రూ.65 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. మార్కెట్లో తుఫాను రేపబోతున్న సరికొత్త సంచలనం!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన విప్లవం వేగంగా దూసుకుపోతున్న ఈ కాలంలో, కొత్తగా ఆవిష్కృతమైన న్యూమెరోస్ మోటార్స్ n-ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అందరి దృష్టిని ఆకర్షించింది. దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన స్టార్టప్‌లలో ఒకటైన న్యూమెరోస్ మోటార్స్, తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ N-ఫస్ట్ లాంచ్ ద్వారా ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. బెంగళూరులో అత్యంత గ్రాండ్‌గా నిర్వహించిన ఈ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా, కంపెనీ తన దృష్టిని స్పష్టంగా చూపించింది, స్మార్ట్ డిజైన్, సుస్థిర టెక్నాలజీ, అందరికీ అందుబాటులో ఉండే ధరతో దీనిని తెచ్చింది. ఈ స్కూటర్ ధరను మొదటి 1,000 మంది కస్టమర్లకు రూ.64,999 పరిచయ ధరగా నిర్ణయించడం ద్వారా, న్యూమెరోస్ భారతీయ వినియోగదారులకు ఎలక్ట్రిక్ వాహనాన్ని మరింత చేరువ చేసింది.
ఈ స్కూటర్ డిజైన్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది మోటార్ సైకిల్ రఫ్ & రోడ్ ప్రెజెన్స్, స్కూటర్ సౌకర్యాన్ని సమన్వయం చేస్తుంది. ఇటాలియన్ డిజైన్ సంస్థ వీలాబ్ (Weelab) సహకారంతో రూపొందించిన ఈ వాహనం యూరోపియన్ ఎలిగెన్స్, ఇండియన్ రోడ్ల రియాలిటీ రెండింటినీ మిళితం చేసిన ప్రత్యేకమైన శైలిని అందిస్తుంది. దీని బాడీ లైన్‌లు క్లీన్‌గా ఉండి, స్పోర్టీ అటిట్యూడ్‌తో పాటు ఫ్యూచరిస్టిక్ టచ్‌ను కలిగి ఉన్నాయి.

ఇది మోటార్‌సైకిల్‌ల స్థిరత్వాన్ని కలిగి ఉండి, నగరంలో రోజూ ప్రయాణాలకు అవసరమైన సౌలభ్యాన్ని ఇస్తుంది. శక్తివంతమైన మోటార్, సమతుల్య బ్యాటరీ సెటప్, స్మార్ట్ ఫీచర్లతో ఈ స్కూటర్ యువత, అర్బన్ రైడర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఇది మొత్తంగా మూడు వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఒక్కో వేరియంట్ వివిధ బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. రైడింగ్ పరిస్థితులకు అనుగుణంగా నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు.
న్యూమెరోస్ మోటార్స్ ఆవిష్కరించిన n-ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ N-ఫస్ట్ మ్యాక్స్, N-ఫస్ట్ ఐమ్యాక్స్, N-ఫస్ట్ ఐమ్యాక్స్+ లలో లభిస్తుంది. ఈ మూడు వేరియంట్లు విభిన్న వినియోగదారుల అవసరాలను తీర్చేలా డిజైన్ చేయబడ్డాయి, బ్యాటరీ సామర్థ్యం నుంచి రేంజ్ వరకు ప్రతిదీ భిన్నంగా ఉంటుంది. మొదటి వేరియంట్ n-ఫస్ట్ మ్యాక్స్, 2.5kWh సామర్థ్యం గల బ్యాటరీతో వస్తుంది. అదే విధంగా, n-ఫస్ట్ ఐమ్యాక్స్ కూడా అదే 2.5kWh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఈ రెండు మోడళ్లలో ఉన్న ముఖ్యమైన లిక్విడ్ ఇమ్మర్షన్-కూల్డ్ లిథియం-అయాన్ బ్యాటరీలతో వస్తాయి. ఈ సాంకేతికత బ్యాటరీ ఉష్ణోగ్రతను నియంత్రించి, దీర్ఘకాలిక పనితీరు, భద్రతను నిర్ధారిస్తుంది. కంపెనీ ప్రకారం, ఈ రెండు వేరియంట్లు పూర్తి ఛార్జ్‌పై 91 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తాయి. ఇది నగర ప్రయాణాలకు, రోజువారీ వాడుకకు సరిపోయే సమతుల్య రేంజ్. n-ఫస్ట్ ఐమ్యాక్స్+ విషయానికి వస్తే, ఇది మరింత శక్తివంతమైన 3.0kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.
దీని రేంజ్ IDC సర్టిఫికేషన్ ప్రకారం 109 కిలోమీటర్లు, అంటే ఒకసారి ఛార్జ్ చేస్తే సిటీ రైడ్స్‌తో పాటు దూర ప్రయాణాలకు కూడా సరిపోతుంది. ఛార్జింగ్ 2.5kWh బ్యాటరీ ఉన్న మోడళ్లకు 5 నుండి 6 గంటలు, 3.0kWh వేరియంట్‌కి 7 నుండి 8 గంటలు పడుతుంది. అంటే, రాత్రికి ఒకసారి ఛార్జ్ చేస్తే, ఉదయం పూర్తి రేంజ్‌తో స్మూత్ రైడ్ చేయవచ్చు.

ఫీచర్స్ విషయానికి వస్తే, లొకేషన్ ట్రాకింగ్, స్కూటర్‌ను ఇతరులు దొంగలించకుండా ఉండటానికి ప్రత్యేక సాంకేతికత, రిమోట్ లాకింగ్,జియో-ఫెన్సింగ్, IoT- ఆధారిత ప్లాట్‌ఫామ్, థర్మల్ మేనేజ్‌మెంట్, ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లకు మద్దతు వంటి పలు ఆప్షన్లు ఉన్నాయి. n-First కోసం బుకింగ్‌లు ప్రస్తుతం కంపెనీ వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








