జనాలు పెట్రోల్ బైకులను వద్దంటున్నారా? కేవలం 6 నెలల్లోనే 1400 యూనిట్లు.. హీరోగా ఎదుగుతోన్న ఓబెన్

బెంగళూరుకు కేంద్రంగా ఉన్న ఓబెన్ ఎలక్ట్రిక్ (oben electric) అనే స్టార్టప్, భారతదేశపు పెట్రోల్ బైక్ మార్కెట్‌ను మెల్లగా మలుపుతిప్పే ప్రయత్నం చేస్తోంది. కొత్త డిజైన్, అధునాతన ఫీచర్లు, మెరుగైన పనితీరుతో ఇది నగర ప్రాంతాల యువతను ఆకట్టుకుంటోంది. ప్రత్యేకంగా 150cc, 125cc ICE సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని అభివృద్ధి చేసిన రోర్, రోర్ EZ అనే రెండు అర్బన్ కమ్యూటర్ ఈ-బైక్‌లు మార్కెట్‌లో శరవేగంగా జోరు పెంచుకుంటున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, జూలై 10, 2023న తన మొదటి బ్యాచ్ బైకులను డెలివరీ చేసిన సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత 2,077 యూనిట్లు అమ్ముడవడం ఓబెన్ ఎలక్ట్రిక్‌కు మంచి విజయాన్ని ఇచ్చింది. ఈ మొత్తంలో జనవరి 1 నుంచి జులై 9, 2025 మధ్య 1,443 యూనిట్లు ఉన్నాయి.

150cc ICE బైకును కొనాలనుకునే వారికి ఇవి సరైన ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. పెట్రోల్ ఖర్చులు పెరుగుతున్న సమయంలో, ఓబెన్ మోడళ్లకు ఉన్న తక్కువ రన్నింగ్ ఖర్చులు మరింత ఆదాయాన్ని కాపాడేలా ఉంటాయి. అంతేకాదు, దీని ఆధునిక లుక్, స్మార్ట్ కనెక్టివిటీ వంటి ఫీచర్లతో యువత రైడింగ్‌లో సరికొత్త అనుభూతిని పొందుతారు. ఓబెన్ రోర్, రోర్ EZ మోడళ్ల ద్వారా ఎలక్ట్రిక్ బైక్ విభాగంలో ఓబెన్ దూసుకుపోతుంది.

Oben Electric Sold 1400 Motorcycles

ముఖ్యంగా ఒబెన్ రోర్ EZ ప్రజల్లో మంచి ఆదరణ సంపాదించింది. దీని గురించి చూసినట్లయితే, రోర్ EZ 2.4 kWh, 3.4 kWh, 4.4 kWh అనే మూడు బ్యాటరీ ప్యాక్‌లలో లభిస్తుంది. ఎంట్రీ లెవల్ 2.4 kWh వెర్షన్ ధర రూ.89,999 మాత్రమే(ఎక్స్-షోరూమ్). ఈ వెర్షన్‌లో 45 నిమిషాల ఛార్జింగ్‌తో దాదాపు 110 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు, ఇది రోజువారీ ప్రయాణికులకు అనువుగా ఉంటుంది.

మిడిల్ వేరియంట్ అయిన 3.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే మోడల్ ధర రూ.1.09 లక్షలు. ఇది 140 కి.మీ. రేంజ్‌ను అందించడమే కాకుండా, బ్యాటరీను పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం 1.30 గంటలే సరిపోతుంది. ఇది వేగంగా ఛార్జ్ అవుతూ, ఎక్కువ దూరం వెళ్లగల బైక్ కావడం విశేషం. టాప్-ఎండ్ వేరియంట్ అయిన 4.4 kWh బ్యాటరీ వెర్షన్ ధర రూ.1.19 లక్షలు.

Oben Electric Sold 1400 Motorcycles In January To July 2025

ఇది ఒక్క ఛార్జ్‌తో 175 కి.మీ. వరకు ప్రయాణించగలదు, ఛార్జింగ్ టైం 2 గంటలే. ఈ వెర్షన్ ప్రధానంగా ఎక్కువ దూరం ప్రయాణించే వారికి, లేదా శక్తివంతమైన పనితీరు కోరుకునే వారికి అద్భుతమైన ఎంపిక. ఎలక్ట్రిక్ బైక్‌గా, ఒబెన్ రోర్ EZ మూడు వేరియంట్‌లు వినియోగదారుల విభిన్న అవసరాలను తీర్చగల సామర్థ్యం కలిగివున్నాయి. డైలి యూజర్స్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ బైక్, సాధారణ అవసరాలను మించిన పనితీరుతో ఆకట్టుకుంటోంది.

ఇది 7.5 kW శక్తిని, 52 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేసే PMS ఎలక్ట్రిక్ మోటార్‌ను కలిగి ఉంది. మోటార్ సహాయంతో రోర్ ఈజీ కేవలం 3.3 సెకన్లలో 0-40 kmph వేగాన్ని చేరగలదు, ఇది నగర రవాణాకు ఒక గొప్ప స్పోర్టీ స్పందనను అందిస్తుంది. గరిష్ట వేగం గంటకు 95 కి.మీలుగా ఉండటంతో, ఇది సాధారణ కమ్యూటర్ బైక్‌లకంటే కొంచెం అధిక వేగాన్ని కోరుకునే వారికి సరిపోతుంది.

Oben Electric Sales

నిత్య ప్రయాణాల్లో వేగం, సౌకర్యం రెండింటినీ సమానంగా అందించగల సామర్థ్యం ఈ బైక్‌లో ఉంది. ఇది ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ కలిగి ఉంది. బైక్ 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌‌పై నడుస్తుంది, ఇవి స్టైల్‌తో పాటు రోడ్డు గ్రిప్‌ను మెరుగుపరుస్తాయి. ARX ఫ్రేమ్‌ వాడటం వల్ల బైక్‌కు బలం, స్థిరత రెండూ పెరుగుతాయి.

More from DriveSpark

Article Published On: Saturday, July 12, 2025, 11:20 [IST]
English summary
Oben electric sold 1400 motorcycles in january to july 2025 more details inside
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+