100సీసీ సెగ్మెంట్‌లోకి ఓబెన్ ఎలక్ట్రిక్.. రూ.లక్షలోపే ఎలక్ట్రిక్ బైక్.. 'O100'తో మార్కెట్ షేక్ చేయడం ఖాయం

తక్కువ ధరలో మంచి పర్ఫామెన్స్‌తో కూడిన ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తున్నారా ? అయితే మీకో శుభవార్త. బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ ఓబెన్ ఎలక్ట్రిక్, ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా తమ రెండో స్వదేశీ ప్లాట్‌ఫామ్ 'O100'ను ప్రకటించింది.

ఇది కేవలం తక్కువ ధరలో బైక్‌లను అందించడమే కాకుండా, భారతీయ రోడ్లకు అనుగుణంగా తయారు చేయబడింది. ఈ కొత్త ప్లాట్‌ఫామ్, ఓబెన్ విజన్, విస్తరణ ప్రణాళికలు, భవిష్యత్ బైక్‌ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

భారతదేశానికి చెందిన ప్రముఖ స్వదేశీ పరిశోధన, అభివృద్ధి (R&D) ఆధారిత ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ ఓబెన్ ఎలక్ట్రిక్, తమ రెండవ స్థానిక ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ప్లాట్‌ఫామ్ ''O100 (ఓ హండ్రెడ్)''పై పనిచేస్తున్నట్లు ప్రకటించింది.

Oben Electric EV

బెంగళూరులోని ఓబెన్ అత్యాధునిక R&D కేంద్రంలో దీనిని డిజైన్ చేసి, అభివృద్ధి చేశారు. ఈ కొత్త ప్లాట్‌ఫామ్ కంపెనీని 100సీసీ కమ్యూటర్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లోకి తీసుకురానుంది. ఇది భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో దాదాపు 30శాతం వాటాను కలిగి ఉంది.

భారతీయ ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి రూ. లక్షలోపు బడ్జెట్లో కొత్త తరం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లకు శక్తినిచ్చేలా O100 ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు. దీని ద్వారా ఓబెన్ ఎలక్ట్రిక్, విస్తృత శ్రేణి ప్రయాణికుల అవసరాలను తీర్చగల హై క్వాలిటీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను అందించడానికి వీలు కల్పిస్తుందని కంపెనీ చెబుతుంది.

O100 ఒక మాడ్యులర్, వెర్సటైల్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇది బహుళ వేరియంట్లు, విభిన్న బ్యాటరీ ఆప్షన్లు, వివిధ కస్టమర్ విభాగాలకు అనుగుణంగా బైక్‌లను తయారు చేయడానికి అనుమతిస్తుంది. డిజైన్ పరంగా భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే ఈ ప్లాట్‌ఫామ్, కొత్త టెక్నాలజీలు, మౌలిక సదుపాయాల అప్‎గ్రేడ్లను ఇంటిగ్రేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది భారతదేశంలో తక్కువ ధర ఈవీల తయారీకి పునాదిగా నిలుస్తుందని కంపెనీ విశ్వసిస్తుంది.

Oben
ఓబెన్ ఎలక్ట్రిక్ ప్రస్తుతం భారతదేశం అంతటా టైర్ 1, టైర్ 2, టైర్ 3 నగరాల్లో వేగంగా విస్తరిస్తోంది. ఈ సంవత్సరం చివరి నాటికి 100కు పైగా షోరూమ్‌లను తెరవాలని ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ఓబెన్‌కు, దాని డీలర్‌లకు గణనీయమైన వృద్ధిని అందిస్తుంది. ప్రతి స్టోర్‌కు అమ్మకాలను పెంచి, పంపిణీ నెట్‌వర్క్‌కు అద్భుతమైన లాభాలను తెచ్చిపెట్టగలదని భావిస్తున్నారు.

ఓబెన్ మొదటి మోటార్‌సైకిల్ ప్లాట్‌ఫామ్, ARX, పర్ఫామెన్స్ కేంద్రీకృత ఓబెన్ రోర్ (Oben Rorr), రోర్ ఈజెడ్ (Rorr EZ) ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను నడుపుతుంది. ఇది ఉన్నత శ్రేణి పనితీరు, అధునాతన LFP బ్యాటరీ, డిజైన్, ప్రీమియం ఫీచర్లతో ప్రీమియం కమ్యూటర్ విభాగాన్ని పునర్నిర్వచిస్తుందని కంపెనీ చెబుతోంది.

ఈ అద్భుతమైన ఇంజనీరింగ్ వారసత్వం ఆధారంగా O100 ప్లాట్‌ఫామ్ భారతదేశ నేల నుంచి రియలబిలిటీ, సరసమైన ధర, ఉపయోగాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. O100 ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడిన మోటార్‌సైకిళ్లను 2025 ఉత్తరార్ధంలో (రెండవ సగంలో) విడుదల చేయనున్నట్లు ఓబెన్ ఎలక్ట్రిక్ ప్రకటించింది.

ఓబెన్ ఎలక్ట్రిక్ వ్యవస్థాపకురాలు, సీఈఓ మధుమిత అగర్వాల్ మాట్లాడుతూ.. "ఓబెన్ ఎలక్ట్రిక్‌లో మేము రియల్ వరల్డ్ మొబిలిటీ సవాళ్లను పరిష్కరించచే లక్ష్యంతో డిజైన్ చేసి నిర్మిస్తున్నాము. మా కొత్త O100 భారతదేశంలోని సామాన్య ప్రజల రోజువారీ ప్రయాణాల కోసం రూపొందించబడింది. ప్రతి భారతీయుడికి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను ఆచరణాత్మక వాస్తవంగా మార్చే లక్ష్యాన్ని కలిగి ఉంది.

మా స్వంత LFP బ్యాటరీ టెక్నాలజీ, మోటార్, VCU (వెహికల్ కంట్రోల్ యూనిట్), ఛార్జర్‌లతో సహా ఇతర కీలక భాగాలను ఉపయోగించడం ద్వారా.. మేము కొత్త తరం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లకు బలమైన, ఇంటిగ్రేటెడ్ పునాదిని నిర్మించాము. ఇది పట్టణ, గ్రామీణ భారతదేశం అంతటా EV (ఎలక్ట్రిక్ వాహనం) వినియోగాన్ని వేగవంతం చేస్తుంది" అని ఆమె తెలిపారు.

More from DriveSpark

Article Published On: Thursday, May 22, 2025, 13:15 [IST]
English summary
Oben electric unveils o100 platform a game changer for indian evs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+