమవుతాయి. దీనికి LED హెడ్‌లైట్లు టెయిల్‌లైట్లతో నిర్మించబడిన 200 డ్యూక్, హ్యాండిల్‌బార్‌లపై 5ఇంచుల స్క్రీన్‌తో వస్తుంది. దీని వలన రైడర్ వారికి అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు.
స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయగల ఈ స్క్రీన్, మీ మొబైల్ ఫోన్‌లో కాల్‌లను లిఫ్ట్ చేసేందుకు, మ్యూజిక్ వినేందుకు, ట్రావెల్ రూట్లను తెలుపుతుంది. కేటీఎం బైక్ ను మై-రైడ్ మొబైల్ యాప్‌కి కనెక్ట్ చేసి ఉండాలి. ఈ డిస్‌ప్లేను కంట్రోల్ చేసేందుకు 4 బటన్లు హ్యాండిల్‌బార్‌ల దగ్గర అందించబడ్డాయి. కేటీఎం ఈ డిస్‌ప్లేను 3వతరం 390 డ్యూక్ బైక్ నుంచి స్వీకరించింది. ఇటీవల దీనిని 200 డ్యూక్ బైక్‌కు ఇంట్రడ్యూస్ చేసింది.

200 డ్యూక్ 199.5cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌కి జతచేయబడి 10వేల rpm వద్ద గరిష్టంగా 24.68 bhp పవర్, 8,000rpm వద్ద 19.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేటీఎం 250 డ్యూక్, 390 డ్యూక్ లాగా స్ప్లిట్ ట్రేల్లిస్ ట్యూబులర్ ఫ్రేమ్‌పై రూపొందించిన కేటీఎం 200 సస్పెన్షన్ కోసం ఫ్రంట్ 43mm UST ఫోర్క్స్, బ్యాక్ 10-వే అడ్జస్టబుల్ మోనోషాక్‌ను పొందుతుంది.
ఈ కేటీఎం 200 డ్యూక్ ఫ్రంట్ 300mm డిస్క్, బ్యాక్ 230mm డిస్క్‌ను అందించింది. ప్రయాణీకుల భద్రత కోసం డ్యూయల్-ఛానల్ ABS లేదా సూపర్‌మోటో ABS అని పిలువబడే సింగిల్-ఛానల్ ABSతో కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








