పెట్రోల్ బంకులకు గుడ్‌బై చెప్పేయండి..156 కిలోమీటర్ల రేంజ్‌తో కొత్త స్కూటర్.. మరో అదిరే ఫీచర్ కూడా
దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేసే న్యూమెరోస్ మోటార్స్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దాని పేరు డిప్లోస్ మ్యాక్స్+(Diplos Max+). ఈ కొత్త స్కూటర్ ఐదు కొత్త అప్‌డేట్‌లతో వచ్చింది. దీని డిజైన్, డ్యూయల్ కలర్ వేరియంట్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. 4.0 kWh కెపాసిటీ గల డ్యూయల్ లిక్విడ్ ఇమ్మర్షన్ కూలింగ్ బ్యాటరీ ప్యాక్, గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగం, 156 కిలోమీటర్ల రేంజ్, అధిక పికప్ దీని ప్రత్యేకతలు.
డిప్లోస్ మ్యాక్స్+ ఫీచర్లు, ధర
ఈ స్కూటర్ బ్లేజ్ రెడ్, పియానో బ్లాక్, వోల్ట్ బ్లూ అనే మూడు ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంది. భద్రత, విశ్వసనీయత, మన్నిక అనే సూత్రాలతో రూపొందించిన ఈ వాహనం కస్టమర్ల వివిధ అవసరాలకు తగినది. ఈ స్కూటర్ బెంగుళూరు ఎక్స్-షోరూమ్ ధర రూ.1,14,999 అని కంపెనీ వెల్లడించింది.

ప్రాక్టికల్ టెస్టింగ్, పర్ఫామెన్స్
కంపెనీ భారతదేశంలోనే అతిపెద్ద ప్రాక్టికల్ టెస్టింగ్ నిర్వహించింది. ఈ టెస్టింగ్‌లో ఇప్పటివరకు 14 మిలియన్ కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించినట్లు కంపెనీ పేర్కొంది. ఏ భారతీయ వాహన తయారీ సంస్థ కూడా ఇంత పెద్ద పరీక్ష చేయలేదు. ఈ స్కూటర్ వివిధ భౌగోళిక ప్రాంతాలలో ప్రయాణించి, అసాధారణమైన భద్రత, విశ్వసనీయత, మన్నికను ప్రదర్శించిందని కంపెనీ తెలిపింది.
డిప్లోస్ ప్లాట్‌ఫారమ్ అధునాతన ఇంజినీరింగ్, నూతన డిజైన్‌తో రూపొందించబడింది. ఇది స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అయ్యి పూర్తి యూజర్ అనుభవాన్ని అందిస్తుంది. ఇందులో అనేక స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 156 కిలోమీటర్ల (IDC) రేంజ్, గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలదు.

సేఫ్టీ ఫీచర్లు
భద్రత విషయానికి వస్తే, ఈ స్కూటర్‌లో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు, హై-పెర్ఫార్మెన్స్ ఎల్‌ఈడీ లైటింగ్, అడ్వాన్సుడ్ స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో దొంగతనం అలారం, జియోఫెన్సింగ్, వెహికల్ ట్రాకింగ్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, దీనిలో ఉన్న ఛాసిస్, బ్యాటరీ, మోటార్, కంట్రోలర్ వంటి భాగాలు చాలా కాలం పాటు బెస్ట్ పర్ఫామెన్స్ అందించేలా రూపొందించారు.స్క్వేర్ చట్రం, వెడల్పాటి టైర్లు కూడా అన్ని రకాల రోడ్లపైనా మంచి పట్టును ఇస్తాయి.
సేల్స్ నెట్‌వర్క్ విస్తరణ
న్యూమెరోస్ మోటార్స్ కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు తన సేల్స్, సర్వీస్ నెట్‌వర్క్‌ను చురుకుగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఇది 14 నగరాలలో పనిచేస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 50 నగరాల్లో కనీసం 100 డీలర్లను కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త మోడల్‌కు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ లభిస్తుందని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రేయాస్ శిబులాల్ నమ్మకం వ్యక్తం చేశారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








